Home News Telangana హరీష్ రావు నల్ల త్రాచు లాంటోడు : రేవంత్ ఫైర్                  

హరీష్ రావు నల్ల త్రాచు లాంటోడు : రేవంత్ ఫైర్                  

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఎల్పీ ఆవరణలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు లాభమా? నష్టమా అన్న అంశంపై ఆదివారం తెలంగాణ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరుపున హాజరైన వారు తెలంగాణ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సుదీర్గమైన మీడియా సమావేశంలో హరీష్ కాంగ్రెస్ ను తిట్టడానికే పరిమితమయ్యారు. అయితే జెఎసి లేవనెత్తిన సందేహాలకు మాత్రం హరీష్ సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో హరీష్ పై రేవంత్ విమర్శల దాడికి దిగారు. రేవంత్ ఏమన్నారో కింద చదవండి.

నీళ్ల ను అడ్డపెట్టుకుని ప్రభుత్వం వేల కోట్లు దోచుకుంటున్నది. తెలంగాణ భావి తరాలను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. 11వేల కోట్లు ప్రాణహిత కు నాటి కాంగ్రెస్ ఖర్చు చేసింది. 34 వేల కోట్ల నుండి డిజైన్ మార్చి కాలేశ్వరం పేరుతో 84వేల కోట్లకు కేసిఆర్ ప్రభుత్వం పెంచింది వాస్తవం కాదా? మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా హరీష్ ఎదురుదాడి చేశారు. నల్ల తాచు కంటే ఎక్కువ విషాన్ని హరీష్ కాంగ్రెస్ ,జేఏసీ లపై కక్కుతున్నారు. ఏ రోటికాడ ఆ మాట హరీష్ పాడుతుంది హరీష్ రావే. సూర్యాపేట, పెద్దపల్లి, కరీం నగర్ లో హరీష్ చెప్పిన మాటలు గుర్తున్నాయా ఇంతకు ఎవరికి తొలి ఫలితం కింద నీళ్ళు వస్తాయో హరీష్ చెప్పాలి. నిళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలని టీఆరెస్ చూస్తున్నది. కేసీఆర్ కొత్తగా మొదలు పెట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు హరీష్ చెప్పాలి. హరీష్ పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, ప్రాణహిత, నిజాం సాగర్ ఎక్కడికొస్తావో చెప్పు. నేను వస్తా బహిరంగ చర్చ జరుపుదాం. అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం లా కేసీఆర్, హరీష్ లు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు.

ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టులో భాగంగా 17 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాన్ని కెసిఆర్ ప్రభుత్వం ఆపింది నిజం కాదా? కాంట్రాక్టర్ లు కమిషన్ ఇవ్వనందుకే కేసీఆర్ ఎస్ఎల్ బిసి పనులను ఆపారు. ఉద్యమ సమయంలో కానీ, మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా రీడిజైన్ ల గురించి టీఆర్ఎస్ ప్రస్తావించని మాట నిజం కాదా? కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకునేందుకే ప్రాజెక్టు ల రీడిజైన్, మిషన్ భగీరథలు తప్ప జనాలకేం లాభం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నింస్తుంటే మాపై దూషణలకు దిగుతున్నారు. కొడుకు, అల్లుడుకు తండ్రి కేసీఆర్ వాటాలు పంచుతున్నారు. నేను హరీష్ కు సవాల్ విసురుతున్నాను. సాగునీటి ప్రాజెక్ట్ లపై బహిరంగ చర్చకు హరీష్ సిద్ధమా? గన్ పార్క్ దగ్గరైనా ..ప్రెస్ క్లబ్ లోనైనా చెప్పు ..వచ్చెనందుకు నేను రెడీ. మా వాదన తప్పైతే నేను ముక్కు నెలకు రాస్తా. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టొద్దని నాడు నిపుణులు నివేదిక ఇచ్చింది నిజం కాదా? టోపోగ్రఫి, డ్రోన్ సర్వేలతో చెప్పిన రిపోర్ట్ నిజం కాదా ? కాళేశ్వరం ముసుగులో లబ్ధిదారులు, సూత్రదారులు, వాటాదారులు ఎవరో చెప్పాలి. కాళేశ్వరం పూర్తయితే బ్యాంక్  లోన్ ల కారణంగా ఎకరాకు ఒక లక్ష 54 వేలు ఖర్చవుతుంది. ఈ ప్రభుత్వం తీరుతో భారం ఎవరు భరించాలి?

కుటుంబ దోపిడీకి మేము వ్యతిరేకమే తప్ప ప్రాజెక్టు లకు కాదు. కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీకి బరాబర్ మేము వ్యతిరేకమే. కెసిఆర్ ..నీళ్ల ముసుగులో చేస్తున్న దోపిడీకి మేము అడ్డం పడతం. కాళ్ల సందుల కట్టెలు పెట్టుడు కాదు మీ దోపిడీకి అడ్డంగా బరాబర్ గా నిలబడతాం. ప్రభుత్వం చేసిన రెండున్నర లక్షలు కోట్ల అప్పును పంచితే ప్రజలకు ఒక్కొరికి లక్ష రూపాయలు ఇవ్వొచ్చు. ప్రాజెక్టు ల నిర్మాణం గురించి హరీష్ కు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి ఉందా? ప్రాణహిత చేవెళ్ల, పాలమూర్ రంగారెడ్డి లు కాంగ్రెస్ మానస పుత్రికలు. ప్రాజెక్టు లపై హరీష్ చెప్పిన అబద్దాలు నమ్మొద్దు. పోలవరానికి వేల ఎకరాలను ఆంధ్రాకు ఇచ్చిన కేసీఆర్ మహారాష్ట్ర నుండి 1800 ఎకరాలను ప్రాణహిత కోసం తేలేకపోయారు. మహారాష్ట్రకు  ప్రాజెక్టు లోనే కాదు ..నీళ్ల లో చేపలల్లో వాటా ను కెసిఆ రాసిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం లో అందరు కేడీలే. హరీష్ భూములకు ఇస్తున్న 12 లక్షల రూపాయలను సామాన్య రైతుల భూములకు ఎందుకు ఇవ్వరు? హరీష్ భూములు ఏమైనా బంగారమా? హరీష్ కు నీతి నిజాయితీ ఉంటె నీళ్ళు -నిజాలపై చర్చ కు రావాలి.

Recent Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అసైన్డ్ భూముల సేకరణ వైసిపికి మెడ మీద కత్తే!

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అందుకు అవసరమైన భూముల సేకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు ఇతర రెవిన్యూ సిబ్బంది...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...

నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త...

త‌రుణ్‌భాస్క‌ర్ ఇలా షాకిచ్చాడేంటి?

టాలీవుడ్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా అందించిన త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా సినిమా చేసి దాదాపు రెండేళ్ల‌వుతోంది. `మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలా హ‌డావిడిగా ఈ...

తేజ బర్త్‌డేకు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చాడు!

కెరీర్ తొలి నాళ్ల‌లో ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నం సృష్టించిన తేజ జోరు ఇటీవ‌ల బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు.. నిర్మాత‌ల‌తో వివాదాలు.. ఇక సినిమాలు ఆపేయాలేమో అనే స‌మ‌యంలోనే రానాతో `నేనే రాజు నేనే...

`భీష్మ‌` ఓపెనింగ్ అదిరింది!

నితిన్ న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. టీజ‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ మొద‌లైంది. తొలి రోజు తొలి షో నుంచి హిట్ టాక్ రావ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అని...

ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌యోగం!

సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ మాత్ర‌నమే మాట్లాడుతుంది. ఏదైనా చేస్తుంది. ఎంత వ‌ర‌కైనా తీసుకెళుతుంది. అడ‌గ‌ని అంద‌లం ఎక్కిస్తుంది. అదే ఒక్క ఫ్లాప్ ప‌డిందా అదఃపాతాళానికి తొక్కేస్తుంది. దీన్ఇన బ‌ట్టే ఇక్క‌డ క‌థ‌లు, కాంబినేష‌న్‌లు,...

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

"విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు," అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. "రాజధాని గుండె పగిలింది" అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. "రాజధాని అక్రమాలపై సిట్" అంటూ మరో...

Featured Posts

సిట్ ఏర్పాటుపై తెలుగు దేశం గుండెల్లో పరిగెత్తుతున్న రైళ్లు 

ప్రతివారం మొక్కు తీర్చుకుంటున్నట్లే ఈ వారం కూడా తన బాధ ప్రపంచం బాధ అన్నట్లు రోతపలుకుల రాధాకృష్ణ  "రాజు కక్షకు రాజ్యం బలి" అనే మకుటం కింద   వలవల ఏడుస్తూ మనలను కూడా...

అయిదు ఏళ్ల పాలనపై సిట్! నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

రాష్ట్ర విభజన తర్వాత అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం సాగించిన పరిపాలన పై మొత్తంగా విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహుశా దేశంలోనే ఈలాంటి విచారణ ఇంతకు...

ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు...