డిసెంబర్ లో పుష్ప రిలీజ్ ?

Is Pushpa movie going to release in december month ?

అల్లు అర్జున్, సుకుమార్ ద్వయం నుండి వచ్చిన గత చిత్రాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కాంబోలో నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరికను ఎట్టకేలకు ఇన్నాల్టికి తీరబోతుంది. గత సినిమాలకు భిన్నమైన జోనర్ లో వస్తున్న “పుష్ప” మాస్ మసాలా మూవీ కావటంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇటీవలనే విడుదలైన టీజర్ తో ఈ మూవీ మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేస్తుండటం విశేషం.

Is Pushpa movie going to release in december month ?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పుష్ప షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మేకర్స్ డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ మూవీలో విలన్ గా నటించటం మరో హైలైట్ అని చెప్పుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.