Home News సంక్రాంతిని కబ్జా చేసిన పవర్ స్టార్

సంక్రాంతిని కబ్జా చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అప్డేట్ వచ్చిందంటే చాలు అభిమానులకు పండగే. క్షణాల్లో వైరల్ చేసి తమ ఆరాధ్య నటుడి పవర్ ను ప్రపంచానికి తెలియజేసే పనికి పూనుకుంటారు. మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ను రీమేక్ గా వస్తున్న పవర్ స్టార్ కొత్త మూవీ మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలో మేజర్ పార్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నట్లుగా అర్ధమవుతుంది. ఈ మల్టీ స్టారర్ మూవీలో లీడ్ రోల్స్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు తమ పాత్రలలోకి మారిపోవటం కనిపిస్తుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకోవటం, ఇక దర్శకుడు సాగర్ కె  చంద్ర కూల్ గా తన పని చేసుకోవటం ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్న పవన్ లుక్ మరియు ఆటిట్యూడ్ ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి వస్తున్నట్లుగా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మూవీలో పవన్ పక్కన నిత్యామీనన్, రానాతో ఐశ్వర్య రాజేష్ జోడీలుగా నటిస్తున్నారు. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Related Posts

జనంలోకి జనసేనాని.. జనసైనికుల్లో జోష్ వస్తుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత జనంలోకి వెళ్ళబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లను బాగు చేసేందుకు శ్రమదానం చేయనున్నారట జనసేన అధినేత. ఈ మేరకు పార్టీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. అక్టోబర్...

బిగ్ బాస్ తెలుగు: అప్పుడు అవినాష్, ఇప్పుడు రవి.!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 5 విషయానికొస్తే, చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది కంటెస్టెంట్ల తీరు బిగ్ హౌస్‌లో. సుదీర్ఘమైన నామినేషన్ల ప్రక్రియ.. సుదీర్ఘమైన టాస్కులు.. ఇవేవీ వీక్షకులకు 'కిక్కు' ఇవ్వలేకపోతున్నాయి....

Related Posts

Latest News