రెండో పెళ్లికి సిద్ధమైన శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్.. వైరల్ అవుతున్న న్యూస్?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అనంతరం ఆయనకు విడాకులు ఇవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి తమ సమీప బంధువుల అబ్బాయి కళ్యాణ్ దేవ్ తో తన కుమార్తె వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు.ఈ విధంగా రెండోసారి పెళ్లి చేసుకున్న శ్రీజ తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడపడమే కాకుండా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇలా కొన్ని సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్న ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా గత కొంత కాలం నుంచి కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని బయటికి తెలియజేయలేదని అయితే ఇప్పటికే విడాకులు పూర్తి కావడంతో శ్రీజకు మూడో పెళ్లి చేయడానికి కూడా సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.అయితే తన కూతురికి మూడో పెళ్లి చేయడానికి చిరంజీవి ఇష్టపడకపోయినా కుటుంబ సభ్యులు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా కళ్యాణ్ దేవ్ కి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పలు మనస్పర్ధలు కారణంగా శ్రీజతో దూరంగా ఉంటున్నటువంటి ఈయన ఇప్పటికే విడాకులు తీసుకొని రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళ్యాణ్ దేవ్ వరుసకు మరదలు అయ్యే అమ్మాయితో తన రెండవ వివాహం చేసుకోబోతున్నారని కళ్యాణ్ దేవ్ సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.