Home Movie Reviews 'బుల్బుల్' - విషయం తక్కువ - దర్శకత్వమెక్కువ!

‘బుల్బుల్’ – విషయం తక్కువ – దర్శకత్వమెక్కువ!

‘ఎన్ హెచ్ -10’, ‘పరీ’ వంటి సినిమాలు, ‘పాతాళ్ లోక్’ వంటి వెబ్ సిరీస్ నిర్మించిన బాలీవుడ్ స్టార్ అనూష్కా శర్మ, తాజాగా ‘బుల్బుల్’ అనే సూపర్ నేచురల్ హార్రర్ తో ఓటీటీ ప్రవేశం చేసింది. నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. రచయిత్రి అన్వితా దత్ దర్శకురాలిగా పరిచయమైంది. 19 వ శతాబ్దపు నేపథ్యంతో ‘డ్రాక్యులా’ ని తలపించే ఫీల్ తో, సంజయ్ లీలా భన్సాలీ లాంటి దృశ్య వైభవంతో, పిశాచ కథని కవితాత్మకంగా తెరకెక్కించింది. ‘పోస్టర్ బాయ్స్’, ‘లైలా మజ్నూ’ అనే రెండు సినిమాల హీరోయిన్ తృప్తీ ధిమ్రీ టైటిల్ పాత్ర నటించింది. రాహుల్ బోస్ ద్విపాత్రాభినయం చేశాడు. అమిత్ త్రివేదీ సంగీతం చేశాడు. ఇలా ఓ జమీందారీ కుటుంబంలో అంతఃపురపు కుట్రల్ని వెల్లడించే ఈ కథేమిటో ఒకసారి చూద్దాం…

కథ

1880 లో బెంగాల్లో ఐదేళ్ళ బుల్బుల్  కి పెళ్ళవుతుంది. తన తోటి బాలుడు సత్యతో పెళ్లి చేస్తున్నారని అనుకుంటే, సత్య అన్న ఇంద్రనీల్ (రాహుల్ బోస్) తో పెళ్లయి పోతుంది. ఐదేళ్ళ బుల్బుల్ ని పెళ్ళిచేసుకున్న పెద్ద జమీందారు ఠాకూర్ ఇంద్రనీల్ కి తనలాగే వున్న కవల సోదరుడు మహేంద్ర (రాహుల్ బోస్) వుంటాడు. ఇతడికి మతిస్థిమితం వుండదు. ఇంకో ఏడేళ్ళ తమ్ముడు, బుల్బుల్ తో కలిసి ఆడుకున్న సత్య వుంటాడు. ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు లండన్లో చదువు పూర్తి చేసుకున్న సత్య (అవినాష్ తివారీ) తిరిగొస్తాడు. వచ్చేసరికి చాలా మార్పులు జరిగివుంటాయి. పెద్దన్న ఇంద్రనీల్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, చిన్నన్న చనిపోయాడు. చిన్న వదిన బినోదిని (పావలీ దామ్) వితంతువుగా శిరోముండనం చేయించుకుని తెల్ల చీరలో వుంది. పెద్దన్న భార్య బుల్బుల్ (తృప్తీ ధిమ్రీ) దొరసానిలా జమీందారీ బాధ్యతలు చేపట్టింది.

 బుల్బుల్ కి చిన్నప్పుడు సత్యతో పెళ్లి కాలేదన్న బాధ వుంటుంది. సత్య ఆమెని వదినలాగే చూస్తూంటాడు. అయితే చుట్టు పక్కల ఒక పిశాచి సంచరిస్తోందనీ, అది మనుషుల్ని చంపేస్తోందనీ అందరూ అంటూంటే వింటాడు. చిన్నన్న మహేంద్రని కూడా పిశాచి చంపేసిందని అంటారు. ఇలా వుండగా ఇప్పుడు అడవిలో వేట కెళ్తే తన కళ్ళ ముందే పోలీసు కొత్వాల్ శవవుతాడు. దీంతో ఈ చావుల రహస్యం తెలుసుకోవాలని నిశ్చయించుకుంటాడు సత్య.

ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా పిశాచి చంపుతోందా? ఎందుకు చంపుతోంది? చిన్నన్నని పిశాచియే చంపిందా? పెద్దన్న ఎక్కడికెళ్ళి పోయాడు? ఈ మొత్తం పరిణామాల్లో డాక్టర్ సుదీప్ (పరమబ్రత ఛటర్జీ) పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు

నటిగా తృప్తీ ధిమ్రీ హైలైట్ అయిన సినిమా ఇది. తియ్యగా నవ్వుతూ, ఇంకా తియ్య తియ్యగా మాట్లాడుతూ, స్నేహభావంతో మెలగుతూ, హవేలీ బాధ్యతలు చూసుకునే యువ జమీందారిణీగా ఒక చెరగని ముద్ర వేస్తుంది. అంతఃపుర రహస్యాలుంటాయి. అవి బాధైనా, మరోటైనా భరించే జమీందారిణీ హూందాతనంతో వుండే పాత్రగా అర్ధంజేసుకుని ఒదిగిపోయింది. చిన్న వయసులో (26 ఏళ్ళు), రెండు సినిమాల అనుభవంతో, ఈ బరువైన క్లిష్ట పాత్ర పోషించే అవకాశం రావడం ఆమెకి గొప్ప.  

రాహుల్ బోస్ అన్నదమ్ముల ద్విపాత్రాభినయం చేశాడు. గృహ హింస వెలగబెట్టే మగ రాయుళ్ళ పాత్రలు. ఒకటి మతి చెడిన తమ్ముడి పాత్ర. చాలా శాంతంగా, తక్కువ  మాట్లాడే పాత్రలు. చేపట్టేవి క్రూరమైన చర్యలు. అనుభవించేది దారుణమైన శిక్షలు. ఈ డార్క్ షేడ్ పాత్రల్లో రాహుల్ బోస్ ఒకలాటి మత్తైన వాతావరాణాన్ని క్రియేట్ చేస్తాడు నటనతో.  

వితంతువు బినోదినిగా పావలీ దామ్, ఆ నాటి వితంతువుల జీవితాలకి అద్దం పడుతుంది. డాక్టర్ సుదీప్ గా పరమబ్రత ఛటర్జీ ఇంకో ఫర్వాలేదనిపించే నటన. ఇక హీరోగా అవినాష్ త్రివేదీ లోకల్ షెర్లాక్ హోమ్స్ గా ఆసక్తి కల్గిస్తాడు. ఇంగ్లీషు ప్రభావంతో అతడి లుక్స్, మాటలు ప్రత్యేకంగా వుంటాయి.

నటీనటులందరూ 1880 -1900 నాటి మనుషుల పోకడలతో, ముఖ్యంగా నాటి బెంగాలీ నేటివిటీతో, భాషతో, దృశ్యపరమైన సౌందర్యాన్నిపరిపుష్టం చేశారు. హవేలీ వైభవం, వర్ణ చిత్రాలు, పట్టు పరదాలు, వస్త్రా లంకరణ, వస్తు సామగ్రి, గుడ్డి నూనె దీపాల నుంచీ కాలక్రమంలో విద్యుత్ దీపాల కాంతులూ, గుర్రబ్బగ్గీలూ, ఇవన్నీ క్లాసిక్ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆ కాలం లోకి లాక్కెళతాయి.

రిచ్ కలర్స్, లైటింగ్ స్కీమ్, పిశాచి దాడి చేసేప్పుడు దృశ్యాలకి వాడిన కాషాయ కలర్స్ హార్రర్ ని కూడా ఒక దృశ్య కావ్యంలా మారుస్తాయి. కాషాయం ఎందుకంటే పిశాచి కాళికా దేవీ అని నమ్ముతారు అక్కడి ప్రజలు. పిశాచి వయొలెంట్ జస్టిస్ కి పాల్పడుతోంది. మేల్ వయొలెన్స్ కి వయొలెంట్ జస్టిస్సే సమాధానం అన్నట్టు వుంటుంది.

లైటింగ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పుకోవాలి. సత్యజిత్ రే తీసిన ‘దేవి’ పోస్టర్ కి ప్రభావితుడై ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ సృష్టించానన్నాడు కెమెరా మాన్ సిద్ధార్థ్ దివాన్. అమిత్ త్రివేదీ సంగీతం స్వరాలు సుతిమెత్తగా పలుకుతాయి. ఎడిటింగ్ కొంతవరకు కథకి ఉత్తేజం తీసుకొచ్చేలా వుంది. ఎడిటింగ్ కి కథ తోడ్పడకపోతే ఎడిటింగ్ కూడా బోరే కొడుతుంది. కొన్ని చోట్ల ఎడిటర్ రామేశ్వర్ భగత్, ఏ షాట్ ముందు వేసి ఏ షాట్ వెనుక వేస్తే కిక్ వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

దర్శకురాలిగా తొలి ప్రయత్నంతో ఇంత విజువల్ అద్భుతాన్ని సృష్టించింది అన్వితా దత్తా. ఇంత దర్శకత్వం ఏ దర్శకులూ చేయరు బహుశా. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలకి బీభత్స సూపర్ నేచురల్ వెర్షన్ ని సృష్టించి పెట్టినట్టుంది తను.

కథాకథనాలు

19 వ శతాబ్దం, ఇంకా ఆ పూర్వపు కాలాల హార్రర్ కథల్ని గోథిక్ హార్రర్ జానర్ అంటారు. ‘ఫ్రాంకెస్టీన్’, ‘డ్రాక్యులా’ వంటి ప్రసిద్ధ నవలలు వచ్చాయి. ఇవొక ఫాంటసికల్ వాతవరణ నేపథ్యంతో వుంటాయి. ‘బుల్బుల్’ కథ ఈ కోవకే చెందింది. ఈ కథ రబీంద్ర నాథ్ టాగూర్ నవలిక ప్రభావంతో రాశానంది దర్శకురాలు. 1901 లో టాగూర్ రాసిన ‘నష్టనిర్’ (చెదిరిన గూడు) నవలిక లోని పాత్రల్ని హార్రర్ లోకి మార్చి తీశానంది. గృహ హింస ఆనాడు ఎంతుందో ఈనాడూ అంతే వుందంది. నవలికలో వున్న పాత్రలు టాగూర్ నిజ జీవితంలో అన్న దమ్ముల పాత్రలే. బినోదిని పేరుతో పాత్రకూడా నవలికలో వుంది. ఈ నవలిక ఆధారంగా సత్యజిత్ రే ‘చారులత’ తీశారు.

దర్శకురాలు అన్విత గీత రచయిత్రిగా బాలీవుడ్ పాటలు రాసింది. మాటల రచయిత్రిగా దోస్తానా, కంబఖ్త్ ఇష్క్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, క్వీన్ వంటి 27 సినిమాలకి రాసింది. ఈ రెండు వృత్తులూ ఓకే. కథా రచయిత్రిగా వచ్చేసరికి విఫలమైంది. దర్శకురాలిగా ఎంతో అద్భుతం చేసింది. లేని కథని అద్భుతంగా తీసినంత మాత్రాన ఫలితాలు అద్భుతంగా వుండవు. అద్భుతమైన పాత్రల్ని తీర్చిదిద్దింది. వాటికి కథే లేదు. ఐతే తనేం కథ చేస్తోందో అది మాత్రం తెలుసని చెప్పింది. రెగ్యులర్ గా తీసే ఎవరు చేశారు? –  అనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ గాక, ఎలా చేశారు?- అన్న యాక్షన్ కే పరిమితం చేసినట్టు చెప్పింది. ఇదెంతో రిలీఫ్ నిచ్చే మాట. మర్డర్ ఇన్వెస్టిగేషన్, హంతకుణ్ణి పట్టుకోవడాలు వగైరా ఇంకా ఎవరిక్కావాలి? హంతకుడు ఎలా హత్య చేశాడు, ఎందుకు చేశాడనే ఆసక్తి చుట్టూ కథ వుంటే చాలు. పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత – నేటి శిక్షలు పడే ప్రహసనాలూ కాలయాపనలూ చూస్తున్నాక.

అయితే తను తెలుసుకోని దేమిటంటే, సినిమాని అడ్డంగా కుప్ప కూల్చే ఎండ్ సస్పెన్స్ అనే మాయదారి జాతికి చెందిన కథ ఇదని. దీంతో ఈ గంటన్నర సినిమా కూడా వృధా అయిపోయింది. గంటన్నరలో గంటా 10 నిమిషాల వరకూ కథ అంతుబట్టక, అసలు కథే అర్ధం గాక, పట్టపగలు కూడా నిద్ర ముంచుకొచ్చే పరిస్థితి. ఆ తర్వాతి ఇరవై నిమిషాల్లోనే ఫ్లాష్ బ్యాకుల వల్ల కథ తెలిసి ముగింపు కొస్తుంది. బుల్బుల్ కి అసలేం జరిగిందో ఈ ఇరవై నిమిషాల్లోనే తెలిసి -తెలిశాక ఇంకేం జరుగుతుందో తెలిసిపోయి- చప్పగా ముగుస్తుంది.

మరి ఫస్టాఫ్ అంతా ఏముంది? బుల్బుల్ చిన్నతనంలో పెళ్లి, తర్వాత ఇరవై ఏళ్ళు టైం లాప్స్ తో సత్య ఇంటికి రావడం, అన్నలేమయ్యారో ఆ ఫ్లాష్ బ్యాకులు అసంపూర్ణంగా తెలుసుకోవడం, చావుల దర్యాప్తు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రధాన పాత్ర బుల్బుల్ జమీందారిణీగా ఏమీ చెయ్యకుండా నవ్వులు చిందిస్తూ వుండడం, ఎంతకీ కథనం ముందుకు కదలక పోవడం, విషయం తెలియక పోవడం, ఇంతే. మూసి పెట్టిన విషయం తో ఎండ్ సస్పెన్స్ పెట్టే సహన పరీక్ష ఇలా వుంటుందని ఈ సినిమాతో వెయ్యో సారి రుజువైంది.

అనుమానిత పాత్ర లేకపోవడం ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా ఒక లోపం. బుల్బుల్ ని అనుమానిత పాత్రగా ఎస్టాబ్లిష్ చేసివుంటే కథలో చాలా సమస్యలు తీరేవి. మాటలు కవితాత్మకంగా రాసినట్టు, కథకూడా కవిత రాసినట్టు రాయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గృహ హింస తాలూకు రెండు దృశ్యాలు వయొలెంట్ గా వుంటే సరిపోలేదు. ఆ గాభరా, సస్పెన్స్ మిగతా కథలో కూడా వుండాలి. కథేమిటో ఓపెనై పాత్ర సమస్యేమిటో తెలియాలి. సమస్యేమిటంటే- అటు బుల్బుల్, ఇటు సత్య ఏదీ ప్రధాన పాత్ర కాకుండా పోయాయి. టాగూర్ నవలిక, దాంతో సత్యజిత్ సినిమా సామాజికాలు కాబట్టి సరిపోయాయి. వాటిని హార్రర్ గా మార్చాలంటే అసలు  స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుండడం అవసరం.

ఈ కథలో మోస్ట్ టెర్రిఫిక్ డైలాగు, బుల్బుల్ తో బినోదిని ‘చుప్ రహెనా’ (సైలెంట్ గా  వుండిపో) అనడం. అలాగని కథ కూడా సైలెంట్ గా వుండిపోతే ఎలా?

విషయం తక్కువ – దర్శకత్వమెక్కువ!
‘బుల్బుల్’ (హిందీ)
రచన, దర్శకత్వం : అన్వితా దత్తా
తారాగణం: తృప్తీ దిమ్రీ, అవినాష్ తివారీ, పావలీ దామ్, రాహుల్ బోస్, పరమబ్రత ఛటర్జీ
సంగీతం: అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ దివాన్
బ్యానర్: క్లీన్ స్లేట్ ఫిలిమ్స్
నిర్మాతలు: అనూష్కా శర్మ, కర్ణేష్ శర్మ
విడుదల: నెట్ ఫ్లిక్స్
2/5 

సికిందర్

- Advertisement -

Related Posts

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.....

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

తెలంగాణ డిగ్రీ పట్టభద్రులారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం ఇలా నమోదు చేసుకోండి

మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు...

సంక్రాంతికి ఊరెళుతున్నారా? 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్.. నో టికెట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా... ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి...

సీఎంకు చల్లటి చపాతీలు వడ్డించి అధికారి సస్పెండ్.. ఆ తర్వాత?

ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?...

Today Horoscope : సెప్టెంబర్ 27 th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్-27- ఆదివారం.- అధిక ఆశ్వీయుజమాసం - పాడ్యమి. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి మేష రాశి:ఈరోజు సురక్షితమైన చోట డబ్బు దాయండి ! మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా ..?

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

వైయస్ కుటుంభం మత మార్పిళ్లు ప్రోత్సహిస్తుందా??

2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

తనపై దాడికి వైస్సార్సీపీ కుట్రలు చేస్తోందంటూ బాంబు పేల్చిన ఎంపీ రఘురామరాజు

నర్సాపురం ఎంపీ రఘురామరాజు కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు...

Entertainment

ఒక్క అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి రష్మిక రచ్చ

ఛలో బ్యూటీ రష్మీక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, చేసే చేష్టలు, ఫోటో షూట్లు నవ్వు తెప్పించక మానవు. ఓ బుజ్జికుక్క పిల్ల...

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

ఈఎంఐలు కట్టలేకనే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాడు.. హైపర్...

హైపర్ ఆది.. ఆయనకు పేరు పెట్టినట్టుగానే ఆయన కొంచెం హైపరే. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, రివర్స్ పంచ్ వేయలేక మిగితా కంటెస్టెంట్లు జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన టాకింగ్ పవర్ అటువంటిది....

కంటెస్టెంట్లందరికీ పంచ్ ఇచ్చాడు.. నాగార్జున నిర్ణయంతో వారంతా షాక్!!

బిగ్‌బాస్‌లో మూడో వీకెండ్ బాగానా జరిగింది. మూడో వారంలో జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు టచ్ చేశాడు నాగార్జున. రోబోలు టాస్కును గెలవడం, మనుషుల టీం సభ్యులు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం,...

లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో...

ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా...

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

అజయ్ భూపతి,శర్వా సినిమాలోనూ ఆమెనే హీరోయిన్!

తొలి చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌'తో యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్‌. చూడచక్కనైన రూపంతో పాటు చక్కటి అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి శర్వానంద్‌ సరసన 'శ్రీకారం' అనే...

Rashmi Gautam Traditional Photos

Telugu Actress,Rashmi Gautam Traditional Photos Check out, Rashmi Gautam Traditional Photos ,Rashmi Gautam Traditional Photos shooting spot photos, Actress Tollywood Rashmi Gautam Traditional Photos...