Anaganaga Oka Raju : రాజుగాడి పెళ్లి అదిరిపోవాలి! – నవీన్ కొత్త కామెడీ టీజర్

Anaganaga Oka Raju : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో హిట్ కామిక్ హీరోగా ముందుకు దూసుకుపోతున్న బ నవీన్ పొలిశెట్టి మరో కామెడీకి శ్రీకారం చుట్టాడు. ఆదివారం కనుమ పండుగ సందర్భంగా సాయంత్రం టీజర్ రిలీజ్ చేశాడు.

తన కామెడీ టైమింగ్, పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకుల్ని తెగ నవ్విస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా ఎస్టాబ్లిష్ అయిన నవీన్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్న సంగతి కూడా తెలిసిందే.

Anaganaga Oka Raju - Title Teaser | Naveen Polishetty | Thaman S | Kalyan Shankar

 

ఈ టైటిల్ టీజర్ లో తను ఏక పాత్రాభినయం చేశాడు. రాజుగాడి పెళ్లి అదిరి పోవాలంటూ – తన పెళ్లి ఏర్పాట్ల గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తెలంగాణ సహా అన్నీ యాసలలో డైలాగులు కొట్టే సీను కన్పించాడు. తన డ్రెస్సింగ్, బంగారు ఆభరణాలు, అలంకరణ, హనీమూన్ మొదలైన వాటి గురించి మాట్లాడుతూంటాడు. చివరగా, ‘అనగనగా ఒక రాజు’ అని టైటిల్ రివీల్ అవుతుంది.

‘అనగనగా ఒక రాజు’ వినోదభరితమైన ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ఈ టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఈ కామెడీకి నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.