Home News Telangana కేటిఆర్ కు మేడ్చల్ లో రేవంత్ రెడ్డి కొత్త సవాల్

కేటిఆర్ కు మేడ్చల్ లో రేవంత్ రెడ్డి కొత్త సవాల్

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కేటిఆర్ కాంగ్రెస్ నేతలకు పదే పదే సవాళ్లు విసురుతున్నారు. నిన్న కేటిఆర్ కొడంగల్ వెళ్లి కూడా ఇదే సవాల్ ను రేవంత్ రెడ్డికి విసిరారు. కూటమి అధికారంలోకి రాకపోతే రేవంత్ సన్యాసం పుచ్చుకుంటాడా అని సవాల్ చేశారు. దానికి మేడ్చల్ లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ కౌంటర్ ఇవ్వడంతో పాటు కొత్త సవాల్ విసిరారు. ఆ వివరాలు చదవండి.

రేపు మేడ్చల్ లో సోనియాగాంధీ సభ. కేసీఆర్ వైఫల్యాల ను ఎండగట్టి ప్రజలకు సోనియా భరోసా ఇస్తారు. సోనియా టూర్ తో కేసీఆర్, కేటీఆర్ కు వనుకుడు మొదలైంది. చేసింది ఏమిలేకపోవడం తో కేసీఆర్ ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కేసీఆర్ మాటల్లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటా అంటారు కేటీఆర్ ..అమెరికా పారిపోతా అంటున్నారు.. అధికారం లేకపోతే కేసీఆర్ ప్రజలకు సేవ చేయరా ..??

సోనియా సభ ప్రకంపనలు సృష్టించబోతున్నది. యాగాలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు లను పిలిపించుకున్న ది కేసీఆర్ కాదా ..? కేసీఆర్ కు అప్పుడు చంద్రబాబు ఆంధ్రా అని గుర్తురాలేదా? నాటకమాడుతున్నడా? ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ కు గుర్తురాలేదా ..? తెలంగాణ టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి ..? రమణ, కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి లు పక్కా తెలంగాణ బిడ్డలు. 

కేసీఆర్ డ్రైవర్ అయితే కేటీఆర్ క్లీనర్. నిజాలు మాట్లాడకూడదని కేసీఆర్ కుటుంబానికి శాపం ఉన్నట్లుంది. ఇంటికి నల్ల ఇవ్వకపోతే ఓటు అడగను అని చెప్పింది కేసీఆర్ కాదా? కేసీఆర్ అసెంబ్లీల చెప్పిన రెండు లక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ పోయాయి ? జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు రాకపోతే సన్యాసం తీసుకుంటా అని మాట తప్పింది కేటీఆర్ కాదా? 

పొద్దున లేస్తే పండే వరకు నిత్యం అబద్ధాలు చెప్పే నీచమైన చరిత్ర కేసీఆర్ ది. ఆంధ్రప్రదేశ్ నీళ్లను అడ్డుకునే ప్రశ్నే రాదు. ఒకవేళ చంద్రబాబు నీళ్లను రానీయకుండా అడ్డుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎపి పైన ఉన్నది అన్న సంగతి గుర్తించుకోవాలి.  కేసీఆర్ కు ప్రాజెక్టులు కట్టడం చేతగాక చంద్రబాబు ను బూచిగా చూపెడుతున్నారు. చంద్ర బాబు పై నెపం పెట్టి ప్రజలను రెచ్చ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

కేసీఆర్, కేటీఆర్ లు అతితెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లు బిల్లా రంగా లాగ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిపోతానని ప్రయత్నించినా కేటీఆర్ ను ఎక్కడికి పారిపోనీయమ్. దోచుకున్న డబ్బును కక్కిస్తాం. కేటీఆర్ ఆర్థిక నేరగాడు. కాబట్టి ఆయన దేశం విడిచి పారిపోకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాలి. సిరిసిల్ల లలో దళితులను చిత్రహింసలు పెట్టినట్లు కొడంగల్ ప్రజలకు కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? కేటిఆర్ కొడంగల్ ను దత్తత తీసుకుంటే అదే చేస్తారా? 

దళిత పిల్లలను కేటిఆర్ నీ కొడుకు తో పోల్చుతావా ? కేసీఆర్ మనవడైతే వాళ్లకు గొప్ప ప్రజలింకేంటి గొప్ప? ప్రజాకూటమి అధికారం లోకి రావడం ఖాయం. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి కల్పించడం ఖాయం. 

రేవంత్ సవాల్ ఇదే :

అసెంబ్లీ ఎన్నికల్లో నాతో సవాల్ చేసేందుకు కేటీఆర్ ఓనర్ కాదు ..పనోడు. ఎమ్మెల్యే ఎన్నికలలో కాదు చేతనైతే ఎంపీ ఎన్నికల్లో పోటీపడదాం. గతంలో కేసీఆర్ పోటీచేసిన మహబూబ్ నగర్ ఏఎంపీ సీటులో పోటీకి రా. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం పోటీ పడదాం. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. కేటిఆర్ నీకు చేతనైతే నా సవాల్ ను స్వీకరించాలి. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కడే కాదు మరికొందరు ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. టిఆర్ఎస్ లో అవమానాలు భరించలేక వారు పారిపోయే పరిస్థితి ఉంది. వారు ఎవరో? ఎప్పుడొస్తారరో ఇప్పుడు చెప్పను. తినబోతూ రుచులెందుకు? ఎంపీలే కాదు ఎమ్మెల్సీ లు కూడా వస్తారు. నిజంగా కెసిఆర్ కు, కేటీఆర్ కు దమ్ముంటే వారిని ఆపుకోరి చూద్దాం. 

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

దిల్ రాజు భారీ న‌ష్టాల్ని చ‌విచూస్తున్నారా?

సినీ ఇండ‌స్ట్రీని క‌రోనా వైర‌స్ చావు దెబ్బ‌తీసింది. దీని కార‌ణంగా మార్చి 25న రిలీజ్‌కావాల్సిన చిత్రాల‌న్నీ వాయిదా ప‌డిన విష‌యం తెలిసందే. అందులో దిల్ రాజు నిర్మించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వి` కూడా...

మియా ఖ‌లీఫా అంటూ ఆట‌ప‌ట్టిస్తున్ననెటిజ‌న్స్‌!

సోష‌ల్‌మీడియా ప్ర‌భావం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి హీరోల కంటే హీరోయిన్‌లే అత్య‌ధికంగా నెటిజ‌న్స్‌ని ఆక‌ర్షించ‌డం కోసం నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. త‌మ క్రేజ్‌ని పెంచుకోవ‌డానికి హాట్ హాట్ హాట్...

మ‌ణిర‌త్నంకే ప్ర‌పోజ్ చేసింది!

ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకే ఓ హీరోయిన్ ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. భార‌తీయ సినీ తెర‌పై మ‌ణిర‌త్నంది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రాల్నీ ఆణిముత్యాలే. జాతీయ స‌మ‌గ్ర‌త‌రి చాటిచెప్పిన ఆయ‌న...

ఎవ‌రీ మాస్కు వీరుడు!

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండం చేస్తున్న వేళ ఇది. దీని కార‌ణంగా దేశాన్ని కాపాడ‌టం కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ మ‌హ‌మ్మ‌రిని త‌రిమేయాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే మార్గం అని న‌మ్మి 21...

యువీని బ్యాన్ చేయ‌మంటున్నారా?

ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు హీరోలాగే కూల్ అనుకున్నారంతా, కానీ తాజాగా వారిలోనూ అస‌హ‌నం మొద‌లైంది. దానికి కార‌ణం యువీ క్రియేష‌న్స్ నిర్మాత‌లే అని తెలిసింది. యువీలో ప్ర‌భాస్ `మిర్చి`. సాహో...

CCC నిధిపై తెరాస స‌ర్కార్ క‌ర్చీఫ్‌!

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు చారిటీ సంస్థ‌ను రిజిస్ట‌ర్ చేయ‌క‌పోయినా మెగాస్టార్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్...

బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో...

లాక్‌డౌన్‌కి తూట్లు పొడిచిన యూవీ క్రియేష‌న్స్

లాక్ డౌన్ తో జ‌నజీవ‌నం స్థంబించిపోయింది. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్. డాక్ట‌ర్లు..ఆరోగ్య శాఖ సూచ‌న‌లు పాటిస్తూ అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. దాదాపు సెల‌బ్రిటీలంతా అవేర్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నంచేస్తున్నారు. సినీ...

కొడుకు క్వారంటైన్‌లో ఉంటే వెట‌ర‌న్‌ న‌టి వేషాలేమిటి?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని చుట్ట‌బెట్టేస్తోంది. భార‌త్ ప‌రిస్థితి కొంత ఓకే కానీ పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య‌..మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌భుత్వం ఎంత ప‌టిష్టంగా...

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

ప్ర‌స్తుత లాక్ డౌన్ తో మాకు ప‌నిలేద‌న్న‌ట్లుగానే మాట్లాడారు అగ్ర నిర్మాత‌...ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య. ఎట్టి ప‌రిస్థితిల్లో 2021 జ‌న‌వ‌రి 8న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం...