Home Movie Reviews `ద‌ర్బార్` మూవీ రివ్యూ

`ద‌ర్బార్` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, న‌య‌న‌తార‌, సునీల్‌శెట్టి, నివేదా థామ‌స్‌, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, జ‌స్టిన్ స‌ర్ణ‌, న‌వాబ్ షా,
దిలీప్ టాహిల్‌, యోగిబాబు, తంబి రామ‌య్య‌, శ్రీ‌మాన్ త‌దిత‌ర‌లు ప్ర‌ధాన తారాగ‌ణం,
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌. మురుగ‌దాస్‌,
నిర్మాత‌: అల్లిరాజా సుభాస్క‌ర‌న్‌,
నిర్మాణం: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: అనిరుధ్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్‌,
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌
రిలీజ్ డేట్‌: 09-01-2020
రేటింగ్‌: 3.5

ర‌జ‌నీ తెర‌పై క‌నిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ర‌జ‌నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మ‌రి. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా త‌న‌దైన స్టైల్స్‌తో , మేన‌రిజ‌మ్స్‌తో వెండితెర‌పై మెరుపులు మెరిపిస్తున్నారు. త‌న సినిమాల‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. ఏడుప‌దుల వ‌య‌సులోనూ ర‌జ‌నీలో ఇంకా ఆ స్పార్క్ త‌గ్గ‌లేదు. కానీ త‌న మార్కు బ్లాక్ బ‌స్ట‌ర్‌ని మాత్రం ఆయ‌న అందుకుని చాలా కాల‌మే అవుతోంది. మాస్ట‌ర్ మైండ్‌ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రోబో` త‌రువాత త‌లైవా ఆ స్థాయి హిట్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. కొచ్చ‌డ‌యాన్ నుంచి పేట్ట వ‌ర‌కు ర‌జ‌నీమార్కు సినిమా రాలేద‌నే చెప్పాలి. ఆ లోటుని `ద‌ర్బార్‌` తో తీర్చ‌బోతున్నాం అంటూ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్ చాలా కాన్ఫిడెంట్‌తో చెప్పారు. 15 ఏళ్లుగా మురుగ‌దాస్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ఎదురుచూశాను. అది ఇప్ప‌టికి కుద‌రింది. ఒక సినిమా సూప‌ర్‌హిట్ కావాలంటే దానికి ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. ఆ మ్యాజిక్ ఈ సినిమాకు జ‌రిగింద‌ని ర‌జ‌నీ కూడా గంటాప‌థంగా చెబుతున్నారు. ఆయ‌న న‌మ్మకానికి త‌గ్గ‌ట్టే `ద‌ర్బార్‌` వుందా? త‌లైవా నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని, ర‌జ‌నీమార్కు మ్యాజిక్‌ని కోరుకుంటున్న అభిమానుల‌కు `ద‌ర్బార్‌` ట్రీట్ ఇవ్వ‌నుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌. ముంబైలో వున్న గ్యాంగ్‌స్ట‌ర్స్‌ని ఏరిపారేస్తుంటాడు. ఈ క్ర‌మంలో బ్యాడ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అత‌ని పేరు మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తూ వుంటుంది. త‌న‌దైన స్టైల్లో క్రిమిన‌ల్స్‌ని అంతం చేయ‌డం ఆదిత్య అరుణాచ‌లం స్టైల్‌. చ‌ట్టం చెప్పిన‌ట్టుగా కాకుండా త‌న మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది చేస్తూ ముంబై న‌గ‌రంలోని గ్యాంగ్‌స్ట‌ర్స్‌కి సింహ‌స్వ‌ప్నంగా నిలుస్తారు. ఆదిత్య అరుణాచ‌లం ఎందుకు వ‌రుస ఎన్‌కౌంట‌ర్‌లు చేస్తున్నాడు?. దాని వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యం ఏమిటి? నివేదాథామ‌స్‌కు, ఆదిత్య అరుణాచ‌లంకు ఉన్న సంబంధం ఏంటి? ఇంత‌కీ ఆమె ఆదిత్య అరుణాచ‌లంకు ఏమౌతుంది?. ముంబై డ్ర‌గ్ మాఫియా కింగ్ (సునీల్‌శెట్టి)ని ఆదిత్య అరుణాచ‌లం ఎందుకు టార్గెట్ చేశాడు? వీరిద్ద‌రి మ‌ధ్య వున్న రైవ‌ర్లీకి కార‌ణం ఎవ‌రు? త‌న‌కు ఛాలెంజింగ్‌గా మారిన కిడ్నాప్‌ కేస్‌ని ఆదిత్య అరుణాచ‌లం ఎలా ప‌రిష్క‌రించాడు? చివ‌రికి డ్ర‌గ్ మాఫియా కింగ్ క‌థ‌ని ఎలా ముగించాడ‌న్న‌దే అస‌లు క‌థ‌.

న‌టీన‌టుల న‌ట‌న‌:

ర‌జ‌నీ మార్కు మేన‌రిజ‌మ్స్‌, స్టైల్స్‌ని చూసి ఎంజాయ్ చేయాల‌ని ఆయ‌న అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. `రోబో` త‌రువాత ఆ మార్కు ర‌జ‌నీ మెరుపులు క‌నిపించ‌లేదు. అయితే అవ‌న్నీ ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు ర‌జ‌నీ. బ్యాడ్ కాప్‌గా ముంబైని హ‌డ‌లెత్తించే రౌడీ పోలీస్ క‌మీష‌న‌ర్‌గా ఆయ‌న న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. స్టైల్స్‌కి, మేన‌రిజ‌మ్స్‌కి ఇండియ‌న్ సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ర‌జ‌నీది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న స్టైల్‌ని మ‌రిపించే హీరో ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదంటే ర‌జ‌నీ మేనియా ఏ స్థాయిలో వుంద‌నేది అర్థం చేసుకోవ‌చ్చు. ఆద్యంతం మైండ్‌గేమ్స్‌తో సాగిన ఈ సినిమాని ర‌జ‌నీ స్టైల్స్‌, డైలాగ్స్ తో ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని పెంచేలా చేశాయి. గ‌త చిత్రాల‌తో పోలిస్తే ర‌జ‌నీ ఈ సినిమాలో చాలా యంగ్‌గా, మ‌రింత స్టైలిష్‌గా క‌నిపించారు. ఒక విధంగా ఈ సినిమా ర‌జ‌నీ ఫ్యాన్స్‌కి ఓ పండ‌గే అని చెప్పాలి. న‌య‌న‌తార పాత్ర గురించి చెప్పుకోవ‌డానికి ఇందులో పెద్ద‌గా ఏమీ లేదు. ఎందుకంటే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ‌. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి ఈ చిత్రంలో విల‌న్‌గా డ్ర‌గ్ మాఫియా డాన్‌గా క‌నిపించారు. ర‌జ‌నీ, సునీల్‌శెట్టి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. సునీల్‌శెట్టి కూడా త‌న‌దైన స్టైల్లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. నివేదా థామ‌స్ ఇందులో క‌థ‌కు కీల‌క మైన పాత్ర‌లో న‌టించింది. యోగిబాబు, తంబిరామ‌య్య‌, ప్రీతీక్ బ‌బ్బ‌ర్‌, జ‌స్టిన్ స‌ర్ణ‌, న‌వాబ్ షా, దిలీప్ టాహిల్, శ్రీ‌మాన్ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

భారీ చిత్రాల కెమెరామెన్ సంతోష్‌శివ‌న్ ఫొటోగ్ర‌ఫీ సినిమా లుక్‌ని మార్చేసింది. ప్ర‌తీ ఫ్రేమ్‌ని చాలాగ్రాండీయ‌ర్‌గా చూపించారు. త‌లైవా ర‌జనీ వ‌య‌సుని త‌గ్గించి స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా విష‌యంలో అక్కీయెస్ట్ ప‌ర్స‌న్ ఎవ‌రంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌. `పేట్ట` త‌రువాత ర‌జ‌నీతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ద‌క్కింది. వ‌చ్చిన అవ‌కాశాన్ని బాగానే స‌ద్వినియోగం చేసుకున్నాడు. పాట‌లు, నేప‌థ్య సంగీతం అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా నేప‌థ్య సంగీతం, బీజియంస్ బాగున్నాయి. సీనియ‌ర్ మోస్ట్ ఎడిట‌ర్‌, జాతీయ అవార్డు గ్ర‌హీత శ్రీ‌క‌ర ప్ర‌సాద్ ఎడిటింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. క్రిస్పీ ఎడిటింగ్‌తో జెల‌క్‌ల‌తో అద‌ర‌గొట్టేశారు. మొద‌టి నుంచి భారీ నిర్మాణ విలువ‌ల‌తో సినిమాల్ని నిర్మిస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా సినిమాని లావిష్‌గా నిర్మించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. లైకా నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

విశ్లేష‌ణ‌:

త‌న ప్ర‌తి చిత్రంలో ఏదో ఒక సామాజిక అంశాన్ని క‌థా వ‌స్తువుగా తీసుకుని సినిమా చేసే మురుగ‌దాస్ ఈ సినిమా విష‌యంలోనూ ఇండియాలో బ‌ర్నింగ్ ప్రాబ్ల‌మ్‌గా మారిన మ‌హిళ‌ల వేధింపులు, హెరాష్‌మెంట్‌ని ప్ర‌ధానంగా తీసుకుని ఎక్క‌డ నేరం జ‌రిగితే అక్క‌డే అదే స్థాయిలోనే ప‌నిష్ చేయాల‌నే సందేశంతో ఈ చిత్రాన్ని మ‌లిచారు. అందుకు ర‌జనీ ఇమేజ్‌ని కూడా వాడుకుని కొత్త స్టైల్‌లో ప‌వ‌ర్‌ఫుల్ కాప్ స్టోరీగా ఈ చిత్రాన్ని మ‌లిచిన తీరు ర‌జ‌నీ ఫ్యాన్స్‌తో పాటు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ర‌జ‌నీని స్టైలిష్ రౌడీ కాప్‌గా ఆవిష్క‌రించ‌డంలో మురుగ‌దాస్ నూటికి నూరు శాంతం స‌క్సెస్ అయ్యార‌ని చెప్పొచ్చు. క‌థ కొత్త‌గా లేక‌పోయినా ర‌జ‌నీ స్టైల్స్‌, మేన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్‌తో ఆ లోటు క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. మాసీవ్ ఎలివేష‌న్స్‌తో ర‌జ‌నీని చూపించిన తీరుకు థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ‌టం గ్యారంటీ. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే చాలా కాలంగా ర‌జ‌నీ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి ప‌క్కా పైసా వ‌సూల్‌మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ `ద‌ర్బార్‌`. గ‌త కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న త‌లైవ‌ర్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన‌ట్టే.

Rajinikanth’s Darbar movie released today with much fanfare. Fans are awaiting it’s the review. TeluguRajyam is presenting Darbar Full movie Review

- Advertisement -

Related Posts

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

Recent Posts

తెలంగాణ డిగ్రీ పట్టభద్రులారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం ఇలా నమోదు చేసుకోండి

మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు...

సంక్రాంతికి ఊరెళుతున్నారా? 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్.. నో టికెట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా... ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి...

సీఎంకు చల్లటి చపాతీలు వడ్డించి అధికారి సస్పెండ్.. ఆ తర్వాత?

ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?...

Today Horoscope : సెప్టెంబర్ 27 th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్-27- ఆదివారం.- అధిక ఆశ్వీయుజమాసం - పాడ్యమి. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి మేష రాశి:ఈరోజు సురక్షితమైన చోట డబ్బు దాయండి ! మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా ..?

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

వైయస్ కుటుంభం మత మార్పిళ్లు ప్రోత్సహిస్తుందా??

2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

తనపై దాడికి వైస్సార్సీపీ కుట్రలు చేస్తోందంటూ బాంబు పేల్చిన ఎంపీ రఘురామరాజు

నర్సాపురం ఎంపీ రఘురామరాజు కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు...

ఐపీఎల్ 2020:వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన హైదరాబాద్. బోణి కొట్టిన కోలకతా

అబుదాబి:తొలి మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.ఆ జట్టు తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి...

బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కిన తెలంగాణా మరియు ఏపీ నేతలు వీరే…

నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ నాయకత్వం.. పలువురు కొత్త వారికి అందులో చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ... తెలంగాణకు చెందిన...

Entertainment

లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో...

ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా...

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

అజయ్ భూపతి,శర్వా సినిమాలోనూ ఆమెనే హీరోయిన్!

తొలి చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌'తో యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్‌. చూడచక్కనైన రూపంతో పాటు చక్కటి అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి శర్వానంద్‌ సరసన 'శ్రీకారం' అనే...

Rashmi Gautam Traditional Photos

Telugu Actress,Rashmi Gautam Traditional Photos Check out, Rashmi Gautam Traditional Photos ,Rashmi Gautam Traditional Photos shooting spot photos, Actress Tollywood Rashmi Gautam Traditional Photos...

Payal Rajput Latest Wallpapers

Telugu Actress,Payal Rajput Latest Wallpapers Check out, Payal Rajput Latest Wallpapers ,Payal Rajput Latest Wallpapers shooting spot photos, Actress Tollywood Payal Rajput Latest Wallpapers,

పాయల్ రాజ్‌పుత్‌కు కరోనా టెస్ట్.. అలా చేయడంతో దెబ్బకు అరిచింది!!

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ ఓ రేంజ్‌లో సక్సెస్ కొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేక పాయల్ తెగ ప్రయాస పడుతోంది. ఆపై వచ్చిన ఆర్‌డీఎక్స్...

Dharsha Gupta Beautiful Pictures

Tamil Actress,Dharsha Gupta Beautiful Pictures Check out, Dharsha Gupta Beautiful Pictures ,AmalaPaul New HD Stills shooting spot photos, Actress Kollywood Dharsha Gupta Beautiful Pictures,

ఫేస్‌బుక్ లైవ్‌లో రాజీవ్ కనకాల.. సుమను అలా చూసి అంతా షాక్!!

రాజీవ్ కనకాల తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ అయిన మనస్వీని మూవీ మ్యూజిక్ క్రియేషన్స్ గురించి అప్డేట్ ఇచ్చాడు. పనిలో పనిగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు....