‘మాస్ మహారాజా’ జోడిగా ఇద్దరు హీరోయిన్స్

Rajisha Vijayan and Divyansha kaushik both are play leading roles in Ramarao on duty movie

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. వాస్తవిక సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వ అధికారిగా అలరించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించింది. మజిలీ మూవీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, తమిళ…మలయాళ సినిమాల్లో నటించిన రజిషా విజయన్ లు మాస్ రాజాతో ఈ మూవీలో ఆడిపాడనున్నారట. డ్యూటీ విషయంలో రామారావుపై ఈ ఇద్దరు ప్రభావం ఎక్కువగా ఉంటుందని డైరెక్టర్ పేర్కొనటంతో హీరోయిన్ల పాత్రలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉందని అర్ధమవుతుంది.

Rajisha Vijayan and Divyansha kaushik both are play leading roles in Ramarao on duty movie

వరుస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ సినిమా విజయంతో జోరుగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో “ఖిలాడి” సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే ‘రామారావు’ కూడా మొదలెట్టేశాడు. ఇటీవల విడుదలైన రామారావు ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభించింది. ఇప్పటికే హీరో హీరోయిన్ల మీద పలు సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్, ఆర్ టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ అందిస్తున్నారు.

https://twitter.com/directorsarat/status/1416982779212926979