Home News Telangana హామీలేమాయే సీఎం సారూ?

హామీలేమాయే సీఎం సారూ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను గాలికి వదిలేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది గడిచినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంలా ఉంది. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక్క హామీని కూడా నేరవేర్చలేదు. పైగా అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపైనే కాలం వృధా అయిందని తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచేందుకు బాగా ఉపయోగపడిన రైతు బంధు పథకాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఖరీఫ్ సీజన్ రైతు బంధు ద్వారా చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు ఇంకా తమ ఖాతాల్లో పడలేదు. రబీ సీజన్ కూడా మొదలైనప్పటికీ ఖరీఫ్ డబ్బులు రాకపోవడంతో ఇంతకు వస్తాయా రావా అనే మీమాంసలో రైతులు ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రైతుబంధు పథకాన్ని ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలు చేయనున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చతికిల పడినట్లు తెలుస్తుంది. రైతులకు ఒక లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ రుణమాఫీ ఏ విధంగా చేస్తారో కూడా మార్గదర్శకాలను రూపొందించలేదు. ఖరీఫ్ సీజన్ లోనే రుణమాఫీ అవుతుందని రైతులు ఆశించారు కానీ రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు.

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61ఏళ్లకు పెంచనున్నట్లు మెనిఫేస్టోలో పొందుపర్చారు. కానీ ఇప్పటికీ వేలాది మంది ఉద్యోగులు రిటైరయ్యారు. కానీ వయో పరిమితిపై చర్చ కూడా చేయడం లేదు. అంతేకాకుండా పీఆర్సీ ఇదే ఏడాది జూలై నెలలోపూ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ పీఆర్సీపై ఇప్పటి వరకూ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఇప్పుడు, అప్పుడు అని కాలయాపన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్ వైఖరీపై నిరాశతో ఉన్నట్లు సమాచారం. రెవెన్యూశాఖలో సంస్కరణల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తుంది. దీంట్లో భాగంగానే పదుల సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు తనువు చాలించిన విషయం తెలిసిందే. భూ సర్వే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన రెవెన్యూ ఉద్యోగుల ఇబ్బందులకు గురి చేయడంపై ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. అదను దొరికితే ప్రభుత్వంపై తిరగబడాలని ఎదురు చూస్తున్నారు.

ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని 2014 సాధారణ ఎన్నికల మెనిఫేస్టోలో పొందుపర్చారు. కానీ ఇప్పటి వరకూ వాటిని పూర్తిస్దాయిలో అమలు చేయలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలోనే డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చినట్లు అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. దీన్నిబట్టి ఈ సారి కూడా డబుల్ బెడ్ రూమ్ లు లేనట్లే. రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకూ ఉచిత విద్యను అమలు చేస్తామని 2014, 2018 ఎన్నికల మెనిఫేస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ వీటిలో పరిమిత సంఖ్యలోనే విద్యార్థి, విద్యార్థినీలకు సీట్లుంటాయి. అంతేకాకుండా ఈ విద్యాసంస్థల్లో కేజీ టూ పీజీ అమలు కావడం లేదు. ఒక పక్కా గురుకుల సంఖ్య పెంచుతూనే.. విద్యార్థుల సంఖ్య లేదని ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి 6శాతమే ఖర్చు చేస్తున్నట్లు అధికారులు ఇచ్చినట్లు లెక్కల ప్రకారం తెలుస్తుంది. పేదల ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ అద్భుతంగా పనిచేస్తుందని ప్రకటించింది. కానీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఆసుపత్రులకు పెండింగు బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో రోగులకు కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి 3.5శాతమే ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. దీన్నిబట్టి ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ద ఉందో తెలుస్తుంది.

ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికుల పింఛన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. కొత్త పింఛన్ దారులకు 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు వయో పరిమితిని తగ్గించనున్నట్లు వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకుగానూ పెరిగిన పింఛన్ డబ్బులను ప్రభుత్వం చెల్లించలేదు. కొత్త పింఛన్ దారులకు వయో పరిమితి తగ్గింపుపై ఇప్పటి వరకూ మార్గదర్శకాలను విడుదల చేయలేదు. పైగా దరఖాస్తులను కూడా స్వీకరించడం లేదు. దీంతో రాష్ట్రంలో సుమారు 5మంది లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోల్ బ్యాక్ అయిన పింఛన్లదారులకు ఇప్పటి వరకూ పించన్లు రాలేదు. సుమారు ఏడాదిన్నర నుంచి రోల్ బ్యాక్ అయిన పింఛన్ దారులు ఎదురుచూస్తున్నారు. లిక్కర్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. నూతన మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వం రూ. 22వేల కోట్లు దండుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దరఖాస్తుల ద్వారా రూ.980కోట్లను ప్రభుత్వం లబ్ధిపొందిన విషయం తెలిసిందే.
ఎస్సీ, ఎస్టీలకు 3ఎకరాల భూమి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కానీ ఇప్పటి వరకూ కేవలం 3వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసి చేతులను దులుపుకున్నది. ఈ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో ప్రణాళికలను కూడా రూపొందించడం లేదు. దీంతో దళిత, గిరిజనులు కూడా తీవ్ర నిరాశలతో ఉన్నట్లు తెలిసింది. నిరుద్యోగుల ఉపాధి అవకాశాల కోసం ఒక్క నోటిఫికేషన్ ను కూడా జారీచేయలేదు. టీఎస్పీఎస్ ద్వారా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. అంతేకాకుండా నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3016లు భృతి కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతిపై ఎలాంటి విధి, విధానాలు రూపొందించలేదు.

మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పి రెండు మూడు మీటింగు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఖరీఫ్, రబీ ధాన్యం కొనుగోలును మహిళా సంఘాలు ద్వారా చేపట్టి అయా గ్రామాల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దానిపై ఎలాంటి పురోగతి లేదని తెలిసింది. అంతేకాకుండా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కూడా ఇంకా అమలు చేయడం లేదు. దాంతో మహిళా సంఘాలకు ఇప్పటికీ బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాల కోసం తిరుగుతున్నారు. ఇలా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏడాది కాలం కేసీఆర్ పాలన కాలయాపనకే పరిమితమైంది. కానీ ఎలాంటి కొత్త కార్యక్రమాలను చేపట్టలేదని తెలుస్తున్నది.

అంతేకాకుండా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను కూడా ఇంకా అమలు చేయడం లేదు. దాంతో మహిళా సంఘాలకు ఇప్పటికీ బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాల కోసం తిరుగుతున్నారు. ఇలా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏడాది కాలం కేసీఆర్ పాలన కాలయాపనకే పరిమితమైంది. కానీ ఎలాంటి కొత్త కార్యక్రమాలను చేపట్టలేదని తెలుస్తున్నది. ఇక మీద‌ట ఈ హామీల‌న్నీ నెర‌వేరుస్తార‌ని ఆయ‌న హామీల‌న్నీ కూడా ఒక్కొక్క‌టిగా ముందుకు తీసుకువెళతార‌ని ప్ర‌జాసంఘాలు భావిస్తున్నాయి.

Recent Post

శాసనమండలి రద్దు తొందరపాటు నిర్ణయమా?  

పుష్కరం క్రితం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతులమీదుగా పునరుద్ధరించబడిన శాసనమండలి నేడు ఆయన కుమారుడి చేతులమీదుగా ఉనికిని కోల్పోవడం యాదృచ్చికం కావచ్చు.  దేశంలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటె, కేవలం...

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

Featured Posts

అమరావతి నిజంగా “కమ్మరావతి” అవకుండా పోతుందా?

భోగిమంటల్లో కాలిన నివేదికలే గొప్ప అమరావతి చారిత్రక నగరం. శాతవాహనుల నగరం. బౌద్దుల నగరం. అవన్నీ నిజమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసిన "అమరావతి"లో ఆ చారిత్రక నగరం ఉందా? ఈ...

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...