Home Entertainment Master Pre Review : మాస్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే.. మాస్ట‌ర్ ప్రీ రివ్యూ

Master Pre Review : మాస్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే.. మాస్ట‌ర్ ప్రీ రివ్యూ

Master Pre Review : మాస్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే.. మాస్ట‌ర్ ప్రీ రివ్యూ, విమ‌ర్శ‌కుల‌కు విర‌క్తి!

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన తాజా చిత్రం మాస్ట‌ర్. ఖైదీ ఫేం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న్ క‌థానాయిక‌.గా న‌టించ‌గా, అర్జున్ దాస్, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుక‌గా నేడు థియేట‌ర్‌లోకి వ‌స్తున్న మాస్ట‌ర్ సినిమా రికార్డులు చెరిపేయ‌డం ఖాయం అని అంటున్నారు. 15 నెల‌ల త‌ర్వాత త‌మ అభిమాన హీరో సినిమా థియేట‌ర్‌లోకి రావ‌డంతో ఫ్యాన్స్ పండుగ చేసేకుంటున్నారు. డ‌ప్పుల‌తో, డ్యాన్స్‌ల‌తో, పాలాభిషేకాల‌తో థియేట‌ర్స్ ద‌గ్గర నానా రచ్చ చేస్తున్నారు.

Master Pre Review : మాస్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే.. మాస్ట‌ర్ ప్రీ రివ్యూ
Master Pre Review : మాస్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే.. మాస్ట‌ర్ ప్రీ రివ్యూ

విజ‌య్ సాంటి స్టార్ హీరో ఖైదీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తీసిన లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంది అనే స‌రికి అంద‌రిలో అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఇక అభిమానుల సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్ట‌ర్ చిత్రంతో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. మ‌రి వారి అంచ‌నాల‌ను విజ‌య్ నిలబెట్డాడా, విదేశాల‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోస్ పూర్తి కాగా, అక్క‌డి ప్ర‌జ‌లు ట్విట్ట‌ర్ లో ఎలా స్పందిస్తున్నారు అనేది చూద్దాం.

త‌మిళనాడులో బుధ‌వారం ఉద‌యం బెనిఫిట్ షోస్ ప‌డ‌గా, మ‌లేషియా, ఆస్ట్రేలియా , అమెరికా వంటి దేశాల‌లో ప్రీమియ‌ర్ షోస్ ప‌డ్డాయి. ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌లో విజ‌య్ అద‌ర‌గొట్టాడు. ద‌ర్శ‌కుడు అభిమానులు ఊహించిన‌ట్టే ఎలివేట్ చేశారు. తొలి గంట‌లో విల‌క్ష‌ణ‌త‌ను చూపించ‌గా, ఫ్రొఫెస‌ర్, విధ్యార్ధి సన్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. ఫ‌స్టాఫ్ మొత్తాన్ని విజ‌య్ సేతుప‌తి త‌న సోలో ప‌ర్‌ఫార్మెన్స్‌తో దోచుకున్నాడు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. విజ‌య్ సేతుప‌తి, విజ‌య్ మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇద్ద‌రి పాత్ర‌లు ఒక‌రిని మంచి ఒక‌రు అనేలా ఉన్నాయి.

క‌ళాశాల‌లో జ‌రుగుతున్న మ‌ర‌ణాల గురించి తెలుసుకున్న విజ‌య్ త‌న అవ‌స‌రం ఉంద‌ని భావించి ప్రొఫెస‌ర్‌గా వెళ‌తాడు. అదే స‌మ‌యంలో మాళ‌విక మోహ‌న్ ప‌రిచ‌యం అవుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ కొంత సేపు సాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజ‌య్ మాస్ ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొడ‌తాడ‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికీ, అంద‌రికి షాక్ ఇచ్చాడు. క్లాస్ లుక్‌లో దర్శ‌న‌మిస్తూ సోలోగా మూవీని న‌డిపించాడు. తన పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేసిన విజ‌య్ అద‌రగొట్టాడు. అంతేకాదు త‌న ఫ్యాన్స్‌కు ఎక్క‌డ‌లేని సంతోషాన్ని క‌లిగించాడు. అభిమానులు సూప‌ర్ హిట్ అంటుంటే విమ‌ర్శ‌కులు మాత్రం పెద‌వి విరుస్తున్నారు.

- Advertisement -

Related Posts

చరణ్ ఆ దర్శకుడితో సినిమా చెయ్యట్లేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ కంప్లీట్ అవ్వగానే శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే ఆయన గౌతమ్ తిన్ననూరి...

వకీల్ సాబ్’కు కోర్టులో షాక్.. భారం అంతా పవన్ మీదనే

వకీల్ సాబ్' సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడిచిన వివాదం ముగిసింది. ప్రభుత్వ వాదనను ఏకీభవిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును...

ఈ నెల సినిమాలకు కష్టాలు తప్పవన్నమాట

కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే తెలుగు...

Latest News