మామా అల్లుళ్ళ దసరా నవ్వులు -‘వెంకీమామ’ టీజర్ రివ్యూ!

మామా అల్లుళ్ళ దసరా నవ్వులు -‘వెంకీమామ’ టీజర్ రివ్యూ!

వెంకీ- చైతూలు దసరా పండక్కి ‘వెంకీ మామ’ టీజర్ తో ఎంటర్ టైన్ చేస్తున్నారు. జై జవాన్- జై కిసాన్ అంటూ జోడీ కట్టి నవ్విస్తున్నారు. కిసాన్ గా రైతు వేషంలో వెంకటేష్, ఆర్మీ జవాన్ నాగ చైతన్య స్క్రీన్ మీద కూడా మామా అల్లుళ్ళుగా రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్ ఎక్కి దుష్టుల్ని చెండాడుతున్నారు. “గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా” అంటూ వెంకటేష్ తన సహజ స్టయిల్లో డైలాగులు కొడుతూ చైతూకి పాఠాలు నేర్పడం ఈ టీజర్ లో హైలైట్ గా వుంది. సినిమా పై ఆసక్తి పెంచేలా వుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.

బాబీ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నా వెంకీ మామలో గ్లామర్ ని పంచడానికి ఇద్దరు హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్పుత్ వున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, రావు రమేష్, పోసానీ, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి నటిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెళ్ళ. దీపావళి విడుదలకి ఈ మూవీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.