Home Movie Reviews `స‌రిలేరు నీకెవ్వ‌రు` మూవీ రివ్యూ

`స‌రిలేరు నీకెవ్వ‌రు` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: మ‌హేష్‌బాబు, ప్ర‌త్యేక అతిథి పాత్ర‌లో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌శాంతి, ర‌ష్మిక మంద‌న్న‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంగీత‌, స‌త్య‌దేవ్‌, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, సుబ్బ‌రాజు, న‌రేష్‌, ర‌ఘుబాబు, స‌త్యం రాజేష్‌, బండ్ల గ‌ణేష్, ప‌విత్రా లోకేష్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రావిపూడి
నిర్మాత‌లు: అనిల్ సుంక‌ర‌, మ‌హేష్‌బాబు, దిల్ రాజు,
సంగీతం: దేవిశ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌. ర‌త్న‌వేలు
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
రిలీజ్ డేట్‌: 11-01-2020
రేటింగ్‌: 3.5

భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి వంటి రెండు సూప‌ర్‌ హిట్‌ల త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో వున్నారు మ‌హేష్‌. ఈ సారి ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని చేయాల‌ని ఫిక్స్ అయిన అందులో మంచి ప‌ట్టున్న అనిల్ రావిపూడితో త‌న నెక్ట్స్ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేసిన ఈ సినిమా బ‌డ్జెట్, కాస్టింగ్ ద‌గ్గ‌రి నుంచి ప్రీరిలీజ్ ఈ వెంట్ వ‌ర‌కు వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూనే వుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్‌లో చిరంజీవి పాల్గొన‌డం, మ‌హేష్‌ని పొగడ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేయ‌డం, మీడియా ప్ర‌మోష‌న్స్‌లో మ‌హేష్ ఈ సంక్రాంతికి థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవాలంతే వంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డంతో ఈ సినిమాకు ఎక్క‌డ‌లేని హైప్ క్రియేట్ అయ్యింది. మ‌రి ఆ హైప్‌కి త‌గ్గ‌ట్టే సినిమా వుందా? తొలిసారి ఆర్మీ మేజ‌ర్‌గా న‌టించిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారా? మ‌హేష్ నుంచి ఆయ‌న అభిమానులు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అవ‌న్నీ `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో వున్నాయా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

భార‌తి( విజ‌య‌శాంతి) ఓ ప్రొఫెస‌ర్‌. దేశ‌భ‌క్తి ఎక్కువ‌. దేశం కోసం త‌న ఇద్ద‌రు కుమారుల్ని సైన్యంలోకి పంపిస్తుంది. ఒక కొడుకు సైన్యంలో జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో చ‌నిపోతే మ‌రో కొడుకు (స‌త్య‌దేవ్‌) గాయానికి గుర‌వుతాడు. ఈ విష‌యం చెప్పాల‌ని, ఆ కుటుంబానికి అండ‌గా వుండాల‌ని ఆర్మీ ఆఫీస‌ర్ అజ‌య్‌కృష్ణ క‌ర్నూలుకు వ‌స్తాడు. అయితే అత‌నికి భార‌తి కుటుంబం క‌నిపించ‌దు. ఎక్క‌డ వుందో తెలియ‌దు. భార‌తి కుటుంబం క‌నిపించ‌కుండా పోవ‌డానికి స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర‌కు ఉన్న సంబంధం ఏమిటి?, భార‌తి కుటుంబం కోసం అజ‌య్‌కృష్ణ ఏం చేశాడు? అందుకు అత‌నికి ఎదురైన స‌మ‌స్య‌లేంటీ? స‌ంస్కృతి (ర‌ష్మిక‌), అజ‌య్‌ల మ‌ధ్య ప‌రిచ‌యం ఎక్క‌డ జ‌రిగింది?. ఆమెకు, భార‌తి కుటుంబానికున్న సంబంధం ఏమిటి? అన్న‌ది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:

`దూకుడు` త‌రువాత మ‌హేష్‌ మంచి ఈజ్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీని ట్రై చేసి చాలా కాల‌మే అవుతోంది. ఎప్ప‌టి నుంచే ఆ లోటుని తీర్చాల‌ని అనుకుంటున్నా మ‌హేష్‌లోని హ్యూమ‌ర్‌కు త‌గ్గ క‌థ‌, పాత్ర కుద‌ర‌లేదు. గ‌త కొంత కాలంగా సీరియ‌స్ ట‌చ్ వున్న పాత్ర‌ల్లో మాత్ర‌మే క‌నిపిస్తూ వ‌స్తున్న మ‌హేష్ వాటి నుంచి చిన్న రిలీఫ్ కావాల‌ని కోరుకుని మ‌రీ చేసిన చిత్ర‌మిది. ఆయ‌న భావించిన‌ట్టే సినిమాలో ఫుల్ ఫ‌న్‌ని త‌న పాత్ర‌తో క్రియేట్ చేశారు. ట్రైన్ ఎపిసోడ్ ర‌ష్మిక ఎంత అల్ల‌రి చేస్తే అంత‌కు రెట్టింపు అల్లరి మ‌హేష్ చేశారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ అంతా ఎక్స్‌పెక్ట్ చేసిన‌ట్టే న‌వ్వుల్ని కురిపిస్తుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని, ఎమోష‌న్స్‌ని, డ్యాన్స్‌, ఫైట్స్‌.. ఇలా ప్ర‌తీ స‌న్నివేశంలోనూ హుశారుగా క‌నిపించారు. ఈ సంక్రాంతికి మ‌హేష్ త‌న ఫ్యాన్స్‌కిచ్చిన కంప్లీట్ ప్యాకేజ్‌గా ట్రీట్ అనుకోవ‌చ్చు. తొలిసారి మ‌హేష్‌తో కలిసి న‌టిచినా ర‌ష్మిక కొన్ని కొన్ని సీన్‌ల‌లో డామినేట్ చేసే ప్ర‌యత్నం చేసింది. కొన్ని ఓవ‌ర్‌గా అనిపిస్తాయి కూడా. ట్రైల‌ర్‌లో ర‌ష్మిక పాత్రకి ఎక్కువ స్కోప్ ఇచ్చిన‌ట్టు క‌నిపించినా సినిమాలో మాత్రం పెద్ద‌గా ఉప‌యోగం లేని పాత్ర‌గా క‌నిపించింది.

ఇక 13 ఏళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి భార‌తి పాత్ర‌లో ఒదిగిపోయారు. ఆమె మాత్ర‌మే ఈ పాత్ర చేయాల‌ని అనిల్ రావిపూడి ఎందుకు ప‌ట్టుబ‌ట్టారో సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. భార‌తి పాత్ర‌లో చాలా హుందాగా క‌నిపించారామె. ఆమె క‌మ్ బ్యాక్‌కు స‌రైన పాత్ర ల‌భించింది. బండ్ల గ‌ణేష్ కామెడీ అనుకున్న స్థాయిలో లేద‌నిపించింది. ప్ర‌కాష్‌రాజ్ విల‌న్‌గా త‌న‌దైన మార్కుని చూపించారు. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంగీత‌, స‌త్య‌దేవ్‌, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, సుబ్బ‌రాజు, న‌రేష్‌, ర‌ఘుబాబు, స‌త్యం రాజేష్‌, బండ్ల గ‌ణేష్, ప‌విత్రా లోకేష్‌ త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:
ఆడియో ప‌రంగా కొంత వీక్ అనిపించినా నేప‌థ్య సంగీతంతో ఆ లోటుని పూడ్చే ప్ర‌య‌త్నం చేశాడు దేవిశ్రీప్ర‌సాద్‌. సినిమాలో మ‌హేష్ ఇంట్ర‌డ‌క్ష‌న్, ప్ర‌కాష్‌రాజ్ ప‌రిచ‌య స‌న్నివేశం, ఫారెస్ట్ నేప‌థ్యంలో వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు త‌న‌దైన బీజీఎమ్స్‌తో ఆ స‌న్నివేశాల‌ని మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఎలివేట్ చేశాడు. విజువ‌ల్స్ విష‌యంలో ర‌త్న‌వేలు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. ఫారెస్ట్ సీన్స్‌, కొండారెడ్డి బురుజు ఫైట్‌. ఇలా సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్‌ని చాలా లావిష్‌గా, అందంగా తీర్చిదిద్ది సినిమాకు మ‌రింత వ‌న్నె తెచ్చారు. అయితే త‌మ్మిరాజు క‌త్తెర‌కు మరింత ప‌నిక‌ల్పించి వుంటే బాగుండేది అనిపిస్తుంది. నిడివిని కొంత త‌గ్గిస్తే బాగుండేమో అనిపించ‌క మాన‌దు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అయితే అనిల్ క‌థ‌ని మ‌రింత కొత్త‌గా రాసుకుని వుంటే బాగుండేది. పాత క‌థ‌కే సైన్యం, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, పొలిటిక‌ల్ ట‌చ్‌ని ఇవ్వ‌డం కొంత నిరాశ‌ప‌రుస్తుంది. అయితే త‌న మార్కు పంచ్‌ల‌తో, ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాల‌తో సినిమాని పూర్తిగా నింపేశాడు. ఇది అనిల్‌కి క‌లిసి వ‌చ్చేలా వుంది.

విశ్లేష‌ణ‌:

తొలి భాగాన్ని డిసెంట్‌గానే ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఆర్మీ ఆప‌రేష‌న్‌, ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ బ్లాక్ ల‌తో ఆక‌ట్టుకున్నాడు. తొలి భాగాన్ని సాఫీగానే సాగించాడు కానీ సెకండ్ హాఫ్ ప్రారంభం అయిన త‌రువాత 20 నిమిషాల పాటు స్టోరీ మ‌రీ మంద‌గించ‌డం నీర‌సాన్ని తెప్పిస్తుంది. అయితే మైండ్ బ్లాక్ సాంగ్‌, లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతితో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్, టైటిల్ సాంగ్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. ఇక క్లైమాక్స్‌ని సాదా సీదాగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల మూస‌లోనే ఎండ్ చేసిన తీరు పేల‌వంగా వుంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడితో పాటు మ‌హేష్ అభిమానుల్ని కూడా చిరాకు పెట్టిస్తుంది. ఇంత మంచి ఆఫ‌ర్‌ని అనిల్ మ‌రింత బెట‌ర్ గా వాడుకుని వుండాల్సింది, అలా చేస్తే ఫ‌లితం మ‌రింత బెట‌ర్‌గా వుండేది అనిపిస్తుంది. కామెడీనే న‌మ్ముకున్నా అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. అయితే ఫ్యాన్స్‌ని మాత్ర‌మే ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని అనిల్ చేసిన ఈ ప్ర‌య‌త్నం మాత్రం ఫ‌లించింది అని చెప్పాల్సిందే. సినిమాలో అక్క‌డ‌క్క‌డ కొన్ని డ్రాబ్యాక్స్ వున్నా ఈ సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఫ‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ అని చెప్పొచ్చు.

- Advertisement -

Related Posts

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.....

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

తెలంగాణ డిగ్రీ పట్టభద్రులారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం ఇలా నమోదు చేసుకోండి

మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు...

సంక్రాంతికి ఊరెళుతున్నారా? 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్.. నో టికెట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా... ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి...

సీఎంకు చల్లటి చపాతీలు వడ్డించి అధికారి సస్పెండ్.. ఆ తర్వాత?

ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?...

Today Horoscope : సెప్టెంబర్ 27 th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్-27- ఆదివారం.- అధిక ఆశ్వీయుజమాసం - పాడ్యమి. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి మేష రాశి:ఈరోజు సురక్షితమైన చోట డబ్బు దాయండి ! మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా ..?

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

వైయస్ కుటుంభం మత మార్పిళ్లు ప్రోత్సహిస్తుందా??

2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

తనపై దాడికి వైస్సార్సీపీ కుట్రలు చేస్తోందంటూ బాంబు పేల్చిన ఎంపీ రఘురామరాజు

నర్సాపురం ఎంపీ రఘురామరాజు కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు...

Entertainment

ఒక్క అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి రష్మిక రచ్చ

ఛలో బ్యూటీ రష్మీక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, చేసే చేష్టలు, ఫోటో షూట్లు నవ్వు తెప్పించక మానవు. ఓ బుజ్జికుక్క పిల్ల...

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

ఈఎంఐలు కట్టలేకనే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాడు.. హైపర్...

హైపర్ ఆది.. ఆయనకు పేరు పెట్టినట్టుగానే ఆయన కొంచెం హైపరే. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, రివర్స్ పంచ్ వేయలేక మిగితా కంటెస్టెంట్లు జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన టాకింగ్ పవర్ అటువంటిది....

కంటెస్టెంట్లందరికీ పంచ్ ఇచ్చాడు.. నాగార్జున నిర్ణయంతో వారంతా షాక్!!

బిగ్‌బాస్‌లో మూడో వీకెండ్ బాగానా జరిగింది. మూడో వారంలో జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు టచ్ చేశాడు నాగార్జున. రోబోలు టాస్కును గెలవడం, మనుషుల టీం సభ్యులు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం,...

లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో...

ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా...

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

అజయ్ భూపతి,శర్వా సినిమాలోనూ ఆమెనే హీరోయిన్!

తొలి చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌'తో యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్‌. చూడచక్కనైన రూపంతో పాటు చక్కటి అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి శర్వానంద్‌ సరసన 'శ్రీకారం' అనే...

Rashmi Gautam Traditional Photos

Telugu Actress,Rashmi Gautam Traditional Photos Check out, Rashmi Gautam Traditional Photos ,Rashmi Gautam Traditional Photos shooting spot photos, Actress Tollywood Rashmi Gautam Traditional Photos...