అమ్మబాబోయ్… వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు !

Employees are bored on work from home

ప్రపంచాన్ని కరోనా వైరస్ కనీ వినీ ఎరుగని రీతిలో అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో కరోనా ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లి అక్కడే పని చేయాల్సి ఉండేది. ఉదయం ఆఫీసుకు రెడీ కావడం, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి రావడం ఉద్యోగుల జీవితంలో భాగమై ఉండేది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి.

Employees are bored on work from home

కానీ ఇంటి నుంచి పని చేయడం వల్ల గతంతో పోలిస్తే ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా పెళ్లైన మహిళలు ఇంట్లో పిల్లల వల్ల వర్క్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పురుషులు సైతం ఇంట్లో పని చేయడం ఇబ్బందికరంగా ఉందని, అనవసరంగా సమయం వృథా అవుతోందని… ఇంటితో పోలిస్తే ఆఫీస్ లో పని చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది పురుషులు, మహిళలు ఇబ్బందులు ఎదురైనట్టు చెబుతుంటే 45 శాతం మంది ఒత్తిడి, ఆందోళన పెరిగినట్టు వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ అవే నాలుగు గోడల మధ్యన ఉండటంతో వ్యక్తిగత జీవితానికి, పనికి వ్యత్యాసం లేకపోవడం ఒత్తిడికి కారణమవుతోందని వెల్లడించారు. సిటీ లైఫ్, రెస్టారెంట్, పబ్, పార్టీలకు అలవాటు పడిన ఉద్యోగులు వాటి కోసం తహతహలాడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కంపెనీలు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. చాలా కంపెనీలు డిసెంబర్ నెల 31వ తేదీ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ఇచ్చాయి. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులు కంపెనీలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు కోసం ఉద్యోగులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.