Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ తో ఇంకొకటి చెయ్యాలి

Nidhi agarwal shares her experience with pawan kalyan

Nidhi Agarwal: అటు సినిమాలలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ తన అందాలను ఏమాత్రం దాచుకోటానికి ఇష్టపడని హీరోయిన్ నిధి అగర్వాల్. అమ్మడు అభిమానులకి ఆల్వేస్ అందాలతో కనుల విందు చేస్తూ అలరిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన గల్లా అశోక్ డెబ్యూ మూవీ ‘హీరో’ ఈ నెల 15న సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిధి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

” నేను పుట్టింది హైద‌రాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా క‌నెక్ట్ అయ్యాను. హిందీ, త‌మిళ సినిమాలు చేసినా తెలుగు ప‌రిశ్ర‌మ అంటేనే నాకు చాలా ఇష్టం. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య హీరో మూవీ స్టోరీ చెప్పగానే ఇదొక ఆఫ్-బీట్ సినిమా అనిపించి వెంటనే ఓకే చెప్పాను. అయినప్పటికీ ఆదిత్య ఇందులో సాంగ్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి బాగా నచ్చుతుంది. అశోక్ కొత్తవాడిలా కాకుండా అనుభవమున్న నటుడిలా నటించాడు. నేను ఆయ‌న‌కు ఏమీ హెల్ప్ చేయ‌లేదుకానీ డాన్స్ ప‌రంగా కొంచెం త‌ను నాకు హెల్ప్ చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నాకు గ్లామర్ హీరోయిన్ గా పేరొచ్చినా అది నాకు ప్లస్ అయ్యింది. నాకు యాక్షన్ పాత్రలంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి మూవీ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నాకు కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. పవన్ సర్ మూవీ పెద్ద పాత్రలో నటించటం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఇదొక మంచి పీరియాడిక్ మూవీగా ఆకట్టుకుంటుంది. ఇంకా తెలుగులో నేను అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్‌.టి.ఆర్‌. తో నటించాలని కోరిక ఉంది. కళ్యాణ్ గారితో మరొక సినిమా చేయాలనుంది.

తెలుగులో ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పకోలేదు. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేశాను. మ‌రో తమిళ మూవీ కూడా లైన్లో ఉంది. అమ‌ర్ రాజా ప్రొడ‌క్ష‌న్ లో చేయ‌డం ప‌ద్మ గ‌ల్లాగారి తో ప‌నిచేయ‌డం ఆనందంగా వుంది. నా ఇష్ట‌మైన కెమెరామెన్ స‌మీర్ రెడ్డిగారితో ప‌నిచేశాను” అని నిధి చెప్పుకొచ్చింది.