నాగ్ వర్జిన్ అట -‘మన్మథుడు -2’ టీజర్ రివ్యూ!

ఆగస్టు 9 న తెలుగు ప్రేక్షకులకు నవమన్మథుడు కన్పించబోతున్నాడు. ‘మన్మథుడు’ మురిపించి 17 ఏళ్ళు అయింది. ఇక  ఆ మన్మథుడు మళ్ళీ వయసొచ్చి ‘మన్మథుడు -2’ గా వస్తున్నాడు. ఈ పాటికి అతనెవరో ఊహించే వుంటారు – కింగ్ అక్కినేని నాగార్జున! ‘మన్మథుడు -2’ టీజర్ తో ఇవ్వాళ వైరల్ అయ్యాడు. ముదిరిన వయసులో పెళ్లికి దిగిన నటోరియస్ బ్యాచిలర్ పాట్లతో ‘మన్మథుడు -2’ టీజర్ హాట్ హాట్ గా రిలీజైంది. క్షణాల్లో వైరల్ అయింది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి స్పందిస్తున్నారు.

“కోచింగ్ ఇవ్వాల్సిన టైమ్ లో బ్యాటింగ్ దిగుతున్నావేంటి?” అని నాగార్జున మీద విసిరే డైలాగుతో, “ఈ వయసులో మీకు పెళ్లేంటి? ఎండి పోయిన చెట్లకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?” అనే సెటైర్ తో నాగార్జునని ఏడ్పించే క్యారెక్టర్స్ ఓ పక్క, “ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బావుంటుంది. నువ్వు ఇంకా వర్జినే కదరా?” అన్న మదర్ ఓదార్పుతో టీజర్ సెక్సీ మిక్సీ గా వుంది. పెళ్ళికి కాంప్రమైజ్ అయినట్టు కనపడే నాగ్, మళ్ళీ ప్లేటు ఫిరాయిస్తున్నట్టు “ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్, ఐ ఓన్లీ మేక్ లవ్” అంటూ నాగ్ ఇచ్చే ఫినిషింగ్ టచ్ తో రోమాంటిక్ సీన్స్ మొదలవుతాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కన్పిస్తుంది… “చిలసౌ” దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీన్ని తెర కెక్కించాడు. టీజర్ తో ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ‘మన్మథుడు- 2’ మూవీగా ఇంకెంత క్రేజ్ సృష్టిస్తాడో ఆగస్టు 9 న చూడాలి.