Home Movie Reviews యాక్షన్ ని మించిన ఎమోషన్ - ‘ఖుదా హాఫీజ్’ రివ్యూ

యాక్షన్ ని మించిన ఎమోషన్ – ‘ఖుదా హాఫీజ్’ రివ్యూ


బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్ ఈసారి భావోద్వేగాలు ప్రధానంగా సామాన్యుడైన యాంగ్రీ యంగ్ మాన్ పాత్రతో అభిమానులని అలరించేందుకు ప్రత్యక్షమయ్యాడు. కొత్త దర్శకుడు ఫరూఖ్ కబీర్ యాక్షన్ ని పణంగా పెట్టి సున్నిత భావోద్వేగాలతో ప్రయోగం లాంటిది చేశాడు. అయితే తీసుకున్న కథా వస్తువు దశాబ్దాల బాలీవుడ్ చరిత్రలో అనేక సార్లు రిపీట్ చేసిందే. దీన్ని సున్నిత భావోద్వేగాల ప్రయోగంతో కొత్తగా ఎ మేరకు నిలబెట్టాడో చూద్దాం…

కథ
లక్నోలో కొత్తగా పెళ్ళయిన సమీర్ చౌదరి (విద్యుత్ జామ్వాల్) – నర్గీస్ (శివలీకా ఒబెరాయ్) లు 2008 ఆర్ధిక మాంద్య పరిస్థితుల్లో ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. ఇక ఉపాధి వెతుక్కోవడం మధ్య ప్రాచ్య దేశంలో తప్పనిసరవుతుంది. ప్రపంచం ఆర్ధిక మాంద్యంలో కుదేలైనా మధ్యప్రాచ్యం చమురు బావులతో నిక్షేపంగా వుంది. అక్కడ నోమన్ (కల్పిత దేశం) లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. పేపర్స్ క్లియర్ అవడానికి సమీర్ కి సమయం పట్టేలా వుండడంతో, ముందు నర్గీస్ బయల్దేరి వెళ్లిపోతుంది. వెళ్ళిన ఆమె కంగారుగా ఫోన్ చేస్తుంది తనని కిడ్నాప్ చేశారని. వెంటనే సమీర్ నోమన్ వెళ్ళిపోతాడు.

అక్కడ ఉస్మాన్ (అన్నూకపూర్) అనే టాక్సీడ్రైవర్ సాయంతో నర్గీస్ ని వెతికితే ఆమె వేశ్యాగృహంలో కన్పిస్తుంది. ఆమెని విడిపించేందుకు విఫలయత్నం చేసిన సమీర్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే, అక్కడ ఉస్మాన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ హత్యలోంచి ఎలా బయట పడి భార్యని కాపాడుకున్నాడన్నది మిగతా కథ.

నటనలు – సాంకేతికాలు
విద్యుత్ జామ్వాల్ ఒక సామాన్య లక్నో యువకుడి పాత్ర పోషించాడు. అన్యాయాలకి ఆవేశం పొంగుకొస్తుంది. కానీ ఎదుర్కొనే ధైర్యం చాలదు. ఆగ్రహమే తప్ప పోరాటం తెలియని అమాయకత్వం. ఇలాటి ఇతను నోమన్ లో అనుభవాల్లోంచి ఎలా రాటుదేలి బలవంతుడయ్యాడన్నది అతడి క్యారక్టర్ ఆర్క్. ఈ పాత్ర చిత్రణ వల్ల అభిమానులు అతన్నుంచి ఆశించే యాక్షన్ దృశ్యాలు తక్కువ వుంటాయి. ఒక సామాన్యుడిగా భార్యని వెతకడానికి సాయపడండని అడిగినప్పుడల్లా అతడి బలహీన స్వరం వణకడం, చేతులు వణకడం వంటివి వెంటాడే నటనగా వుంటాయి. పోరాటానికి తెగించాక ఇక హద్దులుండవు. ఈ పోరాట క్రమం కూడా అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ వుంటుంది. క్లయిమాక్స్ లో విజృంభిస్తుంది. విద్యుత్ జామ్వాల్ అండర్ ప్లే చేసిన ఈ పాత్ర, రొటీన్ యాక్షన్ హీరో పాత్రలకి భిన్నంగా జీవంతో కన్పిస్తుంది. అతడిలోని నటుణ్ణి బయటికి తీస్తుంది.

నర్గీస్ గా శివాలికా ఒబెరాయ్ ది చాలావరకూ కనిపించని పాత్ర. కిడ్నాపవడం కారణం. కాసేపే వున్నా కొట్టొచ్చే గ్లామర్. శివ్ పండిత్, ఆహానా కుమ్రా, నవాబ్ షాలు దుష్ట పాత్రలు పోషించారు.

మిథూన్ పాటలు, అమర్ మోహిలే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ యాక్షన్ మూవీకి ఓ మాదిరి ట్రెండీగా వున్నాయి. అరబ్ దేశపు లొకేషన్స్ కి, యాక్షన్ సీన్స్ కి జితన్ హర్మీత్ సింగ్ ఛాయాగ్రహణం డిటో.

కథా కథనాలు
కథేమీ లేదు. భార్య కిడ్నాపవడం, ఆమెని విడిపించుకోవడం ఇదే కథ, ఇంటర్వెల్లో భార్య దొరికినట్టే దొరికి మళ్ళీ దూరమవుతుంది. సెకండాఫ్ కథని లాగడానికే మళ్ళీ దూరం చేయడమేమో. రెండుసార్లూ భార్యని వెతికే కథనంలో కూడా బలం వుండదు. రాయబారుల చర్చలతో, విద్యుత్ ని ప్రశ్నించడాలతో నిండిపోతుంది. ఈ బలహీనతల్ని కవర్ చేసేందుకా అన్నట్టు విద్యుత్ పాత్ర చిత్రణ. బలహీనుడు ఎలా బలవంతుడయ్యాడన్న క్యారక్టర్ ఆర్క్. ఈ క్యారక్టర్ ఆర్క్ ఒక్కటే సినిమాని నిలబెట్టిందా అంటే లేదు. క్యారక్టర్ ఎదుగుదలకి తగ్గ దృశ్యాలతో కథనం పరుగులు దీయలేదు. పక్క దోవపడుతూ చర్చల్లో, ప్రశ్నించడాలూ అంటూ కూర్చుంది. ఇందుకే రెండుం పావు గంటల ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయావకాశాలు తగ్గాయి.

―సికిందర్

రచన – దర్శకత్వం : ఫరూఖ్ కబీర్
తారాగణం : విద్యుత్ జామ్వల్, శివాలికా ఒబెరాయ్, అన్నూ కపూర్, శివ్ పండిత్, నవాబ్ షా తదితరులు
సంగీతం : మిథూన్, ఛాయాగ్రహణం : జీతన్ హర్మీత్ సింగ్
బ్యానర్ : పనోరమా స్టూడియోస్
విడుదల : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
2.5/5


- Advertisement -

Related Posts

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

రివ్యూ : నాని ‘V’.. జస్ట్ ఏ రివేంజ్ స్టోరీ.. నాట్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్

నాని సినిమా మొదటిసారి ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయింది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ...

Recent Posts

ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే టాప్ : కంగనా రనౌత్

బాలివుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంది. కంగనాకి మరియు యుపి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న రగడ గురించి అందరికీ తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రి యోగి...

నేషనల్ లెవల్లో జగన్‌ను హీరోను చేస్తున్న మోదీ.. అందుకేనేమో ?

వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారా, మోదీ ఆయన్ను భుజానికెత్తుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.  వైఎస్ జగన్ 22 మంది ఎంపీలను కలిగి ఉండటంతో ప్రధాని వద్ద ఆయనకు...

Amala paul hd pictures

Tamil Actress Amala paul hd pictures Check out,Amala paul hd pictures Movie shooting spot photos, Actress Kollywood Amala paul hd pictures.

తిరుమలలో మరో అపచారమట.. మళ్లీ జగన్ మెడకే చుట్టుకుంది!!

ఏపీలో దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యొక్క మత విశ్వాసాలకు ముడిపెట్టి పెద్ద వివాదమే నడుపుతున్నారు కొందరు.  దేవాలయాల మీద దాడులను ఖండించాల్సిన, నిరోధించాల్సిన అవసరం ఉంది కానీ...

ఆయన్ని పీకేయడం తప్ప జగన్ కు ఇంకో ఆప్షన్ లేదు?…ఆ మంత్రి గారి పదవి గోవిందా?…

ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంత్రి గారి పని తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన మంత్రిత్వ శాఖలో వరుసగా వివాదాలు రేగుతుండటం,పైగా వాటని ఆయన సమర్థవంతంగా అడ్డుకోలేకపోతుండటం ఆయనకే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి...

Dharsha Gupta images

Tamil Actress Dharsha Gupta images Check out,Dharsha Gupta images Movie shooting spot photos, Actress Kollywood Dharsha Gupta images

కొబ్బరి చెట్టు ఎక్కి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి.. ఇదెక్కడి వింత బాబోయ్

సాధారణంగా ప్రెస్ మీట్ కానీ.. మీడియా సమావేశం కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఎవరైనా సరే వాళ్ల ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తారు. లేదా ఏదైనా హాల్ తీసుకొని అక్కడ...

EstherAnil gorgeous looks

Malayalam Actress EstherAnil gorgeous looks Check out,EstherAnil gorgeous looks Movie shooting spot photos, Actress Mollywood EstherAnil gorgeous looks

ఆ బిల్లు చాలా డేంజర్.. అది తేనె పూసిన కత్తి లాంటిది.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై కొన్ని చోట్ల ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే కదా. కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కూడా వ్యవసాయ బిల్లుకు నిరసనగా...

Misha Ghoshal new stills

Tamil Actress Misha Ghoshal new stills Check out, Misha Ghoshal new stills Movie shooting spot photos, Actress KollywoodMisha Ghoshal new stills.

Entertainment

ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే టాప్ : కంగనా రనౌత్

బాలివుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంది. కంగనాకి మరియు యుపి ప్రభుత్వానికి మధ్యలో జరుగుతున్న రగడ గురించి అందరికీ తెలిసిందే. యూపీ ముఖ్యమంత్రి యోగి...

Divya Ganesh Latest Photos

Tamil Actress Divya Ganesh Latest Photost Check out, Divya Ganesh Latest Photose shooting spot photos, Actress Kollywood Divya Ganesh Latest Photos.

Nivisha Latest Photoshoot

Tamil Actress Nivisha Latest Photoshoot Check out, Nivisha Latest Photoshoot Movie shooting spot photos, Actress Kollywood Nivisha Latest Photoshoot.

Amala paul hd pictures

Tamil Actress Amala paul hd pictures Check out,Amala paul hd pictures Movie shooting spot photos, Actress Kollywood Amala paul hd pictures.

Dharsha Gupta images

Tamil Actress Dharsha Gupta images Check out,Dharsha Gupta images Movie shooting spot photos, Actress Kollywood Dharsha Gupta images

Bigg boss 4: కామెడీ చేస్తే ఇక్కడ హీరోలా.. దేవీ ఫైర్.....

బిగ్ బాస్ హౌస్ లో భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. చివరకు హోస్ట్ నాగార్జున కంట్లోంచి కన్నీటి చుక్కలు జాలువారుతున్నాయి. ఇప్పుడిప్పుడే హౌస్ లో ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి. శనివారం ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను కలిశారు....

EstherAnil gorgeous looks

Malayalam Actress EstherAnil gorgeous looks Check out,EstherAnil gorgeous looks Movie shooting spot photos, Actress Mollywood EstherAnil gorgeous looks

Misha Ghoshal new stills

Tamil Actress Misha Ghoshal new stills Check out, Misha Ghoshal new stills Movie shooting spot photos, Actress KollywoodMisha Ghoshal new stills.

Rashmi Gautam Latest pics

Telugu Actress Rashmi Gautam Latest pics Check out, Rashmi Gautam Latest pics Movie shooting spot photos, Actress Tollywood Rashmi Gautam Latest pics