బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

bangaru bullodu movie review

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు
నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు
నిర్మాణ సంస్థ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : పీవీ గిరి
సంగీతం : సాయి కార్తీక్
విడుదల తేది : జనవరి 23, 2021

bangaru bullodu movie review
bangaru bullodu movie review

ఒక‌ప్పుడు హీరోగా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదం అందించ‌డంలో రాజేంద్ర ప్ర‌సాద్ ఆరితేరాడు. ఇప్పుడు అత‌ని స్థానాన్ని అల్ల‌రి న‌రేష్ భ‌ర్తీ చేశాడు. కెరీర్ మొద‌ట్లో కామెడీతో ప్రేక్షకుల‌ని క‌డుపుబ్బ న‌వ్విస్తూ మంచి స‌క్సెస్ లు అందుకున్న అల్ల‌రి న‌రేష్ అతని తండ్రి ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ మ‌ర‌ణం త‌ర్వాత చెప్పుకోద‌గ్గ సినిమాలు చేయ‌లేదు. చేసిన సినిమాలు కూడా పెద్దగా విజ‌యం సాధించిన దాఖాలాలు లేవు. అయితే ఈ రోజు గిరి పాలిక (పీవీ గిరి) దర్శకత్వంలో.. నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ బంగారు బుల్లోడుతో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ప‌్రేక్ష‌కులు ఈ సినిమాపై ఏమ‌నుకుంటున్నారు రివ్యూలో చూద్దాం.

సినిమా క‌థ ఏంటంటే…

సీతాన‌గ‌రం గ్రామంలో భవాని ప్రసాద్ (అల్లరి నరేష్)తో పాటు అత‌ని సోద‌రుల‌కి పెళ్లిళ్లు కావు. ఇందుకు కార‌ణం తన తాతయ్య (తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పు అని తెలుసుకొని దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు ఇంతకీ తన తాతయ్య చేసిన తప్పు ఏమిటి ? కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? త‌న తాత‌య్య భ‌వానీ ప్ర‌సాద్ చేసిన త‌ప్పుడు ఎలా స‌రిదిద్దారు వంటి అంశాలు గురించి తెలుసుకోవాలంటే చిత్రాన్ని థియేట‌ర్‌లో చూడాల్సిందే.

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్ :

కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అల్ల‌రి న‌రేష్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి పాత్ర‌లో చ‌క్క‌ని న‌ట‌నా నైపుణ్యం క‌న‌బ‌రిచాడు. తాత త‌ప్పును స‌రిదిద్దేటువంటి స‌న్నివేశాల‌లో న‌రేష్ న‌ట‌న చాలా బాగుంది. హీరోయిన్ పూజా ఝ‌వేరి ప‌ర్వాలేదనిపించింది. తాతపాత్ర‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి న‌ట‌న కూడా బాగుంది.కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ కొన్ని కామెడీ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పోసాని త‌న మాడ్యులేష‌న్‌తో మెప్పించారు.

సాంకేతిక విభాగం:

తెర వెనుక ఉన్న సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడిగా ప‌ర్వాలేద‌నిపించిన ర‌చ‌యిత‌గా వెన‌క‌బ‌డ్డాడు. సంగీతం కూడా సినిమాకు మైన‌స్. స్వాతి ముత్యం సాంగ్ ఒక్క‌టి బాగుంది. కొన్ని స‌న్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయి. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం బాగుంది. నిర్మాణ విలువ‌లు ప‌ర్వాలేదు.

విశ్లేషణ:

1993లో వ‌చ్చిన బాల‌య్య సూప‌ర్ హిట్ బూవీ బంగారు బుల్లోడు ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నంద‌రికి తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో అల్ల‌రోడు వ‌స్తుండే స‌రికి మూవీపై అంచ‌నాలు బాగానే పెరిగాయి. కాని ప్రేక్షకుల అంచ‌నాల‌ను ఈ సారి కూడా అందుకోలేక‌పోయాడు. అప్ప‌టి మ్యాజిక్‌ని క్రియేట్ చేయ‌లేక‌పోయాడు. క‌థ బాగానే ఉన్న ఆర్టిస్టుల‌ని ద‌ర్శ‌కుడు పెద్ద‌గా వాడుకోలేద‌నిపిస్తుంది. మెయిన్ పాయింట్ ప‌క్క‌న పెట్టేసి, అన‌వసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. కామెడీ పెద్ద‌గా పండ‌లేదు. సెకండాఫ్ చాలా బోరింగ్‌గా సాగింది.

తీర్పు:

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన బంగారు బుల్లోడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ్డాడు. కామెడీ క‌థాంశంతో ప్రేక్షకుల‌కు ఎంట‌ర్‌టైన్ పండించాల‌న్న వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. కామెడీ, ఎమోష‌న్స్, సీరియ‌స్ ఏది కూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ఈ సినిమా ఫ్లాప్ జాబితాలో చేరింది.

రేటింగ్‌: 2.5/5