గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని దెబ్బ కొట్టిన ఆచార్య.. మరి ఇంత తక్కువనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. “లూసిఫర్” అనే మలయాళం సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా…లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆచార్య సినిమా కంటే చాలా తక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఆచార్య ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చితే గాడ్ ఫాదర్ అందులో మూడు వంతులు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా రూ. 131 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయానికి వస్తే మాత్రం కేవలం రూ. 91 కోట్లు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ మీద పడినట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాతో నష్టపోయిన బయ్యర్లు గాడ్ ఫాదర్ సినిమా కొనుగోలు చేయడానికి భయపడి బేరాలాడినట్లు తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా నాలుగు భాషలలో విడుదలవుతున్న కూడా రూ. 100 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.