రామ్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఇదేనా !

Ram finalised linguswamy project via twitter

రామ్ పోతినేని… అన్నీ ఉన్న అదృష్టం కూడా కొంచెం ఉండాలన్న సామెత ఈ కుర్ర హీరోకి సూటవుతుందని చెప్పుకోవచ్చు. స్టార్ హీరో అయ్యేందుకు కావాల్సిన సపోర్ట్, స్టామినా, ఫీచర్స్ అన్ని ఉన్నా ఇంకా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవ్వలేదు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఉనికిని గట్టిగానే చాటుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన ‘రెడ్’ మూవీ బోల్తా కొట్టేయటంతో మరలా అయోమయంలో ఉంది రామ్ పరిస్థితి.

 

Ram finalised linguswamy project via twitter

ప్రస్తుతం ఈ హీరో సెట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ముందుగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా,కోలీవుడ్‌లో సంచనల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురుగదాస్‌ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. తాజాగా లింగుస్వామి ప్రాజెక్ట్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారకంగా ఫైనల్ చేసి అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు.

రామ్ తన ట్విట్ లో “ఫైనల్ నెరేషన్ పూర్తి అయింది.. అదిరిపోయింది.. లవ్యూ లింగుస్వామి సర్.. సూపర్ డూపర్‌గా ఉంది.. ఇక మొదలుపెట్టేద్దాం అంటూ… పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ హై వోల్టెజ్ మూవీని తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ స్క్రీన్స్‌పై నిర్మిస్తుండగా… దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటంతో దర్శక నిర్మాతలు అతి త్వరలో షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారట.