Home Movie Reviews ఈ రాత్రి తెల్లారదు - ‘రాత్ అకేలీ హై’ రివ్యూ

ఈ రాత్రి తెల్లారదు – ‘రాత్ అకేలీ హై’ రివ్యూ

Raat Akeli Hai Movie Review by Sikander. Raat Akeli Hai released on July 31st and has Radhika Apte and Nawazuddin Siddiqui, as lead pair.

ఓటీటీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో సినిమా ‘రాత్ అకేలీ హై’ నియో నోయర్ జానర్ లో ఒక మర్డర్ మిస్టరీ. కొత్త దర్శకుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహాన్ దీని మేకర్. వరసగా ఇది క్యాస్టింగ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన మూడో సినిమా. ‘దిల్ బేచారా’ తో ముఖేష్ చబ్రా, ‘శకుంతలా దేవి’ తో అనూ మీనన్ అనే ఇద్దరు క్యాస్టింగ్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్ లయ్యారు. ఈ ఇద్దరికీ భిన్నంగా హనీ ట్రెహాన్ మిస్టరీ తీశాడు. ఫ్రేము ఫ్రేముకీ చాలా కష్ట పడ్డాడు.అయితే ఈ క్రియేటివ్ కష్టం మేకింగ్కి వుంటే సరిపోతుందా, కంటెంట్ కి అవసరం లేదా? ఈ ప్రశ్ననోసారి పరిశీలిద్దాం…

Raat Akeli Hai | కథ

ఐదేళ్ల క్రితం ఓ రాత్రి కాన్పూర్ హైవే మీద కారుకి యాక్సిడెంట్ జరిపి జంట హత్యలు చేస్తారు దుండగులు. కారులో భూస్వామి రఘు బీర్ సింగ్ భార్య, డ్రైవర్ వుంటారు. వాళ్ళ మృత దేహాలు దొరక్కుండా చేస్తారు.

ఐదేళ్ల తర్వాత, కాన్పూర్ లో అరవై ఏళ్ల భూస్వామి రఘుబీర్ సింగ్, ఎవరో తెలియని ఉంపుడుగత్తె రాధ (రాధికా ఆప్టే) ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న రాత్రే హత్యకి గురవుతాడు. సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) దర్యాప్తు చేపడతాడు. రాధతో బాటు మహల్లో చాలా పరివారముంటుంది. రఘుబీర్ సింగ్ మొదటి భార్య తమ్ముడు విశాల్, కొడుకు కరణ్, కూతురు కరుణ, అల్లుడు రవి, చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్, మేనకోడలు వసుధ, పనిమనిషి చున్నీ… వీళ్ళందరూ కలిసి ఆస్తి కోసం రాధ చంపిందని ఆరోపిస్తారు. సబిన్ స్పెక్టర్ జటిల్ యాదవ్ అందర్నీ అనుమానిస్తాడు.

కేసులో అందర్నీ ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న అతణ్ణి లోకల్ నాయకుడు మున్నారాజా (ఆదిత్యా శ్రీవాస్తవ) అడ్డుకుంటాడు. మున్నా రాజా ఎసెస్పీ లాల్జీ శుక్లా (తిగ్మాంశూ ధూలియా) కి సన్నిహితుడు. లాల్జీ శుక్లా జటిల్ యాదవ్ దర్యాప్తుకి బ్రేకులేస్తూంటాడు. జటిల్ యాదవ్ కి నిజాన్ని బయటికి లాగి దోషిని పట్టుకోవాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

ఇంతకీ ఎవరు దోషి? ఎందుకు చంపారు? అంత మంచి చరిత్రలేని రాధ పెళ్ళయిన రాత్రి ఏం చేసింది? మతి స్థిమితం లేని హతుడి కొడుకు ఆస్తిని ఆజమాయిషీ చేయలేడని హక్కులు పొందాలని చూస్తున్న హతుడి బావమరిదే చంపాడా? కరెంటు పోయిందని లాంతరేసుకుని హతుడి గదిలోకి వెళ్ళిన పని మనిషి చున్నీ అక్కడ ఎవర్ని చూసింది? హతుడి మేనకోడలు వసుధ ఆ రాత్రి కాసేపట్లోనే వేసుకున్న చున్నీ ఎందుకు మార్చుకుంది? హతుడి చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్ లోకల్ లీడర్ మున్నారాజాని వాటా ఎందుకు అడిగారు? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చున్నీని ఎవరు, ఎందుకు చంపారు? చున్నీని చంపిన హంతకుణ్ణి ఎవరు చంపారు? ప్రమీల ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు రాధా గతమేమిటి? ఐదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల వెనకెవరున్నారు? అసలు హతుడు రఘుబీర్ సింగ్ అసలు స్వరూపమేమిటి? ఈ జటిల కేసుని సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ.

Raat Akeli Hai Review | Now on Netflix Official Site


Raat Akeli Hai | నటనలు – సాంకేతికాలు

సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి మార్క్ వేస్తాడు. పాత్ర గురించి దర్శకుడు వివరించినట్టు, అతను సామాన్యుడిలా వుండాలి. హీరోలా అన్పించకూడదు. చేసే పనులలో హీరోయిజం వుండాలి. అలా సినిమా ఎస్సై లా కాకుండా, రియల్ ఎస్సైలా వుంటాడు. అతడికి 40 ఏళ్ళు. పెళ్లి కాలేదు. అతడి తల్లి (ఇళా అరుణ్) అతడి ఫోటో ఎవరికి చూపించినా రంగు తక్కువ, వయసు ఎక్కువని సంబంధాలు రావు. రంగు పెరగడం కోసం ఒక క్రీము వాడుతూంటాడు. ఇలా అమ్మాయిలకి నచ్చని వాడు, మొత్తమంతా ఆడవాళ్లతో వున్న మహల్లో పడతాడు కేసు గురించి. పెళ్లి రోజే విడో అయిన రాధ పట్ల రోమాంటిక్ గా వుంటూ, ఆమెని కాపాడే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. పాత్ర ఫన్నీగా వుండదు. సీరియస్ గానే వుంటుంది. పాత్రని చివరంటా నిలబెట్టే ప్రయత్నమైతే చేస్తాడు. కానీ కాసేపటి తర్వాత కథే సహకరించదు. ఒకళ్ల తర్వాత ఒకళ్లని ప్రశ్నించే పర్వంతోనే గంటకి పైగా గడిచిపోతుంది. గంటన్నరకి గానీ యాక్షన్ దృశ్యాలు మొదలై పాత్రకి వూపు రాదు. మళ్ళీ చివర్లో అరగంట పాటు వుండే ముగింపు దృశ్యాలు బోరే. ముగింపు థ్రిల్లింగ్ గా లేకపోవడం కారణం.

Read More – థ్రిల్లర్స్ ఇలా తీయవచ్చు!

రాధికా ఆప్టే పేద బాధిత పాత్ర. మగవాళ్ళతో ఆమె గతం జీవితాన్ని మార్చేస్తుంది. పెళ్ళయిన రాత్రే భర్త చావుకి కేంద్ర బిందువయ్యే పాత్ర. దర్యాప్తుకి ఏమాత్రం సహకరించని పాత్ర. ఈమె కూడా ఒక మార్కు వేస్తుంది. ఇక అనుమానితులుగా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులకి ఎక్కువ స్పేస్ లేదు.

సాంకేతికంగా కాన్పూర్ నేపథ్యంలో తీసిన సినిమా. లొకేషన్స్ బావున్నాయి. అయితే నైట్ సీన్లు ఎక్కువ వుండడం, పగలు ఇండోర్ సీన్లు కూడా లో- కీ లైటింగ్ తో వుండడం నియో నోయర్ జానర్ అన్పించాలని తీసినట్టుంది. ఓపెనింగ్ లో నైట్ హైవే యాక్సిడెంట్ సీను నోయర్ జానర్ మర్యాదకి బలమైన నిదర్శనం. అయితే నోయర్ జానర్ మర్యాదలకి లైటింగే కాకుండా ఇంకో ఎనిమిది ఎలిమెంట్స్ వుంటాయి. వీటి జోలికి వెళ్లక పోవడం ఒక లోపం. మూవీలో మిస్టీరియస్ వాతావరణ సృష్టికి నేపథ్య సంగీతం మాత్రం బాగా తోడ్పడింది. పూర్తిగా నోయర్ జానర్ లో లేక పోయినా, కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్ మేకింగ్ నైపుణ్యం మాత్రం సాంకేతికంగా మంచి నాణ్యతతో వుంది. మూవీలో వున్న మిస్టరీ స్వభావానికి తగ్గ డార్క్ మూడ్ విజువల్స్ తో ఒక శైలిని పాటించాడు.

Raat Akeli Hai |కథాకథనాలు

నేను మిస్టరీలు తీయను, సస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే సస్పెన్స్ వుండదు. చివర్లోనే కథేమిటో, అసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతే, సస్పెన్సులు చైతన్యవంతమైన సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతే, ఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీ, మర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. చాలా సిల్లీ. ఈ పెద్ద బాలశిక్ష స్టేజి అవగాహన నుంచి పైకెదగాలి.

కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్, కొత్త రచయిత్రి స్మితా సింగ్ ఈ నోయర్ ని ప్రయత్నించారు. హాలీవుడ్ నియో నోయర్ ‘చైనా టౌన్’ స్ఫూర్తి అన్నాడు ట్రెహాన్. హిచ్ కాక్ తీసిన ‘నార్త్ బై నార్త్ వెస్ట్’ కూడా ప్రభావితం చేసిందన్నాడు. హిచ్ కాక్ అభిమానినన్నాడు. కానీ తను తీస్తున్న నోయర్ ని హిచ్ కాక్ లా సస్పెన్స్ కథలో తీయపోవడం అందరి లాగే సస్పెన్స్ కీ మిస్టరీకీ తేడా తెలియకపోవడం వల్లేనని మనం అర్ధం జేసుకోవచ్చు. కొందరు ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాన్ని సృష్టించాడన్నారు. ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాలు మిస్టరీ నవలలు. మిస్టరీ నవలలు చదివిస్తాయి. మిస్టరీ సినిమాలు బోరు కొడతాయి. ఆగథా క్రిస్టీ మిస్టరీల ముగింపులు మైండ్ బ్లోయింగులు. ట్రెహాన్ మిస్టరీ ముగింపు బోరు. ముగించడానికే అరగంట తీసుకున్నాడు. దాచి పెట్టిన రహస్యాన్ని అరగంట పాటు వివరించాల్సి వచ్చింది. ఇదేమన్నా క్లాస్ రూమ్ పాఠమా?

కొందరు గత సంవత్సరం విడుదలైన ‘నైవ్స్ అవుట్’ తో పోల్చారు. ‘నైవ్స్ అవుట్’ నోయర్ జానర్ కాదు. నోయర్ జానర్ లో రియాన్ జాన్సన్ అంతకి ముందు ‘బ్రిక్’ తీశాడు. పెద్ద స్టార్లతో వస్తూ వుండిన నోయర్ జానర్ తో ప్రయోగం చేసి యువ నటులతో కాలేజీ నేపథ్యంలో టీనేజి నోయర్ గా తీసి సంచలనం సృష్టించాడు. అలాగే ‘నైవ్స్ అవుట్’ లో ఆగథా క్రిస్టీ వాతావరణాన్నే క్రియేట్ చేస్తూ ఒక ప్రయోగం చేశాడు. అగథా క్రిస్టీ నవలల్లో వుండే ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా తీయలేదు. ఎవరు చంపారో మధ్యలోనే చూపించేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా కథ నడిపాడు. అతను శాస్త్రాన్ని చదివి అర్ధం జేసుకుని సినిమాలు తీస్తాడు. ఏది ప్రింట్ మీడియా కథనమో, ఏది విజువల్ మీడియా కథనమో తెలుసుకోకుండా సినిమాలు తీసి ఫ్లాపవుతున్న వాళ్ళు మనదగ్గరే వున్నారు.

Raat Akeli Hai |దర్శకత్వం: హనీ ట్రెహాన్

ఎవరు చంపారు? అన్న విజువల్ మీడియాకి పనికిరాని పాయింటు పట్టుకుని రెండున్నర గంటలు లాగాడు. గంట లోగానే కథ కదలక విసుగు పుట్టిస్తుంది. అరడజను మందిని ఒకరి తర్వాత ఒకర్ని ప్రశ్నించడాలే కదలని సీన్స్ ని క్రియేట్ చేస్తాయి. అనుమానితులందరూ మార్పు లేకుండా అనుమానితులుగానే వుండిపోతారు. కథలో చలనం కోసం అనుమానితులని ఫిల్టర్ చేసి కొందర్ని లిస్టులోంచి తప్పించే చర్యలకి పూనుకోడు సబిన్స్ పెక్టర్. ఎలా వున్న పాత్రల్ని అలా ఈడ్చుకుంటూ పోతూనే వుంటుంది కథ. పోయిపోయి చివరికి హత్యారహస్యం విప్పుతూ అరగంట వివరణ. ఈ వివరణని బుర్ర కెక్కించుకునే ఓపికా ఆసక్తీ వుండవు. చివర్లో వివరణ లెవరిక్కావాలి, విజువల్ యాక్షన్ తో మొదట్నించీ కథ తెలుస్తూండాలి గాని.

ఎవరు చంపారన్నది ముఖ్యం కాదు, ఎందుకు చంపారన్నది ముఖ్యమన్నాడు దర్శకుడు. కానీ కథ నడిపింది అన్ని మిస్టరీల్లాగే ఎవరు చంపారన్న బోరు కొట్టే పాయింటుతోనే. ఎవరు ఎందుకు చంపారో చివర్లో రివీల్ చేశాడు. దాన్ని బట్టి ఈ కథలో స్త్రీలందరూ ఏదో రకంగా హతుడి బాధితులే. అంటే పితృస్వామ్యం పాయింటు అన్నమాట. ‘కహానీ 2’ లో, ‘హైవే’ లో చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు లాగా. ఈ రెండు సినిమాలూ సస్పెన్స్ థ్రిల్లర్స్. ముగింపులో రివీలయ్యే చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు షాకింగ్ గా, డిస్టర్బింగ్ గా వుంటుంది. అదీ ముగింపు అంటే.

ట్రెహాన్ మిస్టరీలో అతను చెప్పినట్టు ఎందుకు చంపారన్నది ముఖ్యమైనప్పుడు, ఎవరు చంపారన్న ప్రశ్నతో కాకుండా, ఎందుకు చంపారన్న ప్రశ్న తలెత్తేలా స్త్రీ పాత్రల్ని డ్రైవ్ చేసి వుంటే సరిపోయేది. అరవై ఏళ్ల వాణ్ణి పెళ్ళయిన రాత్రి ఎందుకు చంపారు? నిజంగానే ఈ ప్రశ్న కుతూహలం రేకెత్తించేదే. కానీ సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఈ ప్రశ్న వదిలేసి, పసలేని ఎవరు చంపారన్న ప్రశ్న మీదే దృష్టి పెట్టి కథ నడుపుకున్నాడు.

మీరందరూ అనుమానితులే అంటాడు, కానీ మిమ్మల్ని చూస్తే జాయింటుగా సమ్ థింగ్ ఇంకేదో ఫీలవుతున్నాను, అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను… అని వుంటే, ఆ ఫీలింగ్ తో కథ నడిపివుంటే, అప్పుడు అరవై ఏళ్ల పెళ్లి కొడుకుని శోభనం కాకుండానే ఎందుకు ఢామ్మని రైఫిల్ తో కాల్చి ఖతం చేసి పారేశారన్న కథకి ఆపరేటింగ్ క్వశ్చన్, లేదా డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేసేది.


―సికిందర్


దర్శకత్వం: హనీ ట్రెహాన్
తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, తిగ్మాంశూ ధూలియా, ఖాలిద్ త్యాబ్జీ, పద్మావతీ రావ్ తదితరులు
రచన: స్మితా సింగ్, సంగీతం: స్నేహా ఖన్వాల్కర్, ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్
బ్యానర్: ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత: రోనీ స్క్రూ వాలా, అభిషేక్ చౌబే
విడుదల: నెట్ ఫ్లిక్స్
2.5/5

** Give your comments on Raat akeli hai Review in the comments sections

- Advertisement -

Related Posts

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

Recent Posts

పోనీ దేశానికి ప్రధానిగా చంద్రబాబును ప్రకటించండి  !

గొప్పలు చెప్పుకోవడం అవసరమే.. కాదని ఎవరూ అనరు.  కానీ చెప్పుకునేదేదో చేసిన గొప్పలు చెప్పుకుంటే బాగుంటుందనే అందరూ అంటారు.  కానీ రాజకీయాల్లో చాలామంది చేసే గొప్పలు పెద్దగా ఉండవు కాబట్టి చేయని గొప్పలను,...

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా రెండు వ్యవసాయ బిల్లులు ఆమోదించబడ్డాయి

పార్లమెంట్ లైవ్ అప్‌డేట్స్: రైతు ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు, 2020, మరియు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల బిల్లుపై రైతు (సాధికారత మరియు రక్షణ)...

గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేముందు ఇంత పెద్ద స్కెచ్ ఉందన్నమాట.. జగన్ మామూలోడు కాదు !

తెలుగుదేశం పార్టీ కీలక నేతల్లో ఒకరు, విశాఖ రాజకీయాల్లో ముఖ్యుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారనే వార్తలు చాలారోజుల నుండి ప్రచారంలో ఉన్నాయి.  కానీ ఇంకా ఆయన బయటికి వెళ్లలేదు.  వైసీపీతో ఇంకా...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

అంటే.. చంద్రబాబే లోకేష్‌ను జైల్లో వేయించాలనా మీరనేది !?

వైసీపీ నేతలు లోకేష్ విషయంలో ఎప్పుడూ కామెడీ చేస్తూనే ఉంటారు.  లోకేష్ మీద వారు సీరియస్ గా మాట్లాడినా అది ఒక్కోసారి జనంలోకి పిచ్చ కామెడీగా వెళుతుంటుంది.  అది కూడ వైసీపీ శ్రేణుల్లోకే...

భారత్ దళాలను ఏదుర్కోలేక గూఢఛారులని ఆశ్రయిస్తున్న చైనా

ఢిల్లీ: నక్క జిత్తుల చైనా మరొక పన్నాగానికి పాల్పడుతున్నది. ఇండియా ని ఎదుర్కోటానికి గూఢచర్యాన్ని ఎన్నుకుంది. డోక్లాం  మరియు గాల్వన్లలో సైనిక మొహరింపుకు సంభందించిన సమాచారాన్ని అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను...

Shama sikander new photos

Hindi Actress Shama sikander new photos Check out, Shama sikander new photos Movie shooting spot photos, Actress Bollywood Shama sikander new photos.

జగన్ ఈ ఒక్క పని చేస్తే చాలు.. చంద్రబాబు కూడ ‘జై జగన్’ అనడం గ్యారెంటీ !

అధికార పక్షం మీద ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు ప్రతిపక్షాలు ప్రధానంగా లేవనెత్తే అంశం తమ పార్టీ గెలిచిన నియోజకవర్గాల మీద పాలక పక్షం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, మా నియోజకవర్గాల్లో అభివృద్ది పడకేసింది, ఉద్దేశ్యపూర్వకంగానే నిధులు...

Entertainment

Mirnaa hd photos

Tamil Actress Mirnaa hd photos Check out, Mirnaa hd photos Movie shooting spot photos, Actress Kollywood Mirnaa hd photos

వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ...

Soundarya Sharma birthday pics

Hindi ActressSoundarya Sharma birthday pics Check out, Soundarya Sharma birthday pics Movie shooting spot photos, Actress Bollywood Soundarya Sharma birthday pics.

Shama sikander new photos

Hindi Actress Shama sikander new photos Check out, Shama sikander new photos Movie shooting spot photos, Actress Bollywood Shama sikander new photos.

లాస్యపై కౌంటర్.. మళ్లీ డిలీట్ చేసిన గీతామాధురి

బిగ్‌బాస్ షోలో ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.. ఏది చేసినా అన్ని రకాలుగా ఆలోచించి చేయాలి. మాట తూలితే జరిగే నష్టం గురించి ఊహించలేం. అలా మాటలు తూలే కొందరు ఎలిమినేట్...

రూంకి పిలిచి బట్టలు విప్పి.. డైరెక్టర్‌ భాగోతం బయటపెట్టిన పాయల్ ఘోష్

ప్రయాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆపై కొన్ని చిత్రాలు చేసింది కూడా. అయితే ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ...

జబర్దస్త్ నుంచి అవినాష్ వెళ్లడంతో అతను ఫుల్ హ్యాపీ.. సన్మానాలు కూడా...

జబర్దస్త్ అవినాష్ బిగ్‌బాస్ 4 తెలుగు ‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా జబర్దస్త్‌ను వీడి బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే నానా తంటాలు పడ్డాడని తెలుస్తోంది. మల్లెమాల వారి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు...

ఆ హీరోయిన్‌ను చాలా మంది దాని గురించే అడుగుతున్నారట..!!

ఒక్క సినిమా చాలు హీరో, హీరోయిన్ల ఫేట్ మారిపోవడానికి. అది మంచికైనా సరే చెడుకైనా సరే. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ అనుభవించిన వారున్నారు. అదే ఒక్క సినిమాతో పాతాళంలో కూరుకుపోయిన వారున్నారు....

Bigg Boss 4 Telugu : ఓహో డబుల్ ఎలిమినేషన్ కథ...

బిగ్‌బాస్ 4 తెలుగు రెండో వారంలో రెండు ఎలిమినేషన్స్ అని నాగార్జున ఓ బాంబ్ పేల్చాడు. నిజంగానే ఒక వేళ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటే ప్రేక్షకులకు అంత సులభంగా చెప్పేసేవాడు కాదు. డబుల్...

సంక్రాంతి బరిలో అక్కినేని సోదరులు.. బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఆ సినిమాకే..!

క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. అక్కినేని నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ...