Home Movie Reviews `అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

`అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్‌, ప్రిన్స్‌, జిష్షుసేన్ గుప్తా, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, స‌ర్గున్ కౌర్‌, స‌త్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ‌: నాగ‌శౌర్య‌,
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
రిలీజ్ డేట్‌: 31-01-2020
రేటింగ్‌: 2.5

2011లో కెరీర్ ప్రారంభించిన నాగ‌శౌర్య‌కు గుర్తింపుని, త‌న కెరీర్‌లో మంచి హిట్‌ని అందించింది మాత్రం `ఛ‌లో` మాత్ర‌మే. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఆ త‌ర‌హా మ్యాజిక్‌ని నాగ‌శౌర్య చేయ‌లేక‌పోయాడు. అత‌ని చుట్టూ వున్న వాతావ‌ర‌ణం, వ్య‌క్తుల ప్ర‌భావ‌మో ఏమో తెలియ‌దు కానీ త‌న‌కు త‌గ్గ క‌థ‌ల్నిఎంచుకోలేక వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నారు. సొంత బ్యాన‌ర్‌పై చేసిన `న‌ర్త‌న‌శాల‌` దారుణంగా ఫ్లాప్ అయినా మ‌ళ్లీ సొంత సంస్థ‌లోనే తాజా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ని తుడిచేసుకోవాల‌ని, మాస్ హీరోగా గుర్తింపుని పొందాల‌ని నాగ‌శౌర్య చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిందా?. అత‌ని కాన్ఫిడెన్స్‌కు త‌గ్గ‌ట్టే సినిమా ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

నాగ‌శౌర్య‌కు చెల్లెలు అంటే ప్రాణం. ఆమెకు ఎలాంటి ఆప‌ద రాకూడ‌ద‌ని, త‌ను హాయిగా న‌వ్వుతూ వుండాల‌ని కోరుకుంటుంటాడు. అలాంటి చెల్లెలు పెళ్లికి ముందు గ‌ర్భ‌వ‌త‌ని తెలుస్తుంది. అయితే అది ఎలా జ‌రిగింది అన్న‌ది ఆమెకే తెలియ‌దు. ఆ త‌రువాత అబార్ష‌న్ చేయించి పెళ్లి చేస్తాడు. త‌న చెల్లెలి త‌ర‌హాలోనే వైజాగ్‌లో మ‌రింత మంది అమ్మాయిల‌కు అలాంటి సంఘ‌ట‌నే ఎదుర‌వుతుంది. కొంత మంది అమ్మాయిలు వ‌రుస కిడ్నాప్‌ల‌కు గుర‌వుతారు. ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్న‌ది ఎవ‌రు?.. ఎందుకు చేస్తున్నారు? అన్న‌ది మిస్ట‌రీగా మారుతుంది. ఈ మిస్ట‌రీని ఛేదించ‌డానికి రంగంలోకి దిగిన నాగ‌శౌర్య ఏం చేశాడు? .. కిడ్నాప్‌ల వెన‌కున్న అస‌లు సూత్ర‌ధారిని క‌నిపెట్టాడా? క‌నిపిఎడితే వాడి టార్గెట్ అమ్మాయిలే ఎందుకు? అన్న విష‌యాలు తెలియాలంటే `అశ్వ‌థ్థామ‌` సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

యంగ్ హీరోగా క్రేజ్ వున్నా త‌న క్రేజ్‌కి త‌గ్గ చిత్రాల్ని నాగ‌శౌర్య చేయ‌లేక‌పోయాడు. మొహ‌మాటం కోసం ఓ బేబీ, క‌ణం వంటి చిత్రాల్లో న‌టించి మ‌రింత క్రేజ్‌ని త‌గ్గించుకున్నాడు. అయితే `ఛ‌లో`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని పించుకున్నా అమ్మ‌మ్మ‌గారిల్లు, న‌క్త‌న‌శాల, ఓ బేబీ వంటి చిత్రాల‌తో మ‌ళ్లీ వెన‌క‌బ‌డ్డాడు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి మాస్ ఇమేజ్ కోసం నాగ‌శౌర్య చేసిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ఈ విష‌యంలో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. త‌న‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్న డైరెక్ట‌ర్‌ల‌కు `అశ్వ‌థ్థామ‌`తో డైరెక్ట్ ఇండికేష‌న్స్ ఇచ్చాడు. మాస్ అంశాల్లో త‌న ఎన‌ర్జీ లెవెల్‌ని చూపించి ఆక‌ట్టుకున్న నాగ‌శౌర్య క‌థా, క‌థ‌నం విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది. అత‌ని శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కేది. మెహ‌రీన్ న‌ట‌న‌కు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అయితే ఉన్నంత‌లో బాగానే చేసింది. ప్ర‌ధాన విల‌న్‌గా క‌నిపించ‌కుండా దోబూచులాడిన జిష్షుసేన్ గుప్తా సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. అత‌నికి, హీరోకి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా వున్నాయి. హ‌రీష్ ఉత్త‌మ‌న్ న‌ట‌న కూడా బాగుంది. ప్రిన్స్‌, స‌ర్గున్ కౌర్‌, స‌త్య త‌దిత‌రులు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక వ‌ర్గం:

నాగ‌శౌర్య అందించిన క‌థ బాగున్నా అందులో చేర్చిన స‌న్నివేశాలు చాలా వ‌ర‌కు సినిమాకు అత‌క‌లేద‌ని చెప్పాలి. ఒక ద‌గ్గ‌ర హైలో వుంటే మ‌రో ద‌గ్గ‌ర లోలో వుండ‌టం… ఎప్ప‌టిక‌ప్నుడు ఈ సీన్ బాగుంటే వ‌చ్చే సీన్ మీర బాగుంటుందేమో అనుకునే లోగా ట‌ప్‌మ‌ని గ్రాఫ్ ప‌డిపోవ‌డం లాంటివి చాలానే వున్నాయి. ఇక క‌థ‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఎక్క‌డా సంబంధం వున్న‌ట్టు క‌నిపించ‌దు. ఈ క‌థ‌కు ఈ స్థాయి యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అవ‌స‌మా? అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగా ర‌మ‌ణ తేజ క‌థ‌ని గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌డంలో ఫెయిల‌య్యాడు. ఎమోష‌న‌ల్ డ్రైవ్‌తో సాగాల్సిన సినిమా అక్క‌డ‌క్క‌డ డీవేట్ అవుతూ సాగుతుంది.
ఈ సినిమా కోసం మ‌నోజ్ రెడ్డి ది బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఆయ‌న అందించిన ఫొటోగ్ర‌ఫీ సినిమాకి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చింది. ఇక అన‌ల్- అర‌సు చిత్రీక‌రించిన యాక్ష‌న్ బ్లాక్స్ సూప‌ర్బ్‌. ఇవి కొంత సినిమాకు ప్లస్ అయ్యాయి. గ్యారి బిహెచ్ ఉన్నంత‌లో త‌న ప‌ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు కానీ ఫ‌స్ట్ హాఫ్‌లో చేతులు ఎత్తేసిన‌ట్టే క‌నిపించింది.
శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల పాట‌లు ఓకే అనిపించాయి. జిబ్రాన్ నేప‌థ్య సంగీతం మాత్రం ఓ రేంజ్‌లో వుంది. సినిమా మూడ్‌ని మెయింటైన్ చేయ‌డంలో అది కీల‌క పాత్ర పోషించింది.

విశ్లేష‌ణ‌:

నాగశౌర్యకు గ‌త కొంత కాలంగా ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ గురించి విని విని విసుగుపుట్టింద‌ట‌. ఆ ఇమేజ్ త‌న‌కొద్దు బాబోయ్ అంటూ మాస్ ఇమేజ్ కోసం చేసిన చిత్రం `అశ్శ‌థ్థామ‌`. ఆ కోరిక‌ను తీర్చేలానే వుంది. కానీ క‌థ‌, క‌థ‌నంలో మ‌రిన్ని మార్పులు చేసుకుని ప‌క్కాగా దిగితే మ‌రింత బాగుండేది. దాంతో మాస్ హీరోగా వంద మార్కులు సాధించాల‌నుకున్న నాగ‌శౌర్య యాభై మార్కుల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.
మాస్ మ‌సాలా యాక్ష‌న్ సీన్స్‌, జిష్షూ సైకో యాక్ష‌న్‌.. వెర‌సి కొత్త త‌ర‌హా సైకో థ్రిల్ల‌ర్ చిత్రాల‌ని కోరుకునే ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఈ సినిమా న‌చ్చుతుంది కానీ రెగ్యుల‌ర్ ఫ్యామిలీ ఎమోష‌న్ ఫిలింస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూడాల‌నుకునే వారిని మాత్రం ఖ‌చ్చితంగా నిరాశ ప‌రుస్తుంది.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా...

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...