fbpx
Home Movie Reviews 'మన్మథుడు -2' - ట్రైలర్ రివ్యూ ఇదిగో!

‘మన్మథుడు -2’ – ట్రైలర్ రివ్యూ ఇదిగో!

‘మన్మథుడు -2’ ట్రైలర్ రివ్యూ ఇదిగో!

కింగ్ నాగార్జున ‘మన్మథుడు-2’ తో ఫన్మథుడై తెగ నవ్వించడానికి వచ్చేశారు. ఈ ఉదయం విడుదలైన ట్రైలర్ లో లేటు వయసు లవర్ గా చిలిపి చిలిపిగా చిల్ అయ్యారు. పొడగరి భామ రకుల్ ప్రీత్ సింగ్ తో నాటీ నాటీ గా అల్లరి చేశారు. తన ఫ్యాన్స్ కే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ కి సైతం గిలిగింతలు పెట్టే క్లాస్ కామెడీతో ఎంటర్ టైన్ చేశారు. ట్రైలర్ కి ముందు రిలీజ్ చేసిన టీజర్ తోనే పిచ్చ పిచ్చగా వైరల్ అయ్యారు. ఇప్పుడు ట్రైలర్ తో మరో వైరల్ మేనియా సృష్టించ బోతున్నారు.

ట్రైలర్ లో దాదాపు సినిమా ఎలా వుంటుందో చూపించేశారు. ప్రేమలో ఏదో పథకమేసినట్టు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, “అద్భుతం, ఆమోఘం, ఇటువంటి పథకం శ్రీ కృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు!” అని నాగ్ అనడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ఇంకో చోట తల్లి పాత్రలో లక్ష్మి, “మూడు నెలల్లో శ్యాంకి పెళ్లి జరగడం ఖాయం!” అని బల్లగుద్ది చెప్తుంది. ఇప్పుడు రోమాంటిక్ జంట నాగ్ – రకుల్ లు పిక్చర్లోకి వస్తారు. అందమైన లొకేషన్లో ఎక్కడికో ట్రావెల్ చేస్తూ, “ఎప్పుడూ ప్రేమలో పడలేదా?” అని రకుల్ ఆసక్తిగా అడుగుతుంది. అప్పుడు నాటీ నాగ్, “ ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయను” అని సింగిల్ లైనులో డబుల్ మీనింగ్ తో పంచ్ ఇవ్వడంతో థియేటర్లు ఎలా హోరెత్తిపోతాయో ఊహించవచ్చు.

ఇలా ట్రైలర్ లో ఫస్ట్ టర్నింగ్ ఇచ్చాక, కూల్ చేస్తూ, బిజిఎంలో సాంగ్ తో మాంటేజెస్ పడతాయి. మదర్ తో, ఫ్రెండ్స్ తో నాగ్ హోమ్లీగా ఎంజాయ్ చేస్తున్న విజువల్స్. ఇది బీచి వరకూ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టర్నింగ్ లో నాగ్ ని ప్రశ్నించిన రకుల్, ఇప్పుడింకో ప్రశ్న వేస్తుంది – “మీ అమ్మానాన్నలకు తెలుసా?” అని. క్యూరియాసిటీ రేకెత్తించే ప్రశ్న. ఏమిటి అమ్మా నాన్నలకు తెలిసిన విషయమనేది మరింకో సస్పన్స్.

ఇక రకుల్ వెళ్లి మదర్ లక్ష్మిని అడిగినట్టు, లక్ష్మి జవాబు చెప్పడం, “ఎందుకంటే మా వాడికి నీకంటే వయసు ఎక్కువ కదా!” అని రకుల్ కి షాకివ్వడం. దీంతో నాగ్ రకుల్ కంటే చాలా పెద్ద వాడని ఎస్టాబ్లిష్ చేయడం. కథలో అసలు పాయింటు రివీల్ చేయడం.

ఇంకో షాట్ లో రావురమేష్ రకుల్ ని కిందా మీదా చూస్తూ, “బాగానే వున్నావ్ గా, ఈణ్ణి చూసుకున్నవేంటి? ఏ క్యాస్టూ?” అని వ్యంగ్యంగా అంటే, నాగ్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ వెంటనే అందుకుని, “బ్రాడ్ కాస్టూ!” అని చురక అంటించడం. రకుల్ చాలా షేమ్ ఫీలవడం.

ఇలా యంగ్ ఏజికీ ఓల్డ్ ఏజికీ మధ్య లవ్ లో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తూ ఫన్నీగా ముందుకు పోతుంది ట్రైలర్. మొత్తానికి సుఖాంతమై వెన్నెల కిషోర్ తో క్లోజింగ్ డైలాగు పడుతుంది – “నీ కృష్ణావతారం అయిపోయిందిక, రామావతారం స్టార్ట్ అయింది” అంటూ.

ఇలా అక్కడక్కడ ముఖ్యమైన పాయింట్స్ ని దాస్తూ, సస్పెన్స్ ని క్రియేట్ చేసి, ఒక ఫ్లోలో, సినిమా మీద ఆసక్తిని విపరీతంగా పెంచేస్తున్న ఈ డిఫరెంట్ రోమాంటిక్ ఫన్ ట్రైలర్ హిట్టే. ఇక సినిమా హిట్టవడమే ఆలస్యం. ‘చిలసౌ’ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అన్పించుకున్న తమిళ నటుడు రాహుల్ రవీంద్రన్, ఈ నాగ్ కొత్త వెంచర్ తో ఇంకో మెట్టు పైకి ఎక్కుతాడేమో చూడాలి.

ఇందులో కీర్తీ సురేష్, సమంతా అక్కినేనిలు గెస్ట్ పాత్రల్లో అలరించబోతున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్, కెమెరా సుకుమార్, నిర్మాణం అన్నపూర్ణా స్టూడియోస్, వయా కాం 18 మోషన్ పిక్చర్స్, అనంది ఆర్ట్ క్రియేషన్స్. ఆగస్టు 9న విడుదల.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ