Home Cinema సెప్టెంబర్ లో విడుదల కానున్న `మూడు పువ్వులు ఆరు కాయ‌లు`

సెప్టెంబర్ లో విడుదల కానున్న `మూడు పువ్వులు ఆరు కాయ‌లు`

“యుక్త వ‌య‌సులోకి అడుగుపెట్టిన ప్ర‌తి ఒక్క‌రూ  అమ్మాయి క‌నిపిస్తే, ఇక ఆమే జీవితం అనుకుని వెంట‌ప‌డి పెళ్లి చేసుకుంటేనే  ప్రేమ ఉన్న‌ట్టు కాదు. ఆమె కాద‌న్నంత మాత్రాన జీవితాల‌నూ త్యాగం చేసేయాల్సిన అవ‌స‌రం లేదు. జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లాలంటే ప్ర‌తి ద‌శ‌నూ ఆస్వాదించాలి. గెలుపు, ఓట‌ముల‌ను అర్థం చేసుకుని ముందుకు సాగాలి“అని అన్నారు వ‌బ్బిన. వెంక‌ట‌రావు. స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న సినిమా `మూడు పువ్వులు ఆరు కాయ‌లు`.  డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పిస్తున్నారు. 40 సినిమాల‌కు పైగా సంభాష‌ణ‌ల  ర‌చ‌యితగా ప‌నిచేసిన‌ రామ‌స్వామి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.  ఈ చిత్రం ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. `అర్ధ‌నారి` ఫేమ్ అర్జున్ య‌జ‌త్‌, సౌమ్య వేణుగోపాల్‌, భ‌ర‌త్ బండారు, పావ‌ని, రామ‌స్వామి, సీమా చౌదరి కీల‌క పాత్ర‌ధారులు.  ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.  సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు. ఆద్యంతం న‌వ్వులు పువ్వులు పూయించే చిత్ర‌మ‌వుతుంది. అన్ని వ‌ర్గాల వారినీ మెప్పిస్తుంది“ అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ “న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఈ చిత్రంలో కడుపుబ్బా న‌వ్వించే హాస్య ర‌సంతో పాటు, కంట‌త‌డి పెట్టించే క‌రుణ‌ర‌సం కూడా ఉంటుంది. దాదాపు న‌ల‌భై చిత్రాల‌కు పైగా మాట‌ల ర‌చ‌యిత‌గా పని చేసిన రామ‌స్వామి దర్శకునిగా చాలా చ‌క్క‌గా చిత్రాన్నిహ్యాండిల్ చేశారు“ అని తెలిపారు.

న‌టీన‌టులు

పృథ్వి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ భ‌గ‌వాన్‌, అజ‌య్ ఘోష్‌, బాలాజీ, డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌వ‌, అప్పారావు, రంగ‌స్థ‌లం మ‌హేశ్‌, ఎఫ్ ఎం.బాబాయ్‌, ప్ర‌మోదిని, జ‌య‌ల‌క్ష్మీ, గుమ్మ‌డి జ‌య‌వాణి, చంద్ర‌రావు, ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి కెమెరా: య‌ం.మోహ‌న్‌చంద్‌, సంగీతం:  కృష్ణ సాయి, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, ఆర్ట్:  కె.వి.ర‌మ‌ణ‌, పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, ఫైట్స్:  మార్ష‌ల్ ర‌మ‌ణ‌,  నిర్మాత‌: వ‌బ్బిన‌. వెంక‌ట‌రావు, క‌థ‌-మాట‌లు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం :  రామ‌స్వామి. 

 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను...

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ...

ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా...

జ‌గ‌న్ లండన్ పర్యటన రద్దు

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. వ‌చ్చేనెల మూడో వారం నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్నందున‌.. పార్టీ శ్రేణుల‌ను స‌మాయాత్తం...

జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు...

రకుల్ వివాదంలో ఎవరిది తప్పు, తల్లిని లాగటమెందుకు?

ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన...

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా నాయక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్...

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన‌ అధికారి బ‌దిలీ..ఆయ‌న స్థానంలో!

ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది....

బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును ...యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి...

బ్రహ్మానందం ఆపరేషన్, ఆరోగ్యంపై కొడుకు వివరణ.!

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన...