Acharya Twitter Review : ఆడియెన్స్ నుంచి షాకింగ్ రెస్పాన్స్.!

Twitter Review Of Acharya :  ఎంతో కాలం నుంచి మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ  ఈరోజు రిలీజ్ అయ్యింది. దర్శకుడు శివ కొరటాల తెరకెక్కించిన ఈ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు.
మరి ఈ ఇద్దరి కలయికలో ఎప్పుడు నుంచో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ట్రీట్ ఇచ్చే సినిమా అంటూ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి సినీ వర్గాల నుంచి ఎంత పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా ఒక సినిమా ఫలితాన్ని తేల్చేది మాత్రం అల్టిమేట్ గా థియేటర్స్ లో చూసే ప్రేక్షకులే అని చెప్పాలి.
మరి ఇప్పుడు వీరి నుంచే షాకింగ్స్ రిపోర్ట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా జెనరల్ ఆడియెన్స్ ఈ సినిమా చూసి అసలు ఈ రేంజ్ లో ఉంటుంది అని అనుకోలేదు అంటున్నారు. అసలు కొరటాల మార్క్ సినిమా ఇది కాదు అని చాలా స్లో గా చిన్న లైన్ తో సినిమా తీసారని అంటున్నారు.
సినిమాలో కేవలం రామ్ చరణ్ మెగాస్టార్ లు మాత్రమే కాగా సినిమా మొత్తంలో ఇక ఏ అంశాలు కూడా హైలైట్ కాలేదని అనేస్తున్నారు. అలాగే మెగాస్టార్ నుంచి ఆశించే ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయని మరో టాక్.
ఫైనల్ గా అయితే మెగా ఫ్యాన్స్ కి తప్ప మెగా ఆడియెన్స్ కి ఈ సినిమా ఎక్కే అవకాశం కాస్త తక్కువే అని ఈరోజు ఉదయం నుంచే కాస్త నెగిటివ్ రెస్పాన్స్ తోనే సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే కొరటాల సినిమాలు ముందు కాస్త డివైడ్ టాక్ తోనే మొదలైనా తర్వాత మాత్రం బాగానే నిలబడ్డాయి మరి ఈ సినిమాకి ఫైనల్ గా ఏమవుతుందో వేచి చూడాలి.
https://twitter.com/harikraju/status/1519869692629766145?s=20&t=O-gIgdkfCRKmbu-kHL_H6w