అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

Anushka Shetty Nishabdham telugu movie review

పేరు: నిశ్శబ్దం

విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020

నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే

డైరెక్టర్: హేమంత్ మధుకర్

ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్

నుష్క.. బాహుబలి సిరీస్ తర్వాత వస్తున్న సినిమా అంటే అందరిలోనూ అంచనాలు పెరిగిపోతాయి. బాహుబలిలో అనుష్క పాత్రను ఊహించుకుంటే.. అనుష్క ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తుంది అని అనుకుంటున్నాం. అందుకే.. అనుష్క సినిమాలకు అంచనాలు ఎక్కువవుతున్నాయి. అనుష్క మొదటి నుంచీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ సినిమా కూడా అనుష్క చుట్టూ తిరిగేదే. ఒక అరుందతి, అక బాగమతి లాంటి సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిన ప్రేక్షకులు.. నిశ్శబ్దం సినిమాను కూడా అదే రేంజ్ లో ఊహించుకున్నారు. కరోనా వల్ల సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ చేశారు. మరి.. డైరెక్ట్ గా అందరి ఇళ్లలో రిలీజ్ అయిన నిశ్శబ్దం.. నిశ్శబ్దాన్ని ఛేదించిందా? అనుష్క సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నదా? అంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Anushka Shetty Nishabdham telugu movie review
Anushka Shetty Nishabdham telugu movie review

సినిమా కథ ఇదే

అనుష్క(సాక్షి).. పుట్టుకతోనే మూగ, చెవుడు. కానీ.. తను అద్భుతమైన పెయింటర్. ఇక షాలినీ పాండే(సోనాలి), సాక్షి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరుగుతారు. అయితే.. గొప్ప సంగీతకారుడు ఆర్ మాధవన్(ఆంటోనీ), సాక్షి ప్రేమలో పడతారు. అయితే సాక్షి జీవితంలోకి ఆంటోనీ రావడం సోనాలికి ఇష్టం ఉండదు. అయితే.. సాక్షి, ఆంటోనీ ఎంగేజ్ మెంట్ తర్వాత సోనాలి మిస్ అవుతుంది. ఆ తర్వాత ఆంటోనీ కూడా హత్యకు గురవుతాడు.

Anushka Shetty Nishabdham telugu movie review
Anushka Shetty Nishabdham telugu movie review

ఆంటోనీ హత్య కేసును డీల్ చేస్తున్న టీమ్ లో అంజలి(మహా) ఉంటుంది. తనకు ఉన్న తెలివితో అసలు ఆంటోనీ ఎలా చనిపోయాడు? సోనాలి ఎలా మిస్సయింది? వాళ్లిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాటన్నింటికీ సమాధానాలు వెతికే పనిలో పడుతుంది. మహాతో పాటుగా పోలీస్ ఉన్నతాధికారి కెప్టెన్ రిచర్డ్(మైఖెల్ మ్యాడ్సన్) ఈ కేసు విచారణ చేపడుతుంటాడు. మొత్తం మీద ఇద్దరు కలిసి ఈ కేసును ఛేదిస్తారా? అసలు హంతకులకు పట్టుకుంటారా? అనుష్క ఈ కేసు పరిష్కారం కోసం వీళ్లకు ఎలా సాయపడుతుంది? అనేదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్

సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ట్విస్టులు. ఆ ట్విస్టులతోనే సినిమా కథ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులోనూ కథలో బలమైన పాత్రలు ఉండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఇక ఈ సినిమాకు మరో బలం అనుష్క. ఆమె లేకపోతే ఈ సినిమా లేదు. ఆమె వన్ మ్యాన్ ఆర్మీలా సినిమాను నెత్తిన వేసుకొని మోసింది. ఆమెతో పాటు మిగితా పాత్రలు కూడా స్ట్రాంగే. అంజలి పాత్ర కూడా సినిమా మొత్తం ఉంటుంది. సోనాలి పాత్రలో షాలినీ పాండే ఓకే అనిపించింది. మాధవన్ యాక్టింగ్ కూడా ఓకే. ఆంటోనీ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్సే.

Anushka Shetty Nishabdham telugu movie review
Anushka Shetty Nishabdham telugu movie review

మైనస్ పాయింట్స్

సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కథ ఊహించినట్టుగానే ఉంటుంది. నెరేషన్ కూడా కాస్త స్లోగా ఉంటుంది. సినిమాలో లాజిక్స్ ఉండవు. కొన్ని సీన్లు బోర్ ఫీలింగ్ ను తీసుకొస్తాయి. కొన్ని సీన్లలో ఇంట్రెస్ట్ పాయింటే మిస్ అవుతుంది. పోలీసుల ట్రాక్ లో అయితే లాజికే ఉండదు. సినిమా.. పేరుకు సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. కాస్తో కూస్తో కామెడీ సీన్లను రాసుకోవాల్సింది.

Anushka Shetty Nishabdham telugu movie review
Anushka Shetty Nishabdham telugu movie review

కన్ క్లూజన్

నో డౌట్. ఇది సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్. అయితే.. కొన్ని థ్రిల్లర్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు. కాకపోతే అనుష్క నటన, హేమంత్ దర్శకత్వ ప్రతిభ సినిమా స్థాయిని పెంచాయి. థ్రిల్లర్ జానర్ నచ్చే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. కానీ.. మిగితా వాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. మొత్తానికి కరోనా సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటే మాత్రం ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు. ఓవరాల్ గా థ్రిల్లర్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ.. సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం చూడొద్దు.

తెలుగు రాజ్యం రేటింగ్ : 2.5 / 5