Home Movie Reviews Telugu Movie Reviews బుర్ర ఖరాబ్! 'బుర్రకథ' రివ్యూ

బుర్ర ఖరాబ్! ‘బుర్రకథ’ రివ్యూ

 

‘లవ్లీ ఎనర్జిటిక్ స్టార్’ ఆది సాయికుమార్ 9 వరస ఫ్లాపులతో సతమతమవుతూ, మరో ఫ్లాపుకి రెండు బుర్రలతో సమాయత్తమయ్యాడు. విశేషమేటంటే సగం సినిమాకే మన బుర్ర ఖాళీ చేశాడు. దర్శకుడుగా మారిన మాటల రచయిత డైమండ్ రత్నబాబు ఆది చేత ఈ అద్భుతం చేయించాడు. ఆదికి ఎందుకీ కష్టం వచ్చిందో ఓ సారి చూదాం…

కథ
అభిరామ్ (ఆది)  రెండు మెదళ్ళతో జన్మిస్తాడు. రెండు రకాలుగా ప్రవర్తిస్తాడు. ఏదైనా పెద్ద శబ్దం వినబడినప్పుడు ఒక మెదడు మూసుకు పోయి, రెండో మెదడు తెరచుకుని ఆ మేరకు మారిపోతూంటాడు. అతడి ఒక మెదడులో మొరటు వాడైన అభి వుంటే, రెండో మెదడులో సాత్వికుడైన  రామ్ వుంటాడు. ఎప్పుడెలా ఆలోచిస్తాడో, ప్రవర్తిస్తాడో అర్థం గాక తండ్రి ఈశ్వర ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ఆందోళన చెందుతూంటాడు. అభి లవ్ అంటే, రామ్ సన్యాసం అంటాడు. అభి హ్యాపీ (
మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి) ని ప్రేమిస్తాడు. ఈమె డాక్టర్ ప్రభుదాస్ (పోసాని) కూతురు. ఇతను కూతుర్ని అభికిచ్చి పెళ్ళిచేసి, ఆపరేషన్ చేసి ఒక మెదడు తీసేయాలనుకుంటాడు. మరో వైపు గగన్ విహారి (అభిమన్యు సింగ్) అనే రాజకీయనాయకుడు అభి మీద కక్ష గడతాడు. ఈ రెండు సమస్యలతో బాటు, తనలో వున్న పరస్పర శత్రువుల్ని అభిరామ్ ఎలా ఎదుర్కొన్నాడనేదే మిగతా కత.

ఎలావుంది కథ   
చాలా దయనీయంగా వుంది. బి, సి గ్రేడ్ కథలు కూడా ఇలా వుండవు. ఒక మనిషిలో రెండు మెదళ్లనే లాజిక్ లేని, వైద్యశాస్త్రంలో లేని అల్లాటప్పా అంశంతో కథ చేశారు. పైగా పాత మూస కథ. మార్కెట్ యాస్పెక్ట్ ఏ కోశానా లేని, కింది తరగతి ప్రేక్షక లోకానికి కూడా దూరంగా వుండిపోయిన అర్ధం పర్థం లేని కథ. ఇంకా ఈ రోజుల్లో ఇలాటి సినిమా తీశారంటే  ఆశ్చర్య పోవాల్సిన ఘటన. దీని మేకర్, అతడి ఐదుగురు స్క్రీన్ ప్లే రచయితలూ అతి పురాతన కాలంలో ఇరుక్కుపోయి, పుల్లమ్మ సినిమా సింగారించి జనం మీదికి వదిలారు. ఇంత అట్టర్ ఫ్లాప్ కథ రాయడానికి ఐదుగు స్క్రీన్ ప్లే రచయితలు అవసరమా అన్పించే వైచిత్రి. మాటల రచయిత సినిమా కథ రాయలేడనడానికి ఇంకో మచ్చు తునక.

ఎవరెలా చేశారు
అల్లాటప్పా కథకి ఎవరెలా చేశారో చెప్పుకోవడం దండగ. తనలో 70 ఏళ్లావిడని మోసే పాత్రలో సమంత ముందు అది వెలవెల బోతాడు. తనలో అభి, రామ్ పాత్రల్ని ఏం పోషించాడో ఎక్కడా కంటికి ఆనదు. ఏం చేయబోయినా ఆల్రెడీ వున్న అపరిచితుడో, అమర్ అక్బర్ ఆంథోనీయో అయిపోతాడు. ఇంకా  రాబోయే ఇస్మార్ట్ శంకర్ అయిపోతాడు. ఈ సినిమా రాంగ్ ఎంపిక. ప్రమాణాల పరంగా చూసినా గత ఫ్లాపులు ఇంతకంటే క్వాలిటీతో వున్నాయి.

హీరోయిన్ మిస్తీ చక్రవర్తి ఆదిమ కాలపు పాత్ర. ఈమె మదర్ థెరిసాగా చెప్పుకుని సేవ చేస్తూంటే హీరో చూసి ప్రేమలో పడిపోవడం ఇంకా ఎక్కడి అరిగిపోయిన ఫార్ములా! పోసానీ, రాజేంద్రప్రసాద్, అభిమన్యూ సింగ్ లవి పాత్రలు కావు, యాతనలు. బొంగరం కామెడీతో పృథ్వీ ఎంత నవ్వించాలని ప్రయత్నం చేసినా నవ్వకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు కింది తరగతి మాస్ ప్రేక్షకులు కూడా. అదే ‘ఓహ్ బేబీ; ని పగలబడి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ప్రేక్షకులు కాలంతో పాటు వున్నారని గ్రహించాలి డైమండ్ రత్న బాబు. కాస్త బయటి ప్రపంచంలో కొచ్చి మార్కెట్ స్థితి గతులు చూడాలి.

 ఇక పాటల తీరుతెన్నులు, కెమెరా వర్క్, ఇతర సాంకేతికాలు బి గ్రేడ్ స్థాయిలో వున్నాయి.

చివరికేమిటి
ఐదుగురు స్క్రీన్ ప్లే రచయితలకి స్క్రీన్ ప్లే గురించి అసలేమీ తెలీదు. ఈ సినిమాని అవకాశంగా తీసుకుని స్క్రీన్ ప్లే నేర్చుకోవాలనుకున్నట్టున్నారు.  నేర్చుకోవడానికి కూడా బేసిక్స్ అంటూ ఏమీ తెలియవు. ఇంటర్వెల్ కి కూడా కథేమిటో అర్ధంగాక, పాయింటు ఎస్టాబ్లిష్ చెయ్యలేక వదిలేశారు.  రెండుగా వున్న హీరో  ఆది గోల్ ఏమిటో, ఎవరితో పోరాటానికి సిద్ధమయ్యాడో చెప్పలేక చేతు లేత్తేశారు. సాంతం అతుకులబొంత సీన్లేసి, ప్రేక్షకుల సహన శక్తి మీద, నరాల మీద సమ్మెట పోట్లు పొడిచారు. పాత అరిగిపోయిన పాత్రలతో, కథేమీటో తెలీని పాత కాలం చెల్లిన సీన్లతో, దారుణమైన  టేకింగ్ తో,  పసలేని డైలాగులతో,  నవ్వించలేని కామెడీలతో  ‘బుర్ర కథ’ ని కుర్ర కథగా చేయలేక పోయారు.

 

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు
తారాగణం : ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, నైరా షా, అభిమ‌న్యుసింగ్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి,
స్క్రీన్‌ప్లే: ఎస్‌.కిర‌ణ్‌, స‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌భ‌వాన్
సంగీతం : సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం :  సి.రాంప్ర‌సాద్‌
బ్యానర్ : దీపాల ఆర్ట్స్‌
నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్
విడుదల : జులై 5, 2019
1 / 5

సికిందర్

 

 

Recent Posts

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

అల్లు అర్జున్ ప్లాన్‌కి క‌రోనా దెబ్బ‌!

2020... ఈ ఇయ‌ర్ హీరో అల్లు అర్జున్‌కు.. క‌రోనా వైర‌స్‌కు చాలా స్పెష‌ల్ ఇయ‌ర్‌. మాన‌వాళికి మాత్రం కాళ‌రాత్రుల్ని ప‌రిచ‌యం చేస్తున్న ఇయ‌ర్. ఈ ఏడాది అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో...

తెలంగాణలో కరోనా తొలి మరణం వెనుక భయానక వాస్తవాలు!

తెలంగాణలో కోవిడ్-19 తొలి మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు మరణించిన అనంతరం.. చేసిన పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెద్ద వయసు కాబట్టి కరోనా వైరస్‌...

బీటలు వారుతోన్న తెలుగు దేశం పునాదులు..

తెలుగు దేశం పార్టీ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ రాజకీయాల్లో ఓ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టిన ప్రాంతీయ కెరటం. తెలుగువారి 'ఆత్మగౌరవ' నినాదంతో 1982 మార్చి 9న విశ్వవిఖ్యాత నటుడు నందమూరి...

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...