మెగా హీరోకి ఎవడో పెద్ద టోపీనే పెట్టబోయాడు

సినిమా స్టార్లు అంటే అన్నింటికీ అలుసే. విమర్శలు చేయాలన్నా, వారి పేరును వాడుకుని మోసాలు చేయాలన్నా ఈజీగా టార్గెట్ చేసేస్తుంటారు. పలానా సినిమా హీరో నాకు తెలుసు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడిన కేటుగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి మూలంగా ఇబ్బందులు పడిన స్టార్లు అనేకమంది.

చిన్న నుండి పెద్ద స్థాయి హీరోల వరకు ఇలాంటి మోసాలకు బాధితులే. తాజాగా మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ కూడ ఇలాంటి మోసానికి గురయ్యారు. ఎవరో ఒక చీటర్ తేజ్ పేరును వాడుకుని డబ్బులు వసూలు చేయాబోయాడు. ఆ చేయడం కూడ బయటి వ్యక్తుల నుండి కాదు ఏకంగా సాయి తేజ్ సన్నిహితుల నుండే కావడం పెద్ద ట్విస్ట్. సాయి తేజ్ వర్క్ చేసిన నటీనటుల కాంటాక్ట్ డీటైల్స్ పట్టిన సదరు చీటర్ తనను తాను సాయి తేజ్ అని చెప్పుకుని ఉన్నపళంగా డబ్బుకు కావాలని అడిగేవాడట.

సాయి తేజ్ లాంటి హీరో అలా 20 వేలు, 30 వేల కోసం మెసేజెస్ పెట్టడంతో అనుమానం వచ్చిన ఆయన సన్నిహితులు నేరుగా సాయి తేజ్ ను సంప్రదించగా మోసం బయటపడింది. దీంతో షాక్ తిన్న తేజ్ పోలీస్ పిర్యాధు చేసి తన పేరు వాడుకుంటూ ఎవరో మోసాలకు పాల్పడుతున్నారని, తన పేరుతో డబ్బులు అడుగుతూ వచ్చే సందేశాలను పట్టించుకోవద్దని సోషల్ మీడియా వేదికగా తన సన్నిహితులను అలర్ట్ చేశారు.