అహో అనేలా ‘సాహో’ టీజర్ !

ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ హంగామా ‘సాహో’ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో 300 కోట్లతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన టీజర్ సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ థ్రిల్ చేశాడు. ప్రభాస్ న్యూ లుక్ బావుంది. హీరోయిన్ శద్ధ కపూర్ కూడా యాక్షన్ సీన్స్ లో వుంది. జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్ మొదలైన బాలీవుడ్ యాక్టర్స్ స్టయిలిష్ విలన్స్ గా కన్పించారు. ప్రభాస్ చేసే హై స్పీడ్ బైక్ ఛేజ్ హైలైట్ గా వుంది. టెక్నికల్ గా హాలీవుడ్ రేంజిలో వుంది.

మిషన్ ఇంపాసిబుల్, ట్రాన్స్ ఫార్మర్స్, అర్మగెడ్డాన్ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ కి పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ కేన్నీ బేట్స్ నైపుణ్యమంతా మరోసారి ‘సాహో’ లో ఎలివేట్ అయింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ హంగామా కనువిందు చేసేందుకు ఆగస్టు 15 న వచ్చేస్తోంది. రచన, దర్శకత్వం సుజిత్ నిర్వహించాడు.