‘సాహో’ ట్రైలర్ రివ్యూ!

‘సాహో’ ట్రైలర్ రివ్యూ!

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సాహో’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై ఊహించినట్టు గానే వైరల్ అయింది. యావద్దేశం ఈ ట్రైలర్ కోసం ఉత్కంఠతో ఎదురు చూశారు. క్రితం విడుదలైన టీజరే ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ప్రేక్షకు లముందుకు వస్తున్న మెగా మూవీ కావడంతో కళ్ళు కాయలు చేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఆశలు, అంచనాలు తీరేట్టుగా విజువల్ మ్యాజిక్ తో వచ్చి వైరల్ అయింది ట్రైలర్.

ఇంతకీ ఈ మూవీలో ప్రభాస్ నటిస్తున్న పాత్రేమిటో టీజర్ లో వెల్లడి కాలేదు. అది ఈ ట్రైలర్ లో రివీలయింది. ట్రైలర్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది. ఇందులో ప్రభాస్ పాత్రతో బాటు కథ కూడా రివీలయ్యేట్టు ట్రైలర్ కట్ చేశారు. ముంబాయిలో రెండు వేల కోట్లరూపాయల దోపిడీని తెలియజేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ దోపిడీని ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రభాస్ అండర్ కవర్ ఏజెంట్ గా ఎంటర్ అవుతాడు. సీబీఐ ఏజెంట్ గా శ్రద్ధా కపూర్ ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ ఎంట్రీ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో బీభత్సం గా వుంటుంది. ప్రభాస్ కి విలన్లు గా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ లో హల్చల్ చేస్తారు. మళ్ళీ యాక్షన్ సీన్స్ వచ్చాక, ప్రభాస్ – శ్రద్ధాల రోమాన్స్, సాంగ్స్ వస్తాయి…అన్ని తరగతుల ప్రేక్షకులకి ఆకట్టుకునేట్టు అన్ని రకాల కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ గ్యారంటీ అని హామీ ఇచ్చేట్టు వుంది ట్రైలర్.

ఇలా కథ, పాత్ర తెలిసిపోయాక ఏ విధంగా ఇది ఊపిరి బిగబట్టి చూసే థ్రిల్ నిస్తుందో వెండితెర పైనే తెలుస్తుంది. 350 కోట్ల ఈ మెగా బడ్జెట్ మూవీకి యాక్షన్ సీన్స్ నే 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మరో వంద కోట్లు వీఎఫ్ ఎక్స్ కి. ఈ రేంజి బడ్జెట్ కి ఎంత వసూలు చేస్తుందో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. నాల్గు భాషల్లో దేశవ్యాప్తంగా ఆగస్టు30 న విడుదల కాబోతోంది.

Saaho Trailer : Telugu | Prabhas | Shraddha Kapoor | Sujeeth | #SaahoTrailer | UV Creations