శంకర్, చరణ్ భారీ సినిమా వాయిదా..!

Producer Dil Raju gave a new update about Ram Charan and Shankar movie

రీసెంట్ గా టాలీవుడ్ లో నెలకొన్నటువంటి షాకింగ్ పరిస్థితులు రీత్యా తెలుగు సినిమా గిల్డ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు పాటు తెలుగు సినిమాల షూటింగ్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేయగా ఆ నిరసనలకు తెలుగులో అనేక భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి.

మరి ఈ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబోలో ప్లాన్ చేసిన సినిమా కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమాపై కీలక సమాచారం మెగా కాంపౌండ్ పి ఆర్ నుంచి బయటకి వచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితితో షూటింగ్స్ ఎప్పుడు మొదలు అవుతాయో ఎవరికీ అర్ధం కావట్లేదు అని, అందుకే తమిళ్ లో శంకర్ ఉలగనయగన్ కమల్ హాసన్ తో ప్లాన్ చేసిన మరో భారీ సినిమా “భారతీయుడు 2” కొత్త నిర్మాతల రిక్వెస్ట్ మేర 10 రోజులు పాటు షూటింగ్ కోసం తాను చెన్నై వెళ్లనున్నట్టుగా తెలిసింది.

అలాగే దీని తర్వాత శంకర్ అయితే ఈ నెల మధ్యలో వస్తారని అప్పటికి షూటింగ్స్ మొదలైతే చరణ్ తో వైజాగ్ లో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇక దీని తర్వాత మళ్ళీ చరణ్ కి లుక్ చేంజ్ ఉందని దీనికి 15 నుంచి 20 రోజులు సమయం పట్టడంతో మళ్ళీ శంకర్ 10 రోజులు షూట్ కోసం చెన్నై వెళ్తారని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రాజమండ్రి లో షెడ్యూల్ ని శంకర్ స్టార్ట్ చేస్తారని తెలుపుతున్నారు. మొత్తానికి అయితే శంకర్ ఇలా ప్లాన్ చేసుకుంటున్నాడు.