చిరంజీవి అనుకున్నది …చరణ్ చేస్తున్నాడు

Chiru is happy that the movie opportunity with Shankar has come to Cherry

ఇండియాలోని మేటి దర్శకులలో శంకర్ ఒకరు. సమకాలీన సామాజిక సమస్యల మీద ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంటారు. భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయనతో కలిసి పని చెయ్యాలని నటీనటులు, టెక్నీషియన్లు ఆశ పడుతుంటారు. ఆ కోవలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. శంకర్ తో సినిమా చెయ్యాలనుందని చిరు అనేక సందర్భాలలో మనసులోని కోరికను బయటపెట్టటం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

Chiru is happy that the movie opportunity with Shankar has come to Cherry

అయితే చిరు తనయుడు రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ తో మూవీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. తనకు కుదరకపోయినా చెర్రీకి ఆ అవకాశం రావటంతో చిరు ఆనందపడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే… పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాన్ ఇండియా రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ ఎలాంటి వండర్ చేస్తాడో అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.