Bheemla Nayak Twitter Review : ట్విట్టర్ రివ్యూ : “భీమ్లా నాయక్” బ్లాస్ట్ ఎలా ఉందంటే..?

Bheemla Nayak Twitter Review :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “భీమ్లా నాయక్” చిత్రం ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని అందుకుంటుంది. మరి అనేక ప్రాంతాల్లో ముందే ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యిపోయిన ఈ సినిమాపై చూసిన వారు తమ స్పందనలు రివ్యూస్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు.

మరి ఈ క్రమంలో ట్విట్టర్ నుంచి కూడా భీమ్లా నాయక్ పై రివ్యూ వచ్చేసింది. అయితే ఇందులో నుంచి మాత్రం దాదాపు టాలీవుడ్ స్టార్స్ రివ్యూస్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. దర్శకులు అలాగే సినిమా ట్రేడర్స్ సహా పి ఆర్ ఓ లు భీమ్లా నాయక్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసాక వారి రెస్పాన్స్ ని తెలియజేస్తున్నారు.

అయితే దాదాపు అందరు చెబుతున్న మాట ఏమిటంటే సినిమా బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు. ముఖ్యంగా సినిమాని త్రివిక్రమ్ మార్చిన విధానం కానీ అలాగే రానా మరియు పవన్ కళ్యాణ్ ల డైనమిక్ పెర్ఫామెన్స్ లు హైలైట్ కాగా థమన్ ఇచ్చిన స్కోర్ కూడా ఇంకో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచింది అని అంటున్నారు.

టోటల్ గా అయితే ట్విట్టర్ నుంచి పాజిటివ్ రివ్యూస్ మాత్రం ఈ సినిమాపై వినిపిస్తున్నాయి. మరి మా నుంచి రివ్యూ కూడా మరి కొద్ది సేపట్లో అప్డేట్ కానుంది అది చూడ్డానికి సిద్ధంగా ఉండండి.