Weight gain tips: బరువు పెరిగేందుకు సులభమైన మరియు సురక్షితమైన మార్గాలు

Weight gain tips: బరువు తగ్గేందుకు కొందరు నానా తిప్పలు పడుతుంటే… మరికొందరు బరువు పెరిగేందుకు కూడా తిప్పలు పడుతుంటారు. కొంతమంది ఎంత తిన్నప్పటికీ కొంచెం కూడా బరువు పెరగరు. దీనికి ప్రధాన కారణం పోషకాహార లోపం, హార్మోన్స్ పని తీరు సరిగా లేకపోవటం. బక్కగా, పీలగా ఉండే చాలా మంది ఆత్మనూన్యతా భావంతో సమాజంలో కలిసి జీవించడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు.

దీనికెందుకు అంత బాధ…బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్స్ అన్నిటిని ఎడా పెడా తినేస్తే నెల రోజుల్లో దుక్కలా అవ్వొచ్చుగా అని కొందరు మేధావులు ఇచ్చే సలహాలు విని పాటిస్తే… బరువు పెరగడంతో పాటు అనారోగ్యాన్ని కూడా సొంతం చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల పొట్టలో కొవ్వు మరియు గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఆహరంలో చేసుకునే కొన్ని సులభమైన మార్పులతో సురక్షితంగా మీరు అనుకున్న బరువును ఎలా పొందగలరో తెలుసుకోండి.

1. మనిషి అనుభవించే ఒత్తిడి లేదా ఆందోళన మానసికంగానూ, శారీరకంగానూ దహించివేస్తుందని పెద్దలు చెప్పే మాట అక్షర సత్యం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ఆందోళన, ఒత్తిడి, ఉద్రిక్తత మీ నుండి దూరంగా ఉంచండి. దీంతో మీరు చేయాలనుకున్న ప్రతి దానిలో విజయానికి దగ్గరగా చేరతారు.

2. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం- రాత్రి భోజనం సరైన సమయానికి తినండి. ప్రతి రోజూ ఒకే సమయానికి తినేలా జీవితాన విధానాన్ని ఏర్పరుచుకోండి. మధ్య మధ్యలో పండ్లు, స్నాక్స్ ఏదో ఒక ఆహారం తింటూ ఉండండి.

2. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, అరటి పండ్లు, సలాడ్లు మొదలైనవి ఆహారంలో చేర్చండి. ఇవి శరీరానికి శక్తిని పుష్కలంగా అందిస్తాయి. వీటిని నిరంతరం తీసుకోవడంతో, శరీర బరువు పెరగడం మొదలవుతుంది. శరీరం చురుకుగా మారుతుంది, చర్మం మెరిసిపోతుంది.

3. బాదం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ మొదలైనవి మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు పోషక నిల్వలతో ఉంటాయి. ఇవి శరీర బరువును పెంచడంలో సహాయ పడతాయి. అంతేకాకుండా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. మాంసం, చేపలు, గుడ్లు వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరుచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీర బరువులో మార్పు తొందరగా వస్తుంది. ఇవి శరీర కండరాలను దృఢంగా చేస్తాయి.

5. శరీరంలోని పాత కణాలకు మరమత్తులు జరిగి మరియు కొత్త కణాలు తయారయ్యే పక్రియ ప్రతిరోజూ నిద్రలో జరుగుతుంది. కాబట్టి తప్పకుండ రోజూ తగు సమయం పాటు నిద్ర పోవటం చాలా అవసరం. నిద్ర పోవటానికి రెండు గంటల ముందుగా భోజనం చేస్తే సుఖ నిద్ర పడుతుంది.

7. మన శరీరానికి సరిపడు కేలరీల కన్నా ఎక్కువగా పొందినప్పుడు వాటిని ఖర్చు చేయకుండా ఉంచేసుకోవడం మంచిది కాదు. దీనికోసం ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలైన వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే కొలెస్ట్రాల్‌ ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే శరీర కండరాలు మంచిగా అభివృద్ధి చెందుతాయి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles