Bigg Boss6: బిగ్ బాస్ లోకి నటుడు అమర్ దీప్…ఇక షో మొత్తం రచ్చ రచ్చే!

Bigg Boss6: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్య అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమం 5 సీజన్లోని పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయంపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ క్రమంలోని బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే పలువురు బుల్లితెర నటీనటులు అలాగే యూట్యూబ్ స్టార్స్, యాంకర్లు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమానికి జానకి కలగనలేదు సీరియల్ నటుడు అమర్ దీప్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమర్ పేరు కూడా కంటెస్టెంట్ల లిస్టులో ఉండటం గమనార్హం.

ఇలా జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమర్ ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళితే షో మొత్తం రచ్చ రచ్చ ఉంటుందని చెప్పాలి. అయితే తాజాగా ఈయన బుల్లితెర నటి తేజస్వినితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి వెళ్తారా? లేక పెళ్లి అయిన వెంటనే ఈ కార్యక్రమంలోకి వెళ్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.అయితే ఈ విషయం గురించి ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.