Home ఆంధ్ర & తెలంగాణ 'మోమో ఛాలెంజ్' : మరో ప్రాణాంతక గేమ్ ...

‘మోమో ఛాలెంజ్’ : మరో ప్రాణాంతక గేమ్ …

కికి ఛాలెంజ్ గురించి చర్చ నడుస్తుండగానే మరో ప్రాణాంతక గేమ్ సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపిస్తోంది. ఆ కొత్త గేమ్ పేరు ”మోమో ఛాలెంజ్”.గతేడాది వందలాది మంది ప్రాణాలను బలికొన్న ‘బ్లూవేల్ ఛాలెంజ్’ తరహాలోనే ఈ కొత్త గేమ్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ డెడ్లీ గేమ్ బారిన పడి ఇప్పటికే ఒకరిద్దరు మృత్యువాత పడటం మరింత భయం రేకెత్తిస్తోంది.యూకే,మెక్సికో,ఆర్జెంటినా ,ఫ్రాన్స్ ,జర్మనీ దేశాల్లో ఈ గేమ్ విస్తృతమవుతోంది.ప్రత్యేక లింక్ ల ద్వారా వేగంగా వ్యాపిస్తున్న మోమో ఛాలెంజ్ భరత్ లోను అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు.

మోమో గేమ్ లో భాగంగా ‘బ్లూవేల్’ తరహాలో కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది.అందుకు సంబంధించిన లింక్ ‘మోమో’ ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తుంది.వారిచ్చిన పనిని పూర్తి చేయాలనీ ఆదేశాలు అందుతాయి. ఆ పని పూర్తి చేసి మోమో గేమ్ లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్ లోడ్ చేయాలి. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు పంపడం,బెదిరింపులు రావడం మొదలవుతాయి.

ఏమిటి ‘మోమో’?

భయంకరమైన శరీర ఆకృతి ,పెద్ద పెద్ద కళ్ళతో ఉన్న ఓ విచిత్ర ఆకారం పేరే ‘మోమో’ .జపాన్ కు చెందిన ఓ స్పెషల్  ఎఫెక్ట్ కంపెనీ ఈ ఆకారాన్ని రూపొందించింది.అయితే ఆ కంపెనీకి ఈ గేమ్ కు ఎలాంటి సంబంధంలేదు.కొంత మంది హ్యాకర్లు ఈ ఆకారాన్ని వాడుకొని మోమో ఛాలెంజ్ రూపొందించినట్లు అనుమానిస్తున్నారు.ఫేస్ బుక్ ,వాట్సాప్ ,యూట్యూబ్ వేదికగా ఈ గేమ్ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఆర్జెంటినాలో ఓ చిన్నారి ఈ ప్రాణాంతక గేమ్ కు బాలవ్వడంతో దీని గురించి చర్చ మొదలైంది.

ఎవరు చేస్తున్నారు?

అసలు ఈ ‘మోమో’ను ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనే వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీని వెనుక ఉన్నవారు మాత్రం ఎక్కువగా టీనేజ్ యువతీకులనే లక్యంగా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. గేమ్ లో ముందుగా …మెమోను కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్ ఇచ్చి..మెసేజ్ పంపుతూ చాట్ చేయాలంటూ ఛాలెంజ్ విసురుతారు.దానికి స్పందించడం మొదలుపెడితే పలు పనులు పూర్తి చేయాలంటూ వరసగా టాస్కులు వస్తాయి. వీటిలో ఎక్కువగా స్వీయ హాని చేసుకునేవే ఉంటాయి.

 

ఛాలెంజ్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది?

మోమో సవాల్ అందుకొని ఛాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయి.భయానక చిత్రాలు,హింసాత్మక సందేశాలతో మెసేజ్ లు పెడుతున్నారు.ఇప్పటి వరకు ఇలాంటి మెసేజ్ లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

పిల్లలు ఏం చేయాలి?

  1. తెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు వస్తే స్పందించకూడదు.

2. కొత్త నంబర్లకు మెసేజ్ లు పంపొద్దు

3.  తోటి స్నేహితులు చేస్తున్నారు కదా అని గుడ్డిగా వారి బాటలో వెళ్ళకూడదు.

4.  తేడా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి

 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను...

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ...

ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా...

జ‌గ‌న్ లండన్ పర్యటన రద్దు

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. వ‌చ్చేనెల మూడో వారం నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్నందున‌.. పార్టీ శ్రేణుల‌ను స‌మాయాత్తం...

జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు...

రకుల్ వివాదంలో ఎవరిది తప్పు, తల్లిని లాగటమెందుకు?

ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన...

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా నాయక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్...

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన‌ అధికారి బ‌దిలీ..ఆయ‌న స్థానంలో!

ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది....

బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును ...యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి...

బ్రహ్మానందం ఆపరేషన్, ఆరోగ్యంపై కొడుకు వివరణ.!

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన...