ప్రివ్యూ టాక్ : నాగ్ ‘వైల్డ్ డాగ్’ ఫ్లాప్ అయితే కాదు

Nagarjuna'S Wild Dog Preview Talk

కింగ్ నాగార్జున కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ ఈరోజే థియేటర్లలోకి వస్తోంది. ప్రభు సాలోమన్ ఈ సినిమాకు దర్శకుడు. నాగార్జున చాలా కాలం తర్వాత చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో జరిగిన ఇండియాస్ బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ అన్నీ యాక్షన్ ప్యాక్డ్ అనిపించుకున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడ అదరగొట్టారు టీమ్. నాగ్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆయన గత సినిమాల ఫలితాల్ని గుర్తుచేసుకున్న ఆయన అభిమానులు సినిమా మీద ఒకింత డౌట్ పడ్డారనే అనాలి.

నాగ్ చేసింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారు, ఎలాంటి ఢోకా ఉండదని గుండెల మీద చేయి వేసుకునేవాళ్ళు. కానీ యాక్షన్ సినిమా కావడంతో కాస్త జంకారు. పైగా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. అందుకే ఆ భయం. ఒక దశలో సినిమా మరో ‘ఆఫీసర్’ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినబడింది. అయితే అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు కదా. గత సినిమాల ఫ్లాప్ అయినంత మాత్రమే కొత్త సినిమాలు కూడ అలాగే అవుతాయని ఎలా అనుకోగలం. నాగ్ ‘వైల్డ్ డాగ్’ విషయంలోనూ ఇలానే జరుగుతోంది. సినిమాకు ప్రివ్యూ టాక్ బాగానే ఉంది.

యూఎస్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో సరిగ్గా సరిపోయారని అంటున్నారు. అండర్ కవర్ ఆపరేషన్, యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్స్ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇంకొందరైతే స్టైలిష్ యాక్షన్ ఫిలిం అని, నాగ్ పాత్రలో ఒక ఎమోషన్ ఉందని అంటున్నారు. టాక్ చూస్తుంటే సినిమా క్లాస్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. వాళ్లకు కనెక్ట్ అయినా ఏ సెంటర్లలో మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. అప్పుడిక పరాజయం అనే ప్రమాదాన్ని సినిమా తప్పించుకున్నట్టే. ఒకవేళ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కూడ నచ్చినట్టయితే సినిమాలో చిత్రం హిట్ కావడం ఖాయం. ప్రస్తుతానికైతే ఉన్న టాక్ మేరకు సినిమా హిట్ కాకపోయినా ఫ్లాప్ మాత్రం కాదనే నమ్మకం కలుగుతోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles