పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

Rana made interesting comments on pawan kalyan

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి అలాంటి పాత్రలలో పవన్ కళ్యాణ్-రానాలు నటించటంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందించటమే కాకుండా అన్ని దగ్గరుండి పర్యవేక్షించడం ప్లస్ పాయింట్. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాతి కానుకగా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.

Rana made interesting comments on pawan kalyan

నటుడు రానా తాజాగా ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. పవన్ తో కలిసి సినిమా చేయటంపై రానా స్పందిస్తూ “ఆయనకు సినిమా మీద అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్నాయి. ఒక కొత్త కోణంలో సినిమా గురించి ఆలోచిస్తారు. చాలా ఈజీగా పాత్రను అర్ధంచేసుకుని తొందరగా అందులోకి ఇమిడిపోవటం పవర్ స్టార్ కి ఉన్న గొప్ప లక్షణం. అనుభవం ఉన్నటువంటి నటుడితో కలిసి పనిచేయటం వల్ల అనేక కొత్త విషయాలను నేర్చుకునే వీలు ఉంటుంది. పవన్ ఒక పుస్తకం లాంటోడు. ఆయనకు ప్రతి విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని” పవన్ ను ఒక రేంజ్లో పొగిడారు.