Varun Tej Ghani Twitter Review : ట్విట్టర్ రివ్యూ : వరుణ్ తేజ్ “గని” పంచ్ పేలిందా..??

Varun Tej Ghani Twitter Review :  కొద్దో గొప్పో మెగా ఫ్యామిలీ నుంచి కాస్త రొటీన్ కి బ్రేక్ ఇచ్చి కొత్త సినిమాలతో వచ్చే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. ఇదొక కొత్త సబ్జెక్టు తినే వచ్చే వరుణ్ తేజ్ లేటెస్ట్ గా చేసిన మరో కొత్త బ్యాక్ డ్రాప్ సినిమా “గని”. కొత్త దర్శకుడు కిరణ్ కొర్ర పాటి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు నుంచో రిలీజ్ కి రావాల్సి ఉన్న సినిమా.

అయితే ఫైనల్ గా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఆల్రెడీ ప్రీమియర్స్ చూసినవాళ్లు ట్విట్టర్ లో చెబుతున్నారు. అయితే మేజర్ గా ఈ సినిమాకి బాగాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా సో సో గానే ఉందని కానీ సినిమాలో ప్రొడక్షన్ లైన్ గాని వరుణ్ తేజ్ గాని బాగున్నాడని అంటున్నారు.

అలాగే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయ్ కానీ సినిమా అయితే అనుకున్న రేంజ్ లో లేదని నెటిజన్స్ అంటున్నారు. అలాగే మరికొందరు అయితే డిజాస్టర్ అని కూడా అనేస్తున్నారు. దీనితో గని పంచ్ అయితే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయినట్టే అనిపిస్తుందని చెప్పాలి.

అలాగే హీరోయిన్ రోల్ కూడా సినిమాలో పెద్దగా కీలకంగా లేదని ఓవరాల్ గా సినిమా చాలా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు. ఇంకా తమన్నా సాంగ్ ఉన్నా అవేవి కూడా వర్కౌట్ కాలేదట. మరి ఈ టాక్ అయితే ఈ సినిమా గట్టెక్కడం అసాధ్యమే అనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

https://twitter.com/Iwatchfilmsss/status/1512203701158567940?s=20&t=N4hZ_WBo6SBe7AFgipb-0w