చెమటని ఖర్చు చేయకపొతే అనారోగ్యాన్ని ఫ్రీగా కొనుక్కున్నట్టే !

Physical activity also promotes health

ఈ నవశకంలో పెరిగిన టెక్నాలజీ అభివృద్ధి వలన మనిషి ఎన్నో సౌకర్యాలకు అలవాటుపడి బద్దకస్తుడిగా మారిపోయాడు. ‘చెమట అంటే నాకు చిరాకు’, ‘ నాకు చెమట వాసన నచ్చదు’ అని గర్వం పోతూ దానినే గొప్ప అనుకుంటూ తప్పులో కాలేస్తున్నారు. నిజానికి చెమటని చిందించటం వలన అనేక లాభాలున్నాయన్న సంగతి పూర్తిగా మరిచిపోయి చేజేతులా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. చెమటని ఖర్చుచేయకుండా అనారోగ్యాన్ని ఫ్రీగా కొనుక్కుంటున్నామన్న సంగతిని గ్రహించలేకపోతున్నాం.

Physical activity also promotes health

మానవజాతి సగటు జీవితకాలం నానాటికి తగ్గిపోతుంది. మన పూర్వీకులు అనారోగ్యం భారిన పడకుండా వందల సంవత్సరాలు ఆరోగ్యాంగా జీవించారంటే కారణం ఆ రోజుల్లో ఇప్పుడున్న మెషిన్లు లేకపోవటంతో అన్ని పనులు స్వయంగా చేస్తూ చెమటని చిందించేవారు. మన తాత, బామ్మలు చాలామంది తమ జీవితకాలంలో టాబ్లెట్ వేసుకోలేదని చెప్పటం వినే ఉంటారుగా? అది నిజమే. దానికి కారణం శరీరాన్ని కొంచెమైనా కష్టపెట్టటం వల్లనే ఆ ఆరోగ్యం వారికి లభించింది.

ప్రతి రోజు మనం తినే ఆహరం , పీల్చే గాలి , తాగే నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే రోగకారక రసాయన వ్యర్థపదార్థాలు, జీర్ణ క్రియ జరిగాక మిగిలిపోయే మలిన పథార్థాలను శరీరం ఎప్పటికప్పుడు స్వేథ గ్రంధుల ద్వారా బయటకి పంపుతుంది. ఇలా బయటకి పోతేనే ఆరోగ్యాంగా ఉంటాం. కానీ ఈ రోజుల్లో శారీరక శ్రమ చేయటం పూర్తిగా మానేశారు. మలినం అంతా శరీరంలోనే ఉండిపోయి అనేక వ్యాధులకు కారణంగా అవుతుంది.

ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే చివరికి నోటి నిండా తినటానికి కూడా అవకాశం ఉండదు. ఒకసారి పోయిన డబ్బుని సంపాదించుకోవచ్చు గాని, ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి సంపాదించలేం. కాబట్టి శరీరాన్ని కాసింత సేపు ప్రతిరోజూ కష్టపెడుతూ చెమటని బయటకి పంపి ఆరోగ్యాన్ని లోపలకి ఆహ్వానించండి. ‘ఆరోగ్యమే మహాభాగ్యం ‘ అనే సూక్తిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి.