Home News Telangana కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో రేవంత్ వర్గానికి మూడు సీట్లు

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో రేవంత్ వర్గానికి మూడు సీట్లు

టిడిపి నుంచి తనతోపాటు తన వర్గంగా చాలా మంది సీనియర్లు, జూనియర్లను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలో కొందరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు నేతలు తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయితే రేవంత్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ లో తొలి జాబితాలో మెరుగైన స్థానాలే దక్కాయని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి వర్గం వారెవరు? వారికి ఎన్ని సీట్లు వచ్చాయి? వివరాలు చదవండి.

రేవంత్ రెడ్డి ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు ములుగు సీతక్క,  పెద్దపల్లి విజయరమణారావు, మాజీ మంత్రి బోడ జనార్దన్, తోటకూరి జంగయ్య యాదవ్, ఓయు జెఎసి నేత రాజారాం యాదవ్, బాల లక్ష్మి, మేడిపల్లి సత్యం తదితరులు కాంగ్రెస్ గూటికి చేరారు.

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

రేవంత్ రెడ్డి టిడిపిలో వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ లోనూ వర్కింగ్ ప్రసిడెంట్ పదవి దక్కింది. ములుగు సీతక్కకు జాతీయ స్థాయిలో మహిళా కాంగ్రెస్ లో పదవి దక్కింది. మరికొందరు నేతలకు పదవులు వస్తాయన్న ఆశతో ఉన్నారు.

అయితే తాజాగా వివాదాలు లేని సీట్లకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా సిద్ధం చేసింది. 41 మందితో ఆ జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాను నవంబరు 2వ తేదీన వెలువరించే చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ జాబితాతోపాట మరికొన్ని పేర్లు యాడ్ చేసిన 50 మంది వరకు తొలి జాబితాలో పేర్లు వెల్లడయ్యే చాన్స్ ఉంది.

వేం నరేందర్ రెడ్డి, మాజీ టిడిపి ఎమ్మెల్యే

అయితే కాంగ్రెస్ పార్టీ వెలువరించనున్న తొలి జాబితాలో రేవంత్ వర్గానికి మూడు సీట్లు దక్కినట్లు తెలుస్తోంది. అందులో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, పెద్దపల్లి నుంచి విజయరమణారావు కు సీట్లు ఖరారు చేశారు. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన వారిలో మరికొందరు నేతలు కూడా సీటు ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, ఆర్మూరు నుంచి రాజారామ్ యాదవ్, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి,  మేడ్చల్ నుంచి తోటకూర జంగయ్య యాదవ్ ఇలా మొత్తం 15 మంది వరకు రేవంత్ జాబితా ఉన్నట్లు చెబుతున్నారు.

మహా కూటమి ఫైనల్ అయిన తర్వాత లిటిగేషన్ లో ఉన్న సీట్లను క్లియర్ చేసే పని చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ కోరుతున్న 15 మంది జాబితాలో మరో 12 మందికి సీట్లు రావాల్సి ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో చేరే సమయంలోనే రేవంత్ తనతోపాటు వచ్చే వారి జాబితాను ఎఐసిసి నేతలకు అందజేసినట్లు తెలుస్తోంది. 

ఓయు జెఎసి నేత రాజారాం యాదవ్

రేవంత్ భరోసాతోనే టిడిపి నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ములుగు సీతక్కను టిఆర్ఎస్ లో చేర్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అయినా దొరల స్వభావాన్ని వ్యతిరేకించే సీతక్క టిఆర్ఎస్ వైపు అడుగులు వేయలేకపోయారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె రేవంత్ తో సహా కాంగ్రెస్ గూటికి చేరారు.

రేవంత్ రెడ్డి కానీ, సీతక్క కానీ, పెద్ద పల్లి విజయరమణారావు కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ ఏనాడూ వారు టిడిపి పార్టీపై పల్లెత్తు మాట అనలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును కూడా ఏనాడూ విమర్శించలేదు. టిడిపి ఇంకా మా పార్టీనే అన్న భావనలో వారు ఉన్నారు.  

అయితే రేవంత్ తో పాటు పార్టీలో జాయిన్ అయిన వారిలో ఎవరికి వస్తాయి? కూటమిలో భాగంగా ఎవరికి రాకుండా ఉండే చాన్స్ ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...