HomeMovie ReviewsRed Movie Review : రామ్ 'రెడ్' మూవీ రివ్యూ

Red Movie Review : రామ్ ‘రెడ్’ మూవీ రివ్యూ

సినిమా పేరు : రెడ్

నటీనటులు : రామ్ పొతినేని, మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్, సత్య

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

ప్రొడ్యూసర్ : స్రవంతి రవికిశోర్

డైరెక్టర్ : కిశోర్ తిరుమల

రిలీజ్ డేట్ : 14 జనవరి 2021

రామ్ పొతినేని.. ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. చూడటానికి పిల్లోడిలా కనిపించినా.. రామ్ లో ఎనర్జీ మాత్రం వేరే లేవల్ లో ఉంటుంది. అందుకే.. రామ్ ను ఎనర్జీ స్టార్ అని పిలుస్తుంటారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే తన సత్తా ఏంటో తెలుగు ఇండస్ట్రీకి చాటి చెప్పాడు రామ్. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ స్టార్స్ లో రామ్ ఒకరు. సినీ నిర్మాత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీలో పరిచయం అయినా.. సొంతంగా కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రామ్. ఆయన ఎనర్జీతో పాటు డ్యాన్స్, అందం.. అన్నీ రామ్ కు ప్లస్సే. గత సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ అంటూ.. తెలంగాణ యాసను ప్రపంచానికి పరిచయం చేసిన రామ్.. తాజాగా సంక్రాంతి కానుకగా మరోసారి రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి.. రామ్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? తెలుసుకుందాం పదండి..

కథ

ఈసినిమా కథ తెలుసుకోవడానికి ముందు.. ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. అదే సినిమాకు ప్లస్ పాయింట్. ఇద్దరు ఉన్నారంటే అందులో ఒకడు మంచోడు, రెండోడు చెడ్డోడులా అయినా ఉండాలి. లేదంటే.. ఇద్దరిలో ఒకడు ఉన్నోడు.. ఇంకోడు లేనోడుగా అయినా ఉండాలి. సేమ్.. ఈ సినిమా కథ కూడా అలాంటిదే. సిద్ధార్థ్, ఆదిత్య.. అనే రెండు క్యారెక్టర్లలో రామ్ నటించాడు.

ఒక క్యారెక్టర్ సిద్ధార్థ్ సివిల్ ఇంజినీర్. తనతో పాటు పనిచేసే మహిమ(మాళవిక)తో ప్రేమలో పడుతాడు. తనను ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ఆదిత్య ఆవారాగా తిరుగుతుంటాడు. ఆదిత్య, సత్య.. ఇద్దరూ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి పేకాటలో 8 లక్షలు పోగొట్టుకుంటాడు. అప్పుకు తెచ్చి మరీ పేకాట ఆడి.. 8 లక్షలు పోగొట్టుకుంటారు. ఆ డబ్బును వెంటనే కట్టాలంటూ రౌడీలు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తారు. దీంతో డబ్బు కోసం ఆదిత్య తిరుగుతుంటాడు.

Ram Red Movie Review
ram red movie review

కట్ చేస్తే.. సిద్ధార్థ్.. తాను ప్రేమించిన మహిమకు మరో వ్యక్తి ప్రపోజ్ చేయడంతో తట్టుకోలేక.. అతడిని చంపేస్తాడు. ఆ కేసును యామిని(నివేత పేతురాజ్) టేకప్ చేస్తుంది. ఒక సెల్ఫీ ద్వారా.. సిద్ధార్థ్ ను యామిని పట్టుకుంటుంది. అరెస్ట్ చేసి లోపలేస్తుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆదిత్య కూడా అరెస్ట్ అయి అదే స్టేషన్ కు వస్తాడు. ఇద్దరు ఒకే స్టేషన్ లో ఉండేసరికి.. వాళ్లను చూసి పోలీసులే కన్ఫ్యూజ్ అవుతారు.

అసలు.. వీళ్లిద్దరు ఎవరు? ఇద్దరూ ఒకేలా ఎందుకున్నారు? వీళ్లిద్దరికి సంబంధం ఏంటి? ఈకేసును ఎలా సాల్వ్ చేస్తారు? సిద్ధార్థ్, ఆదిత్య మధ్య గొడవ ఎందుకు వచ్చింది? చివరకు సిద్ధార్థ్ ప్రేమను మహిమ ఒప్పుకుంటుందా? యామిని కేసును సాల్వ్ చేసిందా? మధ్యలో ఇంకో హీరోయిన్ అమృత అయ్యర్ పాత్ర ఏంటి? అనేదే మిగితా సినిమా.

ప్లస్ పాయింట్స్

రెడ్ సినిమాకు సెకండాఫ్ ప్రాణం లాంటిది. సెకండ్ హాఫ్ వల్లనే సినిమా ముందుకు సాగింది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్. మణిశర్మ.. మళ్లీ తన సత్తాను చాటాడు. సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా చూపించడంలో కిశోర్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో రామ్ పాత్రలే హైలెట్. ద్విపాత్రాభినయంలో రామ్ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. మొత్తం మీద రెడ్ కూడా వన్ మ్యాన్ షోనే. ఇంటర్వెల్ కు ముందు, ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్స్ మాత్రం సినిమాను ఓ మలుపు తిప్పాయి.

మైనస్ పాయింట్స్

రెడ్ సినిమాలో మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. నో కామెడీ. ఉన్న కొన్ని చోట్లు కూడా పండలేదు. రొటీన్ లవ్ ట్రాక్, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. కొన్ని సీన్లను ముందే ఊహించేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే పరమ బోరింగ్.

కన్ క్లూజన్

మొత్తం మీద చెప్పొచ్చేదేంటంటే.. రామ్ అంటేనే ఎనర్జిటిక్ స్టార్. ఒక్కడు ఉంటేనే సినిమా అదిరిపోద్ది కానీ.. ఈ సినిమాలో ఇద్దరు ఉన్నారు. ఇద్దిరిదీ విభిన్నమైన పాత్ర. రెండు పాత్రల్లోనూ రామ్ ఒదిగిపోయాడు. గ్లామర్ షో కూడా బాగానే ఉంది. పాటలు కూడా ఓకే. కాబట్టి.. ఈ సంక్రాంతికి సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటే ఓకే. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు, రామ్ ఫ్యాన్స్ ఈసినిమాను బాగానే ఎంజాయ్ చేస్తారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News