Home Movie Reviews `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ రివ్యూ

`అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ రివ్యూ

న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, టాబు, జ‌య‌రామ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌ముద్ర‌ఖ‌ని, న‌వ‌దీప్‌, సునీల్‌, గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, రోహిణి, స‌చిన్‌ఖేడేక‌ర్‌, హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మానందం, అజ‌య్‌, చ‌మ్మ‌క్‌చంద్ర త‌దిత‌రులు న‌టించారు.

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్‌
నిర్మాత‌లు: అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: పీఎస్ వినోద్‌
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
రిలీజ్ డేట్‌: 12-01-2020
రేటింగ్‌: 3.25

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` త‌రువాత అల్లు అర్జున్ సినిమా వ‌చ్చి 18 నెల‌ల‌వుతోంది. గ‌తంలో ఇంత గ్యాప్ బ‌న్నీకి ఎప్పుడూ రాలేదు. క‌థ‌ల ఎంపిక‌, వెళుతున్న దారిప‌ట్ల స్పష్ట‌త‌, న‌మ్మిన క‌థ ఆశించిన రిజ‌ల్ట్‌ని అందించ‌క‌పోవ‌డం, త‌న రెగ్యుల‌ర్‌ టీమ్ మార‌డం వంటి కార‌ణాల వ‌ల్ల అల్లు అర్జున్ 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రాలేక‌పోయారు. 2016, 2017, 2018..ఈ మూడేళ్ల కాలంలో `స‌రైనోడు, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో న‌టించారు. ఈ మూడూ సీరియ‌స్ మోడ్ సినిమాలే. దీని నుంచి రిలీఫ్ కోసం చేసిన సినిమా `అల వైకుంఠ‌పుర‌ములో`. బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడ‌వ చిత్ర‌మిది. గ‌త చిత్రాల‌కు మించి ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఓ ఫ్లాప్ త‌రువాత అల్లు అర్జున్ నుంచి వ‌స్తున్న సినిమా కావడం, సీరియ‌స్ సినిమా `అర‌వింద‌స‌మేత‌` త‌రువాత త్రివిక్ర‌మ్ చేస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు పెరిగాయి. మాట‌ల‌తో మ్యాజిక్ చేసే త్రివిక్ర‌మ్ ఈ సారి ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకున్నారా?. 18 నెల‌ల విరామం త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారా? అన్న‌ది తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:

వాల్మీకి (ముర‌ళీశ‌ర్మ‌) అప్పుడే పుట్టిన త‌న కొడుకుని కోటీశ్వ‌రుడైన త‌న బాస్ ఆనంద్ శ్రీ‌రామ్ (జ‌య‌రామ్‌)కి, ఆనంద్ శ్రీ‌రామ్ కొడుకుని త‌న‌కి మార్చేసుకుంటాడు. ఈ విష‌యాన్ని ఓ న‌ర్సు మాత్ర‌మే చూస్తుంది. అయితే ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న కార‌ణంగా ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. వాల్మీకి ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రి. త‌న బాస్ కొడుకు బంటు(అల్లు అర్జున్‌)నే త‌న కొడుకుగా పెంచుతుంటాడు. బంటు సొంత త‌ల్లిదండ్రులు వుంటున్న‌ `వైకుంఠ‌పుర‌ము`(ప్యాలెస్ పేరు) వైపు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటాడు. 20 ఏళ్ల త‌రువాత ఓ సంఘ‌ట‌న కార‌ణంగా బంటుకి త‌న అస‌లు త‌ల్లిదండ్రులెవ‌రో తెలుస్తుంది. తెలిసిన వెంట‌నే బంటు వైకుంఠ‌పుర‌ములోకి ఎంట‌ర‌వ్వాల‌నుకుంటాడు. అక్క‌డ అత‌నికి ఎదురైన స‌వాళ్లేంటీ? ఇంత‌కీ అత‌న్ని త‌ల్లిదండ్రులు నిజంగానే దూరంగా పెంచారా?, వాల్మీకి ఎందుకు బంటుని వైకుంఠ‌పురానికి దూరంగా వుంచాల్సి వ‌చ్చింది?. దీని వెన‌కున్న అస‌లు క‌థేంటి? అన్న‌ది తెలియాలంటే `అల వైకుంఠ‌పుర‌ములో`(థియేట‌ర్ల‌లో)కి ఎంట‌ర‌వ్వాల్సిందే.

న‌టీన‌టులు:

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర ల‌భించింది. బంటు పాత్ర‌లో ఆల్ ఎమోష‌న్స్‌ని పండించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో బ‌న్నీ బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రికి కొడుకుగా, మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడిగా బ‌న్నీ న‌ట‌న బాగుంది. ఇక పాట‌ల్లో మునుప‌టి కంటే మ‌రింత‌ స్టైలిష్‌గా క‌నిపించాడు. బ‌న్నీకి న‌ట‌న ప‌రంగా `అల వైకుంఠ‌పుర‌ములో` ఓ మంచి సినిమా అని చెప్పొచ్చు. లాంగ్ బ్రేక్ త‌రువాత ఈ సినిమా రూపంలో అల్లు అర్జున్‌కి టైల‌ర్ మేడ్ పాత్ర ల‌భించింది. దాన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా తెర‌పై ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా బ‌న్నీ షో అని చెప్పాలి. ఇక మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రిగా ముర‌ళీశ‌ర్మ జీవించేశారు. వాల్మీకి పాత్ర ఆయ‌న‌కోస‌మే రాసిన‌ట్టుంది. అంత‌గా ఆ పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ రాణించార‌న‌డం క‌రెక్ట్‌. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌ల‌కు న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ ల‌భించలేదు. ఇక మిగ‌తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన జ‌య‌రామ్‌, టాబు, స‌చిన్‌ఖేడేక‌ర్‌, రోహిణి, న‌వ‌దీప్‌, స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్‌ పాత్ర‌ల ప‌రిథిమేర‌కు అల‌రించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సునీల్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్ కామెడీని పండించారు.

సాంకేతిక వ‌ర్గం:

త్రివిక్ర‌మ్ సినిమా అంటే కేవ‌లం మాట‌లే కాదు విజువ‌ల్స్ కూడా ఐ ఫీస్ట్‌గా వుంటాయి. ఈ సినిమా విష‌యంలోనూ ఆ స్టాండ‌ర్డ్స్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా చూసుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్న‌తంగా వుంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ వంటి రెండు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు నిర్మించిన సినిమా కావ‌డంతో మ‌నింత గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. పీఎస్ వినోద్ ఫొటోగ్ర‌ఫీ మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. విజువ‌ల్స్ స్టన్నింగ్‌గా వున్నాయి. పారిస్‌లో తీసిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట‌లో పారిస్ అందాలు, బుట్ట‌బొమ్మ‌పాట‌లో ప్ల‌జెంట్ సెట్ ఎట్మాస్మియ‌ర్ ఆక‌ట్టుకుంటుంది. రిలీజ్‌కి ముందే పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న త‌మ‌న్ నేప‌థ్య సంగీతంతోనూ మెప్పించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌న్ నుంచి వ‌చ్చిన చిత్రాల జాబితాలో ఈ ఆల్బ‌మ్ టాప్‌లో నిలుస్తుంది. న‌వీన్ నూలి ఎడిటింగ్ మ‌రింత మెరుగైతే బాగుండేది. సెకండ్ హాఫ్‌లో లాగ్‌ల‌ని ప‌ట్టించుకోలేదేమో అనిపిస్తుంది.

విశ్లేష‌ణ‌:

ఫ‌స్ట్ హాఫ్‌ని త‌న‌దైన మార్కు స‌న్నివేశాల‌తో త్రివిక్ర‌మ్ సాఫీగా సాగించారు. అయితే మ‌ళ్లీ రొటీన్ క‌థ‌నే ఎంచుకోవ‌డం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అజ్ఞాత‌వాసి, అత్తారింటికి దారేది చిత్రాల‌ని గుర్తు చేస‌య‌డం, అందులోని సీన్‌ల‌ని కొన్నింటికి రిపీట్ చేసిన‌ట్టుగా స‌గ‌టు ప్రేక్ష‌కుడికి తెలిసిపోతుంది. `అత్తారింటికి దారేది` చిత్రంతో ప‌వ‌న్ అత్త కోసం ఇంటికి వ‌స్తే..ఇక్క‌డ తండ్రి కోసం ఇంటిని వెతుక్కుంటూ బ‌న్నీ రావ‌డం, మ‌ల్టీ మిలియ‌నీర్ అయిన తండ్రి కంపెనీలో మేజ‌ర్ షేర్ కోసం విల‌న్ బ్యాచ్ ప్ర‌య‌త్నించ‌డం వంటి స‌న్నివేశాలు గ‌త చిత్రాల‌ని గుర్తు చేస్తున్నాయి. ఇది ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారే అవ‌కాశం వుంది. న‌రేష‌న్ ప‌రంగా కూడా పాత పంథానే త్రివిక్ర‌మ్ ఎంచుకోవ‌డం కూడా రొటీన్‌గా అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్‌లో క‌థాగ‌మ‌నం మంద‌గించ‌డం, కొన్ని స‌న్నివేశాలు డీవేట్ అవుత‌న్న‌ట్టుగా వుండ‌టం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఎక్క‌వు. మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుడిని మాత్ర‌మే దృష్టిలో వుంచుకుని కొన్ని స‌న్నివేశాల్ని రాసిన‌ట్టుగా అనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్ల‌లో చాలా వ‌ర‌కు బ‌న్నీ నాన్నింటికి దారేది అంటున్నారంటే ఏ సినిమాని రిఫ‌రెన్స్‌గా త్రివిక్ర‌మ్ తీసుకున్నాడో అర్థ‌మ‌వుతోంది. అయితే త‌న‌దైన మాట‌ల‌తో మాయ చేసే త్రివిక్ర‌మ్ ఈ సినిమాలో కూడా అక్క‌డ‌క్క‌డ త‌న పంచ్‌లైన్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు, క‌థ రొటీన్‌గానే అనిపించినా ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్‌ని మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

- Advertisement -

Related Posts

రివ్యూ: కలర్ ఫోటో

సినిమా పేరు: కలర్ ఫోటో ప్రొడక్షన్: అమృత ప్రొడక్షన్ నటీనటులు: సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష స్టోరీ: సాయి రాజేశ్ నీలం మ్యూజిక్ డైరెక్టర్: కాల బైరవ డైరెక్టర్: సందీప్ రాజ్ రిలీజ్ డేట్: అక్టోబర్ 23, 2020.....

అనుష్క.. ‘నిశ్శబ్దం’ సినిమా రివ్యూ

పేరు: నిశ్శబ్దం విడుదల తేదీ: 2 అక్టోబర్, 2020 నటీనటులు: అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలినీ పాండే డైరెక్టర్: హేమంత్ మధుకర్ ప్రొడ్యూసర్స్: కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్స్: గోపీ సుందర్, గిరీశ్ అనుష్క.. బాహుబలి సిరీస్...

రాజ్ తరుణ్.. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా రివ్యూ

పేరు: ఒరేయ్ బుజ్జిగా విడుదల తేదీ: అక్టోబర్ 1, 2020 నటీనటులు: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి డైరెక్టర్:  కొండా విజయ్ కుమార్ ప్రొడ్యూసర్: కేకే రాధా మోహన్ మ్యూజిక్...

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

Latest News

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారు వింతగా...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో అంతు చిక్కని కారణాలతో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన  చోటుచేసుకుంది. కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో పాతికమంది వరకు ఆసుపత్రిపాలయ్యారు. కొందరు శుక్రవారం రాత్రి...

బీజేపీ అనుకున్నది జరిగితే… తెరాస పార్టీ చిత్తవటం ఖాయం ?

అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ కాషాయ జెండా ఎగర వేయాలని ప్రయత్నిస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో స్థానిక పార్టీల హవా ఎక్కువగా ఉండడంతో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించడం లేదు...

Today Horoscope : డిసెంబర్ 6th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి : ఈరాశి పెండింగ్‌ పనులు పూర్తి ! కుటుంబ సభ్యలతో ఈరోజు ముఖ్యవిషయాలను చర్చిస్తారు. మీరు ఆకస్మికంగా పనికి సెలవుపెట్టి మీకుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అందువలన...

టీడీపీ లో మరో గుద్దులాట…అనంతపురంలో టీడీపీని నాశనం చేస్తారా? ప్రభాకర్ చౌదరి...

టీడీపీ పార్టీ లో నేతలు ఒక్కొకరిగా పార్టీ ని వీడిపోతున్నారు, ఉన్న నేతల్లో ఆధిపత్య పోరు బాబు గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.రీసెంట్ గా మరో వివాదం బయట పడింది.ప్రభాకర్ ...

బిగ్ బాస్ బ్రేకింగ్: ఈ వారం వెళ్లిపోయేది Aవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ఫైనల్స్ కి చేరువలో ఉంది. ఎప్పటికప్పుడు హౌజ్ లో కొత్త రంగులతో దర్శనమిస్తున్న కంటెస్టెంట్స్ పోటాపోటీగా పోరాడుతున్నారు. వారం మొత్తం కష్టపడిన వారు ఎలిమినేషన్ తుది...

గ్రేట‌ర్ వార్ : మజ్లిస్ లాభం వెనుక బీజేపీ..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార టీఆర్ఎస్ కొన్ని సీట్లను కోల్పోగా, మ‌జ్లిస్ మాత్రం అన్యూహంగా అనుకున్నవాటికంటే ఎక్కువ సీట్ల‌నే ద‌క్కించుకుని ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఒక‌వైపు టీఆర్ఎస్, బీజేపీలు హోరా హోరీగా...

గ్రేట‌ర్ ఎన్నిక‌లు : బీజేపీ పాచికాలు పార‌డానికి.. అస‌లు కార‌ణాలు...

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు ముగిసాయి. ఈ ఎన్నిక‌ల్లో విశేషం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావం నుండి ప్ర‌తిఎన్నిక‌ల్లో దూకుడు త‌గ్గ‌కుండా జోరుసాగించిన కారుకు తొలిసారి బ్రేక్ ప‌డింది. చివ‌రికి అతిపెద్ద పార్టీగా నిలిచి...

గెలిచి ఓడిందెవ‌రు.. ఓడి గెలిచిందెవ‌రు..?

కార్పొరేషన్ ఎన్నికల నేప‌ధ్యంలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దాదాపు రెండు వారాల‌కు పైగా సాగిన హడావుడి మొత్తం గురువారం ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌డంతో ముగిసింది. ఎన్న‌డూ లేనివిధంగా ఈసారి గ్రేట‌ర్ ఎన్నిక‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని...

కేసీఆర్‌కి మరో దెబ్బ.. అతి త్వరలో.!

త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగబోతోంది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌...

వాంతి చేసుకున్న తిమింగ‌ళం.. కోటీశ్వ‌రుడైన మ‌త్స్య‌కారుడు

అదృష్టం ఎప్పుడు..ఎవరి తలుపు కొడుతుందో తెలీదు. అందుకే ఎంత కష్టపడే తత్వం ఉన్నా..మనిషికి ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి అంటారు పెద్దలు. అలాగే ఎప్పుడూ గంగమ్మ ఒడిలో ఉంటూ..చేపలు పట్టుకునే జాలరికి...

29 ఏళ్ళ వ‌య‌స్సులో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ఆల్‌రౌండ‌ర్.. ల‌వ‌ర్...

ఒక దేశం త‌ర‌పున మ్యాచ్ ఆడే అవ‌కాశం రావ‌డం ఎంతో అదృష్టం అని చెప్ప‌వ‌చ్చు. ఎంతో ప్ర‌తిభ ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు గల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ప్ర‌తిభ‌తో పాటు అదృష్టం...

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ‘షో’: ఈ హడావిడి ఎన్నాళ్ళు.?

పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా, వచ్చి వెళితే ఎలాంటి హడావిడి వుంటుందో, అలాంటి హడావిడి.. ఆయన జనంలోకి వెళ్ళినా కనిపిస్తోంది. అంతే తప్ప, పవన్‌ కళ్యాణ్‌ ఒక పొలిటీషియన్‌లా.. ఆయన చేస్తున్నవి రాజకీయ...

బిగ్ బాస్ 4: గాయాల‌తో ఇబ్బందిప‌డుతున్న అభిజీత్.. హౌజ్ నుండి బ‌య‌ట‌కు...

బిగ్ బాస్ షో  సీజన్‌ 4 ఎండింగ్ దశకు వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మోనాల్ ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్...

బ్రేకింగ్ : అంబటి రాంబాబు కి రెండోసారి సోకిన కరోనా !

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు కూడా కరోనా మహమ్మారి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారికి మరోమారు వైరస్...

బిగ్ బాస్ 4 : మోనాల్ ఎలిమినేట్ !

బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వైపు సాగే కొద్ది మరింత ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం 13వ వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారంలో నామినేషన్స్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. అభిజిత్...

మేయర్ పీఠంపై కింకర్తవ్యం?

గత గ్రేటర్ ఎన్నికల్లో సునాయాసంగా తొంభై తొమ్మిది స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీఆరెస్ పార్టీకి ఈసారి ఆ పదవి అందని మానుపండులా తయారయింది.  నగరపౌరులు ఇచ్చిన తీర్పు ఎవరికీ అనుకూలంగా...

ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌: ప్రైవేటుతో ప్రజలకు లాభమెంత.?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమూల్‌ ప్రాజెక్ట్‌ చుట్టూ చాలా హంగామా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో పాల సిరులు కురుస్తాయని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. పాడి రైతులకు స్వర్ణయుగంగా ఈ...

తెలుగమ్మాయిలపై అలాంటి అభిప్రాయం.. చాందినీ చౌదరీ కామెంట్స్

తెలుగు తెరపై తెలుగమ్మాయిలు స్టార్డం తెచ్చుకోవడమన్నది అంత ఈజీ కాదు. మన వాళ్లు బొంబాయి, ఉత్తరాది భామలను మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. తెలుగమ్మాయిలకు అంతగా చాన్సులు ఇవ్వరు. ఇచ్చినా హీరోయిన్ క్యారెక్టర్లు ఇవ్వడానికి...

సుదీప్ మెచ్చిన తెలుగు హీరో స్టార్ ఎవరంటే ?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర ఇండస్ట్రీ నటీనటులు కూడా బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. బాషాభేదం లేకుండా ఆడియెన్స్ కూడా ప్రతిభ ఉన్న నటులని భాగానే లైక్ చేస్తున్నారు. సుదీప్ రక్త చరిత్ర,...

ఆ ముగ్గరిపై ముద్దుల వర్షం.. విడిచి ఉండకలేకపోతోన్న అనసూయ

అనసూయ గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటోందన్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం చెన్నైలోనే గడిపింది. నివర్ తుపాను ప్రభావం తగ్గిన తరువాత అనసూయ అక్కడికి మకాం మార్చేసింది. విజయ్ సేతుపతి,...

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. బేబీ బంప్‌తో స్టెప్పులు.....

టాలీవుడ్ క్రేజీ యాంక‌ర్స్‌లో హ‌రితేజ ఒక‌రు. సినిమాలు, సీరియ‌ల్స్ చేసుకుంటూ కాలం గ‌డిపిన ఈ బ్యూటీకి అనుకోకుండా సీజ‌న్ 1లోనే బిగ్ బాస్ ఆఫ‌ర్ త‌లుపు త‌ట్టింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా...

బిగ్ బాస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న నాగార్జున...

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోవైపు ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘వైల్డ్ డాగ్‌’ సినిమాని రీసెంట్ గా కంప్లీట్...

ఆ జాబితాలో సౌత్ నుండి అల్లు అర్జున్ ఒక్కడే !

అల్లు అర్జున్ .. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఈ మెగా హీరో , ఇండస్ట్రీలో స్టైల్ కి కేరాఫ్. సినిమా సినిమాకి తన మేకోవర్ లో పూర్తి మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు...

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసిన రాజమౌళి.....

ఎస్ ఎస్ రాజమౌళి - యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ ల అత్యంత క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ...

‘ప్రెసిడెంట్ మెడల్’ వచ్చింది , త్వరలో ‘సీఎం మెడల్’ వస్తుందేమో :...

ఆంధ్రప్రదేశ్ లో ఉండే మద్యం బ్రాండ్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పింది అని , అధికారంలోకి...

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస దెబ్బతినడానికి మెయిన్ రీజన్ కేటీఆర్ చేసిన ఆ పనేనా ?

గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి ఊపేస్తాం అంటూ గొప్పలు చెప్పిన తెరాస చివరికి 55 స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది.  గత ఎన్నికల్లో ఘనంగా 99 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి 44 స్థానాలు...

సెలెబ్రేషన్స్ ప్రారంభం … పెళ్లి కూతురిగా ముస్తాబైన నిహారిక !

మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌ కు చేరుకొని...

రఘురామరాజు వైసీపీకి చేస్తున్న డ్యామేజ్ రాష్ట్రం దాటిపోయి నేషనల్ లేవల్లోకి వెళ్ళిపోయింది !

వైసీపీలో మొట్ట మొదటగా లేచిన అసమ్మతి స్వరం ఎంపీ రఘురామకృష్ణరాజుదే.  చిన్న చిన్నగా అధిష్టానం మీద విమర్శలు స్టార్ట్ చేసిన ఆయన మెల్లగా దాన్ని యుద్ధంలా మార్చేశారు.  ఒకానొక దశలో ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతి...