Megastar Chiranjeevi: అల్లుడికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన మెగాస్టార్

Megastar says 'all the best' to Pushpa team

Megastar Chiranjeevi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ లు మూవీ మీద అంచనాలను విపరీతంగా పెంచేశాయి. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 3000 థియేటర్ లలో రిలీజ్ అవబోతుంది. పుష్ప దెబ్బకి ఇండియాలో హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’ ను ఒకరోజు ముందుగా రిలీజ్ చేస్తున్నారంటే ఏ రేంజ్ లో హైప్ ఉందొ అర్ధం అవుతుంది.

ఇక విడుదలవుతున్న అన్ని రాష్ట్రాలలోనూ ప్రొమోషన్స్ చేస్తూ పుష్ప టీం అటు ఇటు చెక్కర్లు కొడుతోంది. పుష్ప టీం కష్టాన్ని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందించారు. పుష్ప యూనిట్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పిన చిరు… మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, మనస్సు పెట్టి తెరకెక్కించారు. మీ ప్రయత్నం అందరిచే ప్రశంసించబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని అన్నారు.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మాస్ మసాలా అంశాలు ప్రేక్షకులని బాగా అలరిస్తాయని చిత్ర యూనిట్ చెప్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన తొలిసారిగా జతకట్టింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. సమంత ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ తన క్రీటివిటీని ఎలా చూపెట్టారో రేపు తెలిసిపోతుంది.