శ్రీకాంత్: ఆ టైంలో ‘మెగాస్టార్’ లేకపోతే… ఇక్కడ ఇలా ఉండేవాడిని కాదు !

Hero srikanth shares his emotional experience in film industry

టాలీవుడ్లో ఉన్న హీరోల్లో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన వారిలో ‘శ్రీకాంత్’ ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో, విలన్ గాను చేస్తూ హీరోగా మారి అందర్నీ అలరించాడు. ఆ రోజుల్లో యూత్, ఫామిలీ ఆడియన్స్ లో శ్రీకాంత్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కెరీర్లో వందకు పైగా చిత్రాలలో హీరోగా నటించాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఆయన విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా టాలీవుడ్లోకి హీరోగా పరిచయమయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తనకు గతంలో ఎదురైన ఒక విశాద సంఘటనను పంచుకున్నారు.

Hero srikanth shares his emotional experience in film industry

శ్రీకాంత్ మాట్లాడుతూ… “హీరోగా నా కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ఒకే ఏడాది నేను నటించిన 7 సినిమాలు పరాజయం పాలయ్యాయి. అప్పుడు నేను చాలా భయపడిపోయాను. నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదా? హీరోగా నా ప్రయాణం ముగిసిపోయిందా? నా కెరీర్‌ అప్పుడే ముగిసిందా ? ఇలా ఎన్నో అనుమానాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాను. ఇక మా ఊరెళ్లిపోయి, అక్కడ వ్యవసాయం చేసుకుని సెటిలైపోయిదామని నిర్ణయించుకున్నాను. అలాంటి టైంలో చిరంజీవి అన్నయ్య ఇచ్చిన ఓదార్పు, ధైర్యంతో మళ్లీ సినిమాలు చేస్తూ నా కెరీర్‌ను కొనసాగించాను” అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్.