చెలరేగిన చిరంజీవి – ‘సైరా’ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రివ్యూ!

చెలరేగిన చిరంజీవి – ‘సైరా’ హిస్టారికల్ మూవీ ట్రైలర్ రివ్యూ!

“స్వాతంత్ర్యం కోసం జరుగుతున్నా తొలి యుద్దమిది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి!” –గోసాయి ఎంకన్న పాత్రలో అమితాబ్ బచ్చన్.

“నీ గెలుపుని క‌ళ్లారా చూడాల‌ని వ‌చ్చాను సైరా న‌రసింహారెడ్డి” ఇంకో పాత్రధారి కన్నడ కిచ్చా సుదీప్. 

“వీర‌త్వానికి పేరుబ‌డ్డ త‌మిళ భూమి నుంచి వ‌చ్చా. రాముడికి ల‌క్ష్మ‌ణుడి మాదిరి నీ కూడా వుంటాను… అది విజ‌య‌మో, వీర మ‌ర‌ణ‌మో!” ` త‌మిళ యోధుడి పాత్రలో విజ‌య్ సేతుప‌తి.

“ల‌క్ష్మి అనే నా పేరు ముందు న‌ర‌సింహా అనే మీ పేరు ఇవ్వండి” ఇంకో పాత్రలో తమన్నా.

“న‌న్ను మాత్రం విడిచిపెట్ట‌కండి!”- మరో పాత్రలో న‌య‌న‌తార.

ఇలా మల్టీ స్టారర్ హిస్టారికల్ మూవీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’సైరా’ ట్రైలర్ లో వివిధ భాషల తారలు కనువిందు చేస్తున్నారు, భావోద్వేగాలు నింపుతున్నారు, స్వాతంత్ర్య పోరాటపు ఘట్టంలో భాగస్వాములవుతున్నారు.

“భార‌త మాత కీ జై!” అని నినదిస్తూ యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి దూసుకురావడం…తెల్ల దొరల సైన్యాలతో భీకర పోరాట దృశ్యాలు మొదలుకావడం…కాల్పులు, పేలుళ్లుతో దద్దరిల్లడం!

చిరంజీవిని గొలుసుల‌తో బంధించి బ్రిటీష్ సైన్యాలు తీసుకుని వస్తూంటే, “న‌ర‌సింహారెడ్డి సామాన్యుడు కాడు, అత‌ను కార‌ణ‌జ‌న్ముడు!” అని కంఠం ఖంగుమనడం.

చిరంజీవి శివ పూజ చేస్తూంటే, “అత‌నొక యోగి. అత‌నొక యోధుడు. అతన్నెవ్వరూ ఆప‌లేరు!” అని వీరత్వాన్ని ప్రకటించడం.

“ఈ భూమ్మీద పుట్టింది మేము, ఈ మ‌ట్టిలో క‌లిసేది మేము, మీకెందుకు క‌ట్టాలిరా శిస్తు?” అని బ్రిటీష్ అధికారి మీద చిరంజీవి తిరగబడే దృశ్యం.

న‌ర‌సింహారెడ్డి అచూకీ చెప్ప‌నందుకు తెల్ల దొరలు స్థానికుల్ని తుపాకుల‌తో కాల్చే దృశ్యాలు.

ఆఖరికి చిరంజీవి, “స్వేచ్ఛ కోసం ప్ర‌జ‌లు చేస్తున్న తిరుగుబాటు! నా భ‌ర‌త‌మాత గ‌డ్డ‌మీద నిల‌బ‌డి హెచ్చరిస్తున్నా! నా దేశం వ‌దిలి వెళ్లిపోండి లేదా…యుద్ధ‌మే!!” అని యుద్ధ నాదం చేసి కదనరంగంలోంకి దూకే భీకర దృశ్యాలు.

“చివ‌రి కోరికేమైనా వుంటే ఓ వాక్యంలో చెప్పు!” అని తెల్ల వాడు అడిగితే, “గెట్ అవుట్ ఫ్ర‌మ్ మై మ‌ద‌ర్ ల్యాండ్!” అంటూ చిరంజీవి ఆజ్ఞాపించే దృశ్యంతో ట్రైలర్ ముగింపు.

ఇలా ట్రైలర్ క్షణం క్షణం మండుతున్న అగ్ని గోళంలా వుంది. అవుట్ డోర్ లొకేషన్స్ లో హైటెక్ యాక్షన్ సీన్స్. గ్రాఫిక్ విన్యాసాలు. రక్త పాతాలు. వీర మరణాలు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ‘సైరా’ మూడు నిమిషాల ట్రైలర్ స్వాతంత్ర్య పోరాట చిత్రాల్లో నూతన వొరవడిని లిఖిస్తోంది…నటనలు, దర్శకత్వం, రచనల పరంగా. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతోంది.

 

Sye Raa Trailer (Telugu) - Chiranjeevi | Ram Charan | Surender Reddy | Oct 2nd Release