షాకింగ్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నారు.  ముంబై బాంద్రాలోని  తన ఇంట్లో ఈరోజు ఆదివారం ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటనతో యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయింది. 
 
ఆయనఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ‘కోయ్‌ పో చి’ చిత్రంతో నటుడిగా ఆరంగేట్రం చేసిన  సుశాంత్‌ ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, పీకే, డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి, ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ, రాబ్తా, వెల్‌కమ్‌ న్యూయార్క్‌, కేదార్‌నాథ్‌, చిచ్చోర్‌, డ్రైవ్‌’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.  గొప్ప ప్రతిభ కలిగిన యువ హీరో ఇలా 34 ఏళ్లకే ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడం సినీ అభిమానుల్ని కలచివేస్తోంది.