Home Movie Reviews `అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

`అశ్వ‌థ్ధామ‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, మెహ‌రీన్‌, ప్రిన్స్‌, జిష్షుసేన్ గుప్తా, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, స‌ర్గున్ కౌర్‌, స‌త్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ‌: నాగ‌శౌర్య‌,
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మ‌ణ‌తేజ‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ రెడ్డి
ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌
రిలీజ్ డేట్‌: 31-01-2020
రేటింగ్‌: 2.5

2011లో కెరీర్ ప్రారంభించిన నాగ‌శౌర్య‌కు గుర్తింపుని, త‌న కెరీర్‌లో మంచి హిట్‌ని అందించింది మాత్రం `ఛ‌లో` మాత్ర‌మే. ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఆ త‌ర‌హా మ్యాజిక్‌ని నాగ‌శౌర్య చేయ‌లేక‌పోయాడు. అత‌ని చుట్టూ వున్న వాతావ‌ర‌ణం, వ్య‌క్తుల ప్ర‌భావ‌మో ఏమో తెలియ‌దు కానీ త‌న‌కు త‌గ్గ క‌థ‌ల్నిఎంచుకోలేక వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేసుకున్నారు. సొంత బ్యాన‌ర్‌పై చేసిన `న‌ర్త‌న‌శాల‌` దారుణంగా ఫ్లాప్ అయినా మ‌ళ్లీ సొంత సంస్థ‌లోనే తాజా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ని తుడిచేసుకోవాల‌ని, మాస్ హీరోగా గుర్తింపుని పొందాల‌ని నాగ‌శౌర్య చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిందా?. అత‌ని కాన్ఫిడెన్స్‌కు త‌గ్గ‌ట్టే సినిమా ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

నాగ‌శౌర్య‌కు చెల్లెలు అంటే ప్రాణం. ఆమెకు ఎలాంటి ఆప‌ద రాకూడ‌ద‌ని, త‌ను హాయిగా న‌వ్వుతూ వుండాల‌ని కోరుకుంటుంటాడు. అలాంటి చెల్లెలు పెళ్లికి ముందు గ‌ర్భ‌వ‌త‌ని తెలుస్తుంది. అయితే అది ఎలా జ‌రిగింది అన్న‌ది ఆమెకే తెలియ‌దు. ఆ త‌రువాత అబార్ష‌న్ చేయించి పెళ్లి చేస్తాడు. త‌న చెల్లెలి త‌ర‌హాలోనే వైజాగ్‌లో మ‌రింత మంది అమ్మాయిల‌కు అలాంటి సంఘ‌ట‌నే ఎదుర‌వుతుంది. కొంత మంది అమ్మాయిలు వ‌రుస కిడ్నాప్‌ల‌కు గుర‌వుతారు. ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్న‌ది ఎవ‌రు?.. ఎందుకు చేస్తున్నారు? అన్న‌ది మిస్ట‌రీగా మారుతుంది. ఈ మిస్ట‌రీని ఛేదించ‌డానికి రంగంలోకి దిగిన నాగ‌శౌర్య ఏం చేశాడు? .. కిడ్నాప్‌ల వెన‌కున్న అస‌లు సూత్ర‌ధారిని క‌నిపెట్టాడా? క‌నిపిఎడితే వాడి టార్గెట్ అమ్మాయిలే ఎందుకు? అన్న విష‌యాలు తెలియాలంటే `అశ్వ‌థ్థామ‌` సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

యంగ్ హీరోగా క్రేజ్ వున్నా త‌న క్రేజ్‌కి త‌గ్గ చిత్రాల్ని నాగ‌శౌర్య చేయ‌లేక‌పోయాడు. మొహ‌మాటం కోసం ఓ బేబీ, క‌ణం వంటి చిత్రాల్లో న‌టించి మ‌రింత క్రేజ్‌ని త‌గ్గించుకున్నాడు. అయితే `ఛ‌లో`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడ‌ని పించుకున్నా అమ్మ‌మ్మ‌గారిల్లు, న‌క్త‌న‌శాల, ఓ బేబీ వంటి చిత్రాల‌తో మ‌ళ్లీ వెన‌క‌బ‌డ్డాడు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి మాస్ ఇమేజ్ కోసం నాగ‌శౌర్య చేసిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ఈ విష‌యంలో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. త‌న‌తో సినిమాలు చేయాల‌నుకుంటున్న డైరెక్ట‌ర్‌ల‌కు `అశ్వ‌థ్థామ‌`తో డైరెక్ట్ ఇండికేష‌న్స్ ఇచ్చాడు. మాస్ అంశాల్లో త‌న ఎన‌ర్జీ లెవెల్‌ని చూపించి ఆక‌ట్టుకున్న నాగ‌శౌర్య క‌థా, క‌థ‌నం విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది. అత‌ని శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కేది. మెహ‌రీన్ న‌ట‌న‌కు చెప్పుకోవాల్సింది ఏమీ లేదు అయితే ఉన్నంత‌లో బాగానే చేసింది. ప్ర‌ధాన విల‌న్‌గా క‌నిపించ‌కుండా దోబూచులాడిన జిష్షుసేన్ గుప్తా సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. అత‌నికి, హీరోకి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా వున్నాయి. హ‌రీష్ ఉత్త‌మ‌న్ న‌ట‌న కూడా బాగుంది. ప్రిన్స్‌, స‌ర్గున్ కౌర్‌, స‌త్య త‌దిత‌రులు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక వ‌ర్గం:

నాగ‌శౌర్య అందించిన క‌థ బాగున్నా అందులో చేర్చిన స‌న్నివేశాలు చాలా వ‌ర‌కు సినిమాకు అత‌క‌లేద‌ని చెప్పాలి. ఒక ద‌గ్గ‌ర హైలో వుంటే మ‌రో ద‌గ్గ‌ర లోలో వుండ‌టం… ఎప్ప‌టిక‌ప్నుడు ఈ సీన్ బాగుంటే వ‌చ్చే సీన్ మీర బాగుంటుందేమో అనుకునే లోగా ట‌ప్‌మ‌ని గ్రాఫ్ ప‌డిపోవ‌డం లాంటివి చాలానే వున్నాయి. ఇక క‌థ‌కి యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ఎక్క‌డా సంబంధం వున్న‌ట్టు క‌నిపించ‌దు. ఈ క‌థ‌కు ఈ స్థాయి యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అవ‌స‌మా? అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగా ర‌మ‌ణ తేజ క‌థ‌ని గ్రిప్పింగ్‌గా న‌డిపించ‌డంలో ఫెయిల‌య్యాడు. ఎమోష‌న‌ల్ డ్రైవ్‌తో సాగాల్సిన సినిమా అక్క‌డ‌క్క‌డ డీవేట్ అవుతూ సాగుతుంది.
ఈ సినిమా కోసం మ‌నోజ్ రెడ్డి ది బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఆయ‌న అందించిన ఫొటోగ్ర‌ఫీ సినిమాకి గ్రాండ్ లుక్‌ని తీసుకొచ్చింది. ఇక అన‌ల్- అర‌సు చిత్రీక‌రించిన యాక్ష‌న్ బ్లాక్స్ సూప‌ర్బ్‌. ఇవి కొంత సినిమాకు ప్లస్ అయ్యాయి. గ్యారి బిహెచ్ ఉన్నంత‌లో త‌న ప‌ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు కానీ ఫ‌స్ట్ హాఫ్‌లో చేతులు ఎత్తేసిన‌ట్టే క‌నిపించింది.
శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల పాట‌లు ఓకే అనిపించాయి. జిబ్రాన్ నేప‌థ్య సంగీతం మాత్రం ఓ రేంజ్‌లో వుంది. సినిమా మూడ్‌ని మెయింటైన్ చేయ‌డంలో అది కీల‌క పాత్ర పోషించింది.

విశ్లేష‌ణ‌:

నాగశౌర్యకు గ‌త కొంత కాలంగా ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ గురించి విని విని విసుగుపుట్టింద‌ట‌. ఆ ఇమేజ్ త‌న‌కొద్దు బాబోయ్ అంటూ మాస్ ఇమేజ్ కోసం చేసిన చిత్రం `అశ్శ‌థ్థామ‌`. ఆ కోరిక‌ను తీర్చేలానే వుంది. కానీ క‌థ‌, క‌థ‌నంలో మ‌రిన్ని మార్పులు చేసుకుని ప‌క్కాగా దిగితే మ‌రింత బాగుండేది. దాంతో మాస్ హీరోగా వంద మార్కులు సాధించాల‌నుకున్న నాగ‌శౌర్య యాభై మార్కుల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.
మాస్ మ‌సాలా యాక్ష‌న్ సీన్స్‌, జిష్షూ సైకో యాక్ష‌న్‌.. వెర‌సి కొత్త త‌ర‌హా సైకో థ్రిల్ల‌ర్ చిత్రాల‌ని కోరుకునే ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఈ సినిమా న‌చ్చుతుంది కానీ రెగ్యుల‌ర్ ఫ్యామిలీ ఎమోష‌న్ ఫిలింస్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూడాల‌నుకునే వారిని మాత్రం ఖ‌చ్చితంగా నిరాశ ప‌రుస్తుంది.

- Advertisement -

Related Posts

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

Recent Posts

పటాస్ టు అదిరింది.. జబర్దస్త్‌లో అలా యాంకర్ రవి పరువు పోగొట్టుకున్నాడు!!

బుల్లితెరపై యాంకర్ రవిది ప్రత్యేకమైన శైలి. బుల్లితెరపై మొదటి పులిహోర రాజాగా యాంకర్ రవిని చెప్పుకోవచ్చు. అతని పక్కన ఏ లేడీ యాంకర్ పని చేసినా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి....

రాజ్యాంగాన్ని అవమానిస్తున్న వైసీపీ అభిమానులు! జగన్ కు తెలిసే ఇదంతా జరుగుతుందా…?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 100 సార్లు వైసీపీ ప్రభుత్వం కోర్ట్ ల నుండి మొట్టికాయలు తిన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కోర్ట్ ల నుండి...

ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.....

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

తెలంగాణ డిగ్రీ పట్టభద్రులారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం ఇలా నమోదు చేసుకోండి

మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు...

సంక్రాంతికి ఊరెళుతున్నారా? 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్.. నో టికెట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా... ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి...

సీఎంకు చల్లటి చపాతీలు వడ్డించి అధికారి సస్పెండ్.. ఆ తర్వాత?

ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?...

Today Horoscope : సెప్టెంబర్ 27 th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్-27- ఆదివారం.- అధిక ఆశ్వీయుజమాసం - పాడ్యమి. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి మేష రాశి:ఈరోజు సురక్షితమైన చోట డబ్బు దాయండి ! మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా ..?

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

వైయస్ కుటుంభం మత మార్పిళ్లు ప్రోత్సహిస్తుందా??

2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్...

Entertainment

పటాస్ టు అదిరింది.. జబర్దస్త్‌లో అలా యాంకర్ రవి పరువు పోగొట్టుకున్నాడు!!

బుల్లితెరపై యాంకర్ రవిది ప్రత్యేకమైన శైలి. బుల్లితెరపై మొదటి పులిహోర రాజాగా యాంకర్ రవిని చెప్పుకోవచ్చు. అతని పక్కన ఏ లేడీ యాంకర్ పని చేసినా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి....

ఎంతలా కష్టపడుతోందో.. ప్రగతిని చూస్తే జాలేస్తోంది!!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతిని చూస్తే నిజంగానే జాలేస్తోంది. నాలుగు పదుల వయసులోనూ ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. ఎందరో మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎంతో కష్టాన్ని ఓర్చుకుంటోంది. కఠిన తరమైన కసరత్తులను...

ఒక్క అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి రష్మిక రచ్చ

ఛలో బ్యూటీ రష్మీక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, చేసే చేష్టలు, ఫోటో షూట్లు నవ్వు తెప్పించక మానవు. ఓ బుజ్జికుక్క పిల్ల...

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

ఈఎంఐలు కట్టలేకనే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాడు.. హైపర్...

హైపర్ ఆది.. ఆయనకు పేరు పెట్టినట్టుగానే ఆయన కొంచెం హైపరే. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, రివర్స్ పంచ్ వేయలేక మిగితా కంటెస్టెంట్లు జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన టాకింగ్ పవర్ అటువంటిది....

కంటెస్టెంట్లందరికీ పంచ్ ఇచ్చాడు.. నాగార్జున నిర్ణయంతో వారంతా షాక్!!

బిగ్‌బాస్‌లో మూడో వీకెండ్ బాగానా జరిగింది. మూడో వారంలో జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు టచ్ చేశాడు నాగార్జున. రోబోలు టాస్కును గెలవడం, మనుషుల టీం సభ్యులు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం,...

లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో...

ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా...

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...