పవన్ ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ లుక్‌ , గ్లింప్స్ వచ్చేసింది !

మహాశివరాత్రి పర్వదినాన అభిమానులకి పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. టాలీవుడ్ లో క్రియేటివ్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌ తరహా పాత్రలో ఆయన నటించిన చిత్ర ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌ని శివరాత్రి కానుకగా మార్చి 11 న విడుదల చేశారు. ఎప్పుడైతే ఈ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌ వస్తుందని టైమ్‌ ప్రకటించారో.. అప్పటి నుంచి.. సోషల్‌ మీడియాలో ట్యాగ్‌లతో పవన్‌ అభిమానుల హడావుడి కొనసాగుతూనే ఉంది.

 

 

ట్రెండ్‌లో సంచలనాలను క్రియేట్‌ చేస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ ప్రొడ్యూసర్‌ ఏఎమ్‌ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్‌తో పవన్‌ కల్యాణ్‌ని పవర్‌ ఫుల్‌గా చూపిస్తూ వదిలిన ఫస్ట్‌ లుక్‌ చూసి మెగాభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఈ ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే.. పీరియాడికల్‌ నేపథ్యంలో ఫాంటసీ చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ రూపొందుతున్నట్లుగా అర్థమవుతోంది. ఈ తరహా లుక్‌తో పవన్‌ కల్యాణ్‌ నుంచి ఇంత వరకు చిత్రం రాలేదు. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో.. పవన్‌ని ఇలా చూడాలని కలలు కంటున్నారు.

వారి కలలను నిజం చేస్తున్న ఘనత మాత్రం క్రిష్‌, రత్నంలకే చెందుతుంది. ఆ లుక్‌ ఏంటి?. చూస్తుంటేనే గూజ్‌బంప్స్‌ వస్తున్నాయ్‌.. చరిత్రను తిరగరాసే వీరుడు, ధీరుడు, యోధుడుగా ఈ వీరమల్లు రెడీ అవుతున్నాడనేది ఈ లుక్‌తో అర్థమవుతోంది. పీరియాడికల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో.. అసలు వెనకడుగు వేయకుండా.. భారీ సెట్స్‌తో రూపొందిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కట్టడాలన్నింటిని.. ఈ చిత్రంలో చూపించి.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కూడా ఆ కాలానికి తీసుకెళ్లేందుకు క్రిష్‌ ఓ కంచుకోటని సిద్ధం చేస్తున్నట్లుగా.. చాలా రోజులుగా పవన్‌ కల్యాణ్‌ సినిమా కోసం వేచి చూస్తున్న మెగాభిమానులకు కాచుకోండి అనేలా శపథం చేస్తున్నట్లుగా.. ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్నట్లుగా ఈ లుక్‌తో ఓ హింట్‌ ఇచ్చేశారు. ఫస్ట్ లుక్ తోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ హరిహర వీరమల్లు సినిమా విడుదల అయిన తర్వాత ఏ రికార్డ్ కూడా మిగలకుండా అన్నింటిని ఊచకోత కొస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.