జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో అది పెద్ద దోషం..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఎన్టీఆర్ 2018 త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత చిత్రం ద్వారా చివరిసారిగా ప్రేక్షకులను తెరపై సందడి చేశారు. ఈ సినిమా తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి తెరపై కనిపించని తారక్ ఈ ఏడాది RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ లోటును భర్తీ చేశారు. ఈ సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా హనుమాన్ దీక్ష చేశారు. అయితే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేయడానికి గల కారణాలు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని, ఆ దోషం తొలగిపోవడానికే ఇలా హనుమాన్ దీక్ష వేశారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత ఆ హీరోలకు తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఈ సెంటిమెంట్ కారణంగా తారక్ ను వెంటాడుతున్న ఆ దోషం తొలగిపోవడానికి ఇలా హనుమాన్ దీక్ష వేశారని ఎన్టీఆర్ సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

21 రోజుల పాటు కొనసాగే ఈ దీక్షను ఎన్టీఆర్ ఎంతో నిష్టగా చేస్తున్నారు. త్వరలోనే హోమం కూడా నిర్వహిస్తున్నారని, ఎన్టీఆర్ జాతకంలో ఆ దోషం తొలగిపోవాలంటే హోమం చేయాల్సిందేనని ఆయన సన్నిహితులు తెలియచేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఎన్టీఆర్ దోషం కారణంగా హనుమాన్ దీక్ష తీసుకున్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.